Publish Date:Aug 30, 2024
రఘురామకృష్ణం రాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో జగన్ పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కనున్నారా? అంటే ఔనన్న సమాధానమే వస్తున్నది. రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ పై ఆయన చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా ఈ కేసులో నిందితులకు నోటీసులు పంపించేందుకు సమాయత్తమౌతున్నారు. రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, మాజీ సీఐడీ డీజీ సునీల్ కుమార్, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు సహా మరికొందరిని పోలీసులు విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
ఈ కేసుకు సంబంధించి విచారణాధికారుల ఇప్పటికే అప్పటి గుంటూరు సీఐడీ ఏఎస్పీకీ విజయ్ పాల్ కు నోటీసు జారీ చేశారు. రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ సంఘటనకు సంబంధించిన ఆధారాలు సమర్పించాల్సిందిగా ఆదేశించారు.
అప్పటికి నరసాపురం ఎంపీ అయిన రఘురామకృష్ణం రాజు అప్పటి వైసీపీ ప్రభుత్వ తీరుపై, జగన్ విధానాలపై విమర్శలు గుప్పించడంతో ఆయనపై దేశ ద్రోహం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసుకు సంబంధించి సీఐడీ పోలీసులు రఘురామకృష్ణం రాజును అరెస్టు చేసి కస్టోడియల్ టార్చర్ కు గురి చేశారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తనను కస్టోడియల్ టార్చర్ కు గురి చేశారంటూ గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
ఆయన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కోర్టులో చార్జిషీట్ ఫైల్ చేయనున్నారు. కాగా ఈ కేసులో జగన్ కు నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆ నోటీసులను అందుకుని జగన్ పోలీసు స్టేషన్ కు వస్తారా లేక కోర్టును ఆశ్రయించి తనపై అభియోగాలను క్వాష్ చేయాలని కోరుతారా అన్నది చూడాల్సి ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/guntur-police-to-send-notice-to-jagan-25-183948.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.