జ‌గ‌న్  ప‌క్క‌లో  బ‌ల్లెం!

Publish Date:Jul 22, 2022

Advertisement

రాజా, మీ ఆజ్ఞ శిరోధార్యం, మీకోసం రాజ్యంకోసం మ‌ర‌ణాన్న‌యినా లెక్క‌జేయ‌ను.. అంటాడు స‌త్య నారా య‌ణ ఓ పాత సినిమాలో. కానీ రాజు స‌త్య‌నారాయ‌ణ వెన‌కే వేగుల్ని పెట్టి న‌మ్మ‌కం కోల్పోయేలా చేసుకుంటాడు. దాదాపు అదే సీన్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో జ‌రుగుతోంది. జ‌గ‌న్ పార్ల‌మెంటుకి పంపిన‌ ఎం.పీ ర‌ఘురామ కృష్ణం రాజు ఆయ‌న్నే నిల‌దీస్తున్నారు. మ‌నోడు మ‌నోడు అనుకుంటే న‌చ్చ‌ట్లే ద‌న్న దిట‌ వెన‌క‌టికి  ఒకామె. అదుగో అలా త‌యారైంది జ‌గ‌న్‌, ర‌ఘురామ‌ల మైత్రి. ఒకే పార్టీ అయినా న‌మ్మ‌కం పోయిన త‌ర్వా త అధినేత‌యినా పార్టీ కార్య‌క‌ర్త‌యినా ఎం.పీ గారికి తిట్ట‌డానికి పెద్ద అడ్డేమిటి. జ‌గ‌న్ పాల‌నా విధానం, ఆయన మంత్రివ‌ర్గ నిర్ణ‌యాలు ఏమాత్రం ఆయ‌న‌కు రుచించ‌డం లేదు. త‌ప్పుల త‌డ‌క పాల‌న‌తో ప్ర‌జల‌ను మ‌భ్య‌పెట్ట‌డం త‌ప్ప జ‌గ‌న్ వాస్త‌వంగా ప్ర‌జాభిమానాన్ని చూర‌గొనే స్థాయిలో పాల‌న సాగించ‌డం లేద న్న‌ది ర‌ఘుమా అభిప్రాయం..కాదు.. గ‌ట్టి న‌మ్మ‌కం. అందుకే ఆయ‌న  వైసీపీ అధిష్టానా నికి కొరకరాని కొయ్య గా మిగిలారు. జ‌గ‌న్ ప్ర‌తీ మాట‌ని, అడుగునీ విమ‌ర్శిస్తూ అయోమ‌యానికి గురిచేస్తు న్నారు ఎం.పీ.

ర‌ఘురామ  అధిష్టాన పెద్దలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. వైసీపీ సభ్యుడైనా.. రాష్ట్ర ప్రభుత్వ విధానా లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. వేదిక ఏదైనా ఆయన నేరుగా సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.  ఇదే జ‌గ‌న్‌కు బొత్తిగా మింగుడుప‌డ‌ని సంగ‌తి. మ‌నోడ నుకుంటే ఇలా తీవ్రంగా విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించ‌డ‌మేమిట‌ని లోలోప‌ల జ‌గ‌న్ తెగ బాధ‌ప‌డు తున్నా రు. ప్రభుత్వ వైఫ ల్యాలను తప్పుపడుతున్నారు. గణాంకాలతో  కడిగి పారేస్తున్నారు. సొంత పార్టీ ఎంపీని కట్టడి చేయ లేని స్థితిలో వైసీపీ ఉంది. ఆయనపై  వేటు వేయడానికి  చేయని  ప్రయత్నమంటూలేదు. కానీ వీలు పడడం లేదు. పోనీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఆయన మరింత  రెచ్చిపోతారని  భావిస్తోంది. 

వ‌దిలేస్తే కాసేపాగి మ‌ళ్లీ ఇంటికి వ‌చ్చే చిన్న‌పిల్లాడుకాదు ర‌ఘురామ‌. ఆయ‌న  బీజేపీ గూటికి చేరి మరిన్ని ఇబ్బందులు పెడతారని  వైసీపీ భయం. 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున నర్సాపురం నుంచి ఎంపీగా గెలి చిన ఆయన తొలినాళ్ల‌లో  అధిష్టానంతో సఖ్యత గానే నడిచారు. కానీ తరువాత విభేదాలు పొడచూపాయి. పార్టీ విధానాలను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆయనపై కేసులు నమోద య్యాయి. అరెస్టులు కూడా జరిగాయి. తనపై భౌతిక దాడిచేశారంటూ ఆయన కోర్టును ఆశ్రయిం చారు. మొత్తానికి అయితే రఘు రామరాజు అంటేనే ఇప్పుడు వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారు. ఆయన ఎప్పుడు ఏం వ్యాఖ్యాలు చేస్తారో తెలియక సతమతమవుతున్నారు. 

తాజాగా లోక్ సభలో ఆయన ఏపీ ప్రభుత్వ ఆర్థిక విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీనిని వైసీ పీ ఎంపీలు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. పెద్ద గలాటానే చోటుచేసుకుంది. ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఛీ మీ ముఖం చూసి మాట్లాడలేనంటూ ఆయన చేతిని ముఖానికి అడ్డంగా పెట్టుకొని మాట్లాడాల్సి వచ్చింది. ఇది లోక్ సభలో పెద్ద చర్చకే దారితీసింది.ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై రఘురామరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో రఘురాజు మాట్లాడారు. ఏపీ సర్కారు ఇష్టారాజ్యంగా అప్పలు చేస్తోందని.. కనీస నిబంధనలు పాటించడం లేదని ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్ ఆదాయంపై అప్పులు చేయడం ఎక్కడైనా ఉందా? అని నిలదీశారు. కార్పొరేషన్ల పేరిట ఎడాపెడా అప్పులు చేస్తోందన్నారు. 

తాజాగా ఏపీ బేవరేజెస్ తరుపున అప్పులు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రభుత్వ ఖాజానాకు రావా ల్సి న ఆదాయాన్ని ఏపీ బేవరేజెస్ లోకి మళ్లించి…అదో ఆదాయ వనరుగా చూపించి అప్పులు చేస్తు న్నార ని ఆరోపించారు. అవసరమైతే తన దగ్గర ఆధారాలున్నాయని కూడా చెప్పారు. దీనిపై వైసీపీ ఎంపీలు మార్గని భరత్, వంగ గీతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. రఘురామతో వాదనకు దిగారు. దీనికి రఘురామ కూడా దీటుగా స్పందించారు. సిట్ డౌన్ అంటూ హెచ్చరించారు. అసలు మమ్మల్ని కూర్చోవడానికి మీరె వరు అంటూ ఆ ఇద్దరు ఎంపీలు ప్రశ్నించారు. దీనిపై స్పీకర్ స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ స్పం దించారు. తనను చూసి చెప్పాలని సూచించారు. దీంతో వైసీపీ ఎంపీలు అభ్యంతరాలు చెబుతున్నా. .రఘురామ మాత్రం తన ముఖానికి చేతిని అడ్డంగా పెట్టుకొని తాను చెప్పాలనుకున్నది చెప్పేశారు. అయితే మొత్తానికి లోక్ సభ వేదికగా వైసీపీ ఎంపీల మధ్య జరిగిన రచ్చ మాత్రం తోటి సభ్యలుకు వినోదం పంచింది.

By
en-us Political News

  
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.