Publish Date:May 17, 2017
ప్రపంచాన్ని గడగడలాడిస్తూ..150 దేశాల్లోని కోట్లాది కంప్యూటర్లను వశం చేసుకున్న వెన్నా క్రై వైరస్ దాటికి వివిధ దేశాలు వణికిపోతున్నాయి. భారత్‌పైనా ఈ వైరస్ పెను ప్రభావం చూపిస్తోంది. ఇప్పటీకే టీటీడీ పరిపాలనా భవనంలోని కొన్ని కంప్యూటర్లు వైరస్ బారిన పడ్డాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని కొన్ని కంప్యూటర్లు హ్యాకింగ్ గురయ్యాయని ఐటీ నిపుణులు గుర్తించారు. హ్యాకింగ్‌కు గురైన కంప్యూటర్లలో కొత్త హార్డ్ డిస్కులను ఇన్‌స్టాల్ చేస్తున్నారు. మరోవైపు హ్యాకర్లు వాడిన వైరస్ వెన్నా క్రై వైరసేనా అనే అంశం తెలియాల్సి ఉంది. సచివాలయంలోని సుమారు 20 నుంచి 30 కంప్యూటర్లు హ్యాకింగ్‌కు గురైనట్లు సమాచారం. ఐటీ నిపుణులు కంప్యూటర్లను తిరిగి పునరుద్దరించేందుకు కుస్తీ పడుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/hacking-39-74833.html
తెలంగాణ మాజీ మంత్రి, ప్రతిపక్ష బీజేపీ కీలక నేత హరీష్ రావును పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆయన అరెస్టుకు కారణమేమిటన్నది ఇతమిథ్థంగా తెలియరాలేదు. గత కొంత కాలంగా తెలంగాణలో రాజకీయం ఎన్నికల హీట్ ను తలదన్నేలా ఉంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణలో పోలీసులు వేగం పెంచారు. ఇప్పటికే ఈ కేసులో ఏపీ సీఐడీ మాజీ అధికారి విజయ్ పాల్ ను అరెస్టు చేసిన పోలీసులు తాజాగా గుంటూరు జీజీహెచ్ వైద్యులను విచారించారు.
తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ సమావేశాలలో పలు అంశాలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే, అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారనేది ఈ నెల 9న జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
సినీమా పిచ్చి ఓ మహిళ ఉసురు తీసింది. అల్లు అర్జున్ నటించిన పుష్ప2 సినిమా కోసం దిల్ షుక్ నగర్ నుంచి తన పిల్లలతో కలిసి ఆర్టీసీ క్రాస్ రోడ్డులో పుష్ప 2 సినిమా ప్రదర్శిస్తున్నథియేటర్ కు వచ్చిన రేవతి అనే మహిళ అక్కడ జరిగిన తొక్కిసలాటలో మరణించింది.
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొండితనానికీ, తనమాటే నెగ్గాలన్న మంకుపట్టుకు బ్రాండ్ అంబాసిడర్. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అంటారు.. కాదుకాదు.. కుందేలుకు నాలుగు కాళ్లు అని ఆయనకు వివరంగా చెప్పేందుకు ఎవరు ప్రయత్నించినా వారి అంతుచూసే వరకు వదిలిపెట్టరు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం (డిసెంబర్ 5) శ్రీవారి దర్శనం కోసం భక్తులు నాలుగు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.
జగన్ అధికారం కోల్పోయిన తరువాత ఆయన బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. ఈ ఏడాది జరిగిన ఎన్నికలలో జగన్ మోహన్ రెడ్డి పార్టీ చిత్తుచిత్తుగా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. దీంతో అప్పటి వరకూ నత్తనడకన నడిచిన వివేకా హత్య కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. ఈ కేసుకు సంబంధించి కడప జిల్లా పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ తాజాగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బంధువులు సహా పలువురికి నోటీసులు జారీ చేశారు.
రాజకీయాల్లో తనను తానో పెదరాయుడిగా ఊహించుకున్న జగన్.. పార్టీ నిర్వహణ నుంచి ముఖ్యమంత్రిగా పాలన సాగించడం వరకూ, పరాజయం తరువాత ఈవీఎంలపై నెపం నెట్టేసి, అధికారం కోల్పోయిన మరుసటి రోజు నుంచే రాష్ట్రంలో శాంతి భద్రతలు అధ్వానంగా మారిపోయాయంటూ గగ్గోలు పెట్టడం వరకూ అన్నీ కూడా అదే తరహాలో చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో వైసీసీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ, అంతకు ముందు విపక్షంలో ఉండగా మూడున్నరేళ్లూ బీజేపీ ఆ పార్టీకి అన్ని విధాలుగా అండదండగా నిలిచింది. వైసీపీ అధినేత అక్రమాస్తుల కేసుల విచారణ వేగం పుజుకోకపోవడం నుంచి, అధకారంలో ఉండగా జగన్ ఆర్థిక అరాచకత్వానికి ప్రోత్సాహం ఇవ్వడం నుంచీ బీజేపీ వైసీపీకి, జగన్ కు వెన్నుదన్నుగా నిలిచింది. ఇవి ఆరోపణలకు మాత్రమే కాదు.. అక్షర సత్యాలంటూ పరిశీలకులు బోలెడు ఉదాహరణలు చూపుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలోనే శాశ్వత నివాసం ఏర్పరుచుకోవాలని భావిస్తున్నారు. దాదాపు దశాబ్ద కాలంగా ఉండవల్లి గ్రామంలోని లింగమనేని గెస్ట్‌హౌస్‌లో నివాసం ఉంటున్న ఆయన పలు సందర్భాలలో అమరావతిలో తన సొంత ఇంటిని నిర్మించుకుంటానని వెల్లడించారు.
అధికారం అండతో ఇష్టారాజ్యంగా చెలరేగిపోయిన వారందరికీ ఇప్పుడు కర్మ ఫలం అనుభవించకతప్పని పరిస్థితి ఎదురౌతోంది. జగన్ హయాంలో దౌర్జన్యాలు, దుర్మార్గాలు, బెదరింపులకు సంబంధించి ఇప్పుడు మరో విషయం వెలుగులోకి వచ్చింది. కాకినాడపోర్టు, కాకినాడ సెజ్ లలో బలవంతంగా షేర్లు లాక్కొని చేసిన దౌర్జన్యం వెలుగులోకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ పై సస్పెన్షన్ వేటు పడింది. వైసీపీ హయాంలో సీఐడీ చీఫ్ గా సంజయ్ జగన్ సర్కార్ మెప్పు కోసం నిబంధనలకు తిలోదకాలిచ్చి ఇష్టారీతిగా వ్యవహరించారు. జగన్ కనుసన్నలలో ఆయన ఆడమన్నట్లల్లా ఆడి, పాడమన్నట్లల్లా పాడారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. సంజయ్ హయాంలో ఆంధ్రప్రదేశ్ సీఐడీ వైసీపీ ప్రైవేటు సైన్యంలా పని చేసింది.