దాత చేయూతతో పాఠశాల భవనాన్ని.. కార్పొరేట్ స్థాయిలో నిర్మించారు

Publish Date:Jul 20, 2025

Advertisement

 

దాత చేయూతతో ఓ ప్రభుత్వ పాఠశాల భవనాన్ని కార్పొరేట్ స్థాయిలో ఆధునికీకరించారు. ఆ పాఠశాలలో సుమారు 800 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. చక్కటి ఏకరూప దుస్తులు, మెడలో టై, కాళ్లకు బూట్లు ధరించి ప్రతిరోజు సుమారు 420 పిల్లలు బస్సుల్లో పాఠశాలకు వెళ్తారు. అలాగని ఆ పాఠశాల ఏదో పట్టణంలో లేదు ఓ మారుమూల పల్లెటూరులో ఉంది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్ లో ఉంది ఈ పాఠశాల. ఇదే గ్రామానికి చెందిన కావేరి విత్తన సంస్థ ఎండి, గుండవరపు భాస్కరరావు ఊరితో పాటు పాఠశాలను దత్తత తీసుకొని ఆధునికీకరించారు. ఆధునికీకరించిన పాఠశాల భవనంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు కొనసాగుతున్నాయి. 

సమీపంలోని 11 గ్రామాల నుండి 420 మంది పిల్లలను పాఠశాలలకు తీసుకురావడానికి మూడు బస్సులు ఏర్పాటు చేశారు. డ్రైవర్లు, క్లీనర్ల వేతనాలు డీజిల్ కోసం దాత భాస్కర్ రావు ప్రతినెల 1.50 లక్షలను వెచ్చిస్తున్నారు. విద్యార్థులకు ఏటా రెండు జతల ఏకరూప దుస్తులు, బ్యాగు, బెల్ట్, టై అందిస్తున్నారు. పాఠశాలలో అవసరమైన ప్రైవేటు ఉపాధ్యాయులను, ఆయాలను నియమించి వారి వేతనాలను తనే చెల్లిస్తూ ఔధార్యాన్ని చాటుతున్నారు. పాఠశాలలో 17 మంది ప్రైవేటు ఉపాధ్యాయులను నియమించి వారికి వారితోపాటు బస్సులను, డ్రైవర్లను, క్లీనర్లను కూడా నియమించి వారి ఖర్చులు కూడా దాత భాస్కర్ రావు భరిస్తున్నారని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లు తెలిపారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం కూడా అందిస్తున్నరన్నారు. 

పాఠశాలలో ఇతర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను చేర్చుకోవడం లేదని కేవలం ప్రైవేట్ పాఠశాలల నుండి వస్తున్న విద్యార్థులు మాత్రమే చేర్చుకోవడం జరుగుతుందన్నారు. విద్యార్థుల సంఖ్యలో హనుమకొండ జిల్లాలోనే పాఠశాల ప్రథమ స్థానంలో ఉందని, రానున్న రోజుల్లో 1000 మందికి పైగా విద్యార్థులకు పాఠశాలలో విద్యాబోధన చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారన్నారు. నవోదయ, గురుకుల పాఠశాలల పోటీ పరీక్షలకు కూడా విద్యార్థులకు బోధన చేయడం జరుగుతుందన్నారు. దాత భాస్కర్ రావు పాఠశాలకు వస్తున్న పేద విద్యార్థుల కోసం ప్రతినెల సుమారు 14 లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. దాత భాస్కర్ రావు కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలకు వసతులు కల్పించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తమ పిల్లలు ప్రతిరోజు పాఠశాలకు వెళ్లి రావడానికి బస్సు సౌకర్యం  ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

By
en-us Political News

  
అయితే ఆమె కొత్త రాజకీయ పార్టీ ప్రకటన.. ఏపీ రాజకీయాలలో కూడా సంచలనం సృష్టించింది. ఆమె పార్టీ ప్రకటన వైసీపీకి ఒకింత ఇబ్బందికరంగా మారగా, తెలుగుదేశం, జనసేన పార్టీల్లో జోష్ ను నింపింది. టీడీపీ-జనసేన కూటమికి కవిత కొత్త పార్టీ ఒక గొప్ప వ్యూహాత్మక అవకాశాన్ని అందించినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
ఎమ్మెల్యేల పనితీరును ప్రజల నుంచే తెలుసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. మే 1 నుంచే ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
స్ట్రాంగ్ రూమ్ వద్ద సిసిటివి దృశ్యాలను టీవీలో చూసినప్పుడు తనకు అనుమానం కలిగిందనీ.. అందుకే స్వయంగా తనిఖీ చేయడానికి వచ్చానని మమతా బెనర్జీ తెలిపారు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి అయినా సరే ప్రజా తీర్పును కాపాడుకుంటామన్న మమతా బెనర్జీ.. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
యాక్సిస్ మై ఇండియాతన అంచనాలలో తృణమూల్ కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టింది. ఈ సంస్థ అంచనా ప్రకారం టీఎంసీ 165 నుంచి 185 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండగా.. బీజేపీ 95 నుంచి 110 స్థానాలకే పరిమితం కావచ్చని ఆ సర్వే ఫలితం పేర్కొంది. ఇక సీ-ఓటర్ సర్వే కూడా మమతా బెనర్జీపైనే బెంగాల్ ప్రజలు విశ్వాసం ఉంచారని పేర్కొంది.
పదవి వచ్చిందనే అహంకారం వద్దనీ, అందరినీ కలుపుకుని ముందుకుసాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.