మృగశిర రోజున H-FAST భారీ ఆపరేషన్...భారీగా చికెన్ వ్యర్థాలు స్వాధీనం

Publish Date:Jun 8, 2026

Advertisement

 

హైదరాబాద్‌లో ఆహార భద్రత, ప్రజారోగ్య పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తున్న H-FAST (Hyderabad Food Adulteration Surveillance Team) బృందం మృగశిర కార్తి రోజున భారీ ఆపరేషన్ నిర్వహించారు. హైదరాబాద్  నగరంలోని అంబర్‌పేట్, అత్తాపూర్, కూకట్‌పల్లి, పెద్ద అంబర్‌పేట్ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టిన అధికా రులు చికెన్ వ్యర్థాలను తరలిస్తున్న లారీలను అడ్డగించి తనిఖీ నిర్వ హించారు. హైదరాబాద్‌లోని కోళ్ల మార్కెట్లు, మాంసం దుకాణాల నుంచి సేకరిం చిన చికెన్ వ్యర్థాలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెండరింగ్ ప్లాంట్లకు తరలించాల్సి ఉండగా, కొందరు అక్రమంగా వాటిని చేపల చెరువులకు ఆహారంగా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. 

ఈ నేపథ్యంలో చేపట్టిన దాడుల్లో తొమ్మిది లారీలను అదుపులోకి తీసుకుని సుమారు 120 టన్నుల చికెన్ వ్యర్థాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఈ వ్యర్థాలను ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, భీమవరం, వినుకొండ, అద్దంకి ప్రాంతాల చేపల చెరువులకు తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో బయటపడినట్లు పేర్కొంటున్నారు. చేపల పెంపకంలో ఇలాంటి వ్యర్థాల వినియోగం ప్రజారోగ్యానికి హానికరమని నిపుణులుహెచ్చరిస్తున్నారు. కాగా, హైదరాబాద్ పోలీసులు ఇటీవల ఆహార కల్తీ, నాసిరకం ఆహార పదార్థాల విక్రయాలను అరికట్టేందుకు H-FAST ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ బృందం నగరవ్యాప్తంగా ఆహార భద్రతకు సంబంధిం చిన అక్రమాలపై నిఘా పెంచారు..

By
en-us Political News

  
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పీక్‌ స్టేజ్‌కు చేరాయి.
మాజీ మంత్రి, వై.ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు చేపట్టాలంటూ ఆయన కుమార్తె సునీత రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది.
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB)కి చెందిన ఇన్‌స్పెక్టర్ బి. మహేందర్‌కు సంబంధించిన ఎసీబీ (ACB) రిమాండ్ కాపీలో పలు సంచలన అంశాలు వెలుగుచూశాయి.
తెలంగాణ వ్యాప్తంగా రవాణా శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ వ్యవస్థను మరింత బలో పేతం చేసి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక రంగంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లోని SMS-1 విభాగంలో భారీ పేలుడు సంభవించింది.
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో అత్యంత విచిత్రమైన, సమాజాన్ని నివ్వెరపరిచే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన బీటెక్ విద్యార్థి అదృశ్యం కేసు విషాదాంతమైంది.
క్రికెట్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టించబడింది.
నేటి ఆధునిక కాలంలో ఐదెంకల జీతం వస్తే జీవితం ఎంతో విలాసవంతంగా ఉంటుందని చాలా మంది భావిస్తారు.
ఇద్దరు మేజర్లు పరస్పర అంగీకారంతో శారీరక సంబంధాలు కలిగి ఉండటం చట్టప్రకారం నేరం కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచెర్ల ఎంఎల్ఆర్ కాలనీకి చెందిన రసూల్ జాకబ్ 2024లో అల్వాల్‌కు చెందిన మేఘనను వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో అమ్మాయి తల్లిదండ్రులు భారీగా కట్నకానుకలు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు తలెత్తడంతో పరిస్థితి దిగజా రింది. రోజురోజుకీ గొడవలు పెరిగిపోతూ ఉండడంతో మేఘన ఈ క్రమంలో జాకబ్‌తో పాటు అతని కుటుంబ సభ్యులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
గర్భాలయం, అర్థమండపం, మహామండపలతో, కప్పుల వరకు ఉన్న ఆలయం, కాకతీయ వాస్తు శిల్పానికి అర్థం పడుతుందనీ, కప్పురాళ్లు, గోడలు కూలిపోయి, చుట్టూ చెట్లు పొదలు పెరిగి, ఆలయం ఉనికికే ప్రమాదం ఏర్పడిందని, ఆలయాన్ని ఊడదీసి, ఆధునిక పునాదులపై పునర్నిర్మించి, వారసత్వ సంపదగా కాపాడి, భవిష్యత్ తరాలకు అందించాలని గ్రామ ప్రజలకు, జిల్లా యంత్రాంగానికి శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.