జ్ఞానాన్ని గుభాళింపజేసే గురుపూర్ణిమ!

Publish Date:Jul 12, 2022

Advertisement

ఆషాడ శుద్ద పౌర్ణమి రోజును గురుపౌర్ణిమ అని కూడా అంటారు. గురుపూర్ణిమ అనేది గురువును స్మరించుకుంటూ జరుపుకునే వేడుక అని అందరి అభిప్రాయం. గురుపూర్ణిమ రోజునే వ్యాసుడు జన్మించాడు కాబట్టి దీన్ని వ్యాసపూర్ణిమ అంటారని కొందరు చెబుతారు. ఏది ఏమైనా ఆషాడ శుద్ధ పూర్ణిమ రోజును అందరూ ఎంతో భక్తిశ్రద్దలతో జరుపుకుంటారు. 

గురువును పూజించడం భారతీయ సనాతన ధర్మంలో ఎప్పటి నుండో ఉంది. భక్తుడు లేదా శిష్యుడిలో ఉన్న అంధకారాన్ని తొలగించేవాడు గురువు. మన భారతదేశంలో ఎంతో మంది గురువులు ఉన్నారు. వాళ్ళందరూ ఆత్మసాక్షాత్కారం పొంది ప్రజలకు ధర్మాన్ని, న్యాయాన్ని, ప్రశాంత జీవితాన్ని గురించి తమ భోధనల ద్వారా చెప్పినవాళ్ళు. ఇంకా ముఖ్యంగా తమ జీవితం ద్వారానే ప్రజలకు, శిష్యులకు గొప్ప మార్గాన్ని చూపినవాళ్ళు. బుద్ధుని జీవితాన్ని ప్రజలకు ఎలా అయితే ఒక గొప్ప మార్గంగా ప్రచారం చేస్తారో, బుద్ధ పూర్ణిమను ఎంతో ప్రత్యేకంగా ఎలా చూస్తోరో, అలాగే గురుపూర్ణిమ కూడా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది.

గురుపూర్ణిమ రోజున ఎంతో మంది తమ గురువుల అనుగ్రహం కోసం గురువును ఆశ్రయిస్తారు. కొందరు ఉపదేశాలు తీసుకుంటారు. మరికొందరు గురువుకు సేవ చేసుకుంటారు, గురువును గుర్తుచేసుకుంటూ కార్యక్రమాలు నిర్వహిస్తారు. షిరిడి సాయి బాబా లాంటి గురువుల మందిరాలు భక్తులతో కిటకిటలాడుతాయి.

గురుపూర్ణిమ వెనుక కథనం!!

అందరూ గురుపూర్ణిమ వెనుక కథ ఏంటి అంటే వ్యాసుడు జన్మించాడు కాబట్టి గురుపూర్ణిమ జరుపుకుంటారు అని చెబుతారు. కానీ వ్యాసుడు జన్మించడం  నిజమే అయినా దానికంటే అరుదైన విశిష్టమైన కథనం గురుపూర్ణిమ వెనుక ఉంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ గురుపూర్ణిమ వెనుక ఆసక్తికర కథనాన్ని చెప్పారు.

ఆయన ఆరాధించే పరమేశ్వరుడు ఆదియోగి. ఆయనే ఈ సృష్టిలో మొదటి యోగి అని ఆయనే మొదటి గురువు అని సద్గురు చెబుతారు. ఈ సృష్టిలో మొట్టమొదటిసారి ఒక యోగి హిమాలయాల్లో కనిపించాడు ఆయన్ను చూసిన ప్రజలు ఆయన ఏమైనా చెబుతాడేమో ఎదురుచూసారు కానీ ఏమీ చెప్పకపోవడం వల్ల అందరూ వెళ్లిపోయారు. అయితే అక్కడ ఏడుమంది మాత్రం అలాగే ఉండిపోయారు. ఆదియోగి వాళ్ళను పట్టించుకోలేదు. కానీ వాళ్ళు అక్కడి నుండి వెళ్లకుండా సుమారు 84 సంవత్సరాలు అక్కడే ఉన్నారట. చివరికి ఆదియోగి వాళ్ళవైపు చూసినప్పుడు సరిగ్గా దక్షిణాయనం మొదలైందట. ఆదియోగి ఆ ఏడుమందికి గురువుగా మారి ఉపదేశం చేశారు. ఆ ఏడుమంది సప్తర్షులుగా పిలవబడ్డారు. అంతేకాదు ఆదియోగి ఆ సప్తర్షులవైపు దక్షిణదిక్కుగా చూసాడు కాబట్టి ఆయన దక్షిణామూర్తిగా పిలబడ్డాడు. ఆదియోగి సప్తర్షులకు గురువుగా మారి చేసిన ఉపదేశాన్ని సప్తర్షులు ప్రజల మధ్యకు తీసుకొచ్చారు. ఇదీ గురుపూర్ణిమ వెనుక కథనం.

అయితే గురువు ఎవరైనా శిష్యుడికి ఎంతో గొప్పవాడు కాబట్టి ఎందరో గురువులున్న ఈ భారతదేశంలో తమ తమ గురువును తలచుకుంటూ, పూజిస్తూ, సేవిస్తూ గురుపూర్ణిమను చాలా భక్తితో జరుపుకుంటారు. కాబట్టి అందరికీ గురువు అనుగ్రహం ఉండాలని కోరుకుందాం. ఈ గురుపూర్ణిమ నాడు అందరూ గురువులూ తమ శిష్యులకు గొప్ప జ్ఞానాన్ని పంచాలని ఆశిద్దాం.

                                  ◆ వెంకటేష్ పువ్వాడ.

By
en-us Political News

  
ఆచార్య చాణక్యుడు   గొప్ప రాజనీతిజ్ఞుడు,  వ్యక్తిత్వ విశ్లేషణా నిపుణులు,  ఆర్థిక శాస్త్ర నిపుణులు.  ఆయన వేల సంవత్సరాల కిందటే మనిషి జీవితంలో ఎన్నో విషయాలను ఎంతో స్పష్టంగా, వివరంగా చెప్పాడు.
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అంటూ ఉంటారు. కానీ ఆర్థిక అవసరం ఏర్పడినప్పుడు మానవ సంబందాలే ఆదుకుంటాయి.  
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విలువలు ఉండాలని కోరుకుంటారు, కానీ ఇది అంత సులభమైన పని కాదు.
నేటి కాలంలో ఇల్లు, కారు, పిల్లల చదువు, వ్యాపారం లేదా ఇతర అవసరాల కోసం లోన్ తీసుకోవడం చాలా సాధారణమైంది.
ఈ సమాజంలో ప్రతి వ్యక్తికి కుటుంబంతో ఉండే అనుబంధం చాలా గొప్పది. ఎన్నో విషయాలు కుటుంబం నుండే నేర్చుకుంటారు.
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో రాణించడమే కాకుండా, తెలివైనవారుగా, క్రమశిక్షణ గలవారుగా , స్వయం సమృద్ధి గలవారుగా ఉండాలని కోరుకుంటారు.
జీవితం అన్నాక సంతోషాలు,  ఇబ్బందులు, కష్టాలు అన్నీ ఉంటాయి. కష్టం వచ్చినప్పుడు బాధపడటం అందరూ చేసే పనే.. కానీ.. కొందరుంటారు.. చుట్టూ ఉన్నవారు బాధపడితే.. ఏడిస్తే.. వారిని ఓదార్చాలనే ఆలోచనలతో "ఏడిస్తే ఏం ప్రయోజనం?", "
పిల్లలు చదువును ఒత్తిడిగా కాకుండా ఆనందంగా భావించాలంటే తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం. చాలామంది తల్లిదండ్రులు మంచి మార్కులు రావాలని ఆశపడతారు.
ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత అందంగా కనిపిస్తుంది. ఇంటిని శుభ్రం చేసే క్రమంలో బూజు దులపడం, తుడవడం,  ఇంట్లో ఎక్కడైనా సాలీడు పురుగులు, బొద్దింకలు వంటివి రాకుండా చూడటం చేస్తుంటారు.
భారతీయ కుటుంబాలలో అత్తాకోడళ్ల మధ్య సంబంధాన్ని చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ బంధం ప్రేమ, ఒకరికొకరు సహకారంగా ఉండటం, ఒకరినొకరు గౌరవించుకోవడం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే అత్త తరం వేరు, కోడలి తరం వేరు..
సల్వార్ సూట్‌లు భారతీయ మహిళలు చాలా ఇష్టపడే  సాంప్రదాయ వస్త్రాలలో ఒకటి. మారుతున్న ఫ్యాషన్ కు అనుగుణంగా సల్వార్ సూట్‌లను ధరించే విధానం కూడా చాలా మారింది.
చిన్నతనం అంటేనే ఆటలు, అల్లరి పనులు, చిన్న చిన్న గొడవలు. పిల్లలు చిన్నతనంలో ఉన్నప్పుడు స్నేహితులు, తమ తోటి పిల్లలతో ఆడుకుంటారు.. అలాగే కొన్ని సార్లు గొడవలు కూడా పడతారు.
వయసు పైబడే కొద్దీ, చాలా మంది తల్లిదండ్రులకు రోజువారీ పనులలో సహాయం అవసరం అవుతుంది. ఉద్యోగాల రీత్యా పిల్లలు దూరంగా ఉండటం లేదా విదేశాల్లో ఉండటం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులలో పిల్లలు తల్లిదండ్రుల కోసం పిల్లలు కేర్ టేకర్ ను నియమించుకోవాలని అనుకుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.