గుంటూరు మేయర్ రాజీనామా.. అవిశ్వాసం భయంతోనేనా?

Publish Date:Mar 15, 2025

Advertisement

గుంటూరు మేయ‌ర్, వైసీపీ నేత కావ‌టి మ‌నోహ‌ర్ నాయుడు త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. 2021లో మేయ‌ర్‌గా ఎన్నికైన మ‌నోహ‌ర్ మరో ఏడాది ప‌ద‌వీ కాలం ఉండ‌గానే రాజీనామా చేశారు.   గ‌త నెల‌లో జ‌రిగిన గుంటూరు న‌గ‌ర‌పాల‌క స్టాండింగ్ క‌మిటీ ఎన్నిక‌ల్లో ఆరు స్థానాల‌కు ఆరు స్థానాలనూ తెలుగుదేశం, జ‌న‌సేన కార్పొరేట‌ర్లు కైవ‌సం చేసుకున్నారు. దీంతో అవిశ్వాస తీర్మానం భయంతో ఆయన రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. 

 వైసీపీ నుంచి కార్పొరేట‌ర్లు కూట‌మిలో చేర‌డంతో వైసీపీకి ప‌రాభ‌వం త‌ప్ప‌లేదు. ఈ నెల 17న స్టాండింగ్ క‌మిటీ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశంలో మ‌నోహ‌ర్ నాయుడిపై అవిశ్వాస తీర్మానం పెట్టే అవ‌కాశం ఉంది. మ‌రోవైపు గత కొంతకాలంగా నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, మేయర్ మనోహర్ మధ్య వివాదం నెలకొంది. ఈ నేప‌థ్యంలోనే మ‌రో ఏడాది ప‌ద‌వీకాలం ఉండ‌గానే ఆయ‌న‌ రాజీనామా చేశారంటున్నారు.

రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాను అనేక అవమానాలు ఎదుర్కొన్నట్లు కావటి మనోహర్ నాయుడు ఆరోపిస్తున్నారు. మేయర్‌కు ఇవ్వాల్సిన కనీస ప్రోటోకాల్ ఇవ్వడం లేదని విమర్శిస్తున్నారు. ఇన్ని అవమానాలు ఎదుర్కొంటూ   పదవిలో ఉండాల్సిన అవసరం తనకు లేదని.. అందుకే రాజీనామా చేసినట్లు కావటి మనోహర్ నాయుడు అన్నారు.

వాస్తవానికి ఇటీవల జరిగిన గుంటూరు నగర పాలక సంస్థ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో  వైసీపీ పరాజయం పాలైంది. ఆరు స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. అన్ని స్థానాలలోనూ టీడీపీ, జనసేన కార్పొరేటర్లు విజయం సాధించారు. వైసీపీ నుంచి కొందరు కార్పొరేటర్లు తెలుగుదేశం గూటికి చేరారు. ఈ నేపథ్యంలోనే సోమవారం (మార్చి 17) స్టాండింగ్‌ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో గుంటూరు మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడిపై అవిశ్వాస తీర్మానం పెట్టే ఆలోచనలో కూటమి పార్టీలు ఉన్నాయి. అదే జరిగితే అవిశ్వాస తీర్మానం గెలిచి మేయర్ గా కావటి దిగిపోవాల్సి రావడం ఖాయం. దీంతోనే కావటి మేయర్ పదవికి రాజీనామా చేసేశారు.  

నిబంధనల ప్రకారం మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే ఆ మేయర్ నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుని ఉండాలి. ఫిబ్రవరి 17తో మేయర్‌గా మనోహర్ నాయుడు పదవీ కాలం నాలుగేళ్లు పూర్తైంది. దీంతో కూటమి నేతలు సరిగ్గా ఆయన నాలుగేళ్ల పదవీ కాలం పూర్తి అయిన రోజునే అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలని నిర్ణయించుకున్నారు.  గుంటూరు నగరపాలక సంస్థలో 56 మంది కార్పొరేటర్లు, ఏడుగురు ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నారు.    

By
en-us Political News

  
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత యువ షూటర్, తెలంగాణ ముద్దుబిడ్డ ఈషా సింగ్ అద్భుత ప్రతిభ కనబరిచారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సంబంధించి ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసింది.
హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తూ మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
బాలీవుడ్‌లో మరోసారి ఆదాయపు పన్ను శాఖ దూకుడు పెంచింది.
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంక్షేమ అధ్యాయానికి తెరలేచింది.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
శంషాబాద్ వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఊహించని ఘటన చోటుచేసుకుంది.
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్‌ (ULC) దరఖాస్తుల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్‌లో కుటుంబ కలహాలు విషాదాంతమయ్యాయి
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.