కావటి మనోహర్ రాజీనామా!

Publish Date:Mar 16, 2025

Advertisement

సొంత పార్టీ నేతలపై నమ్మకం పోయిందా?
అవిశ్వాసంతో,పరువు పోగొట్టుకోవడం ఇష్టం లేకే పక్కకు తప్పుకున్నారా! 

గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు ఎందుకు రాజీనామా చేశారు ? అవిశ్వాస పోరాటంలో తాను నెగ్గలేనని మనోహర్ కి ముందే తెలిసిపోయిందా?  పోరాడి ఓడిపోవడం కంటే  ముందే పక్కకు తప్పుకోవడం బెటర్ అనుకున్నారా?  సొంత పార్టీ నాయకులు కనీసం తనకు మద్దతు పలకడం లేదన్న అంతర్మథనం మనోహర్ తో రాజీనామా చేయించిందా? గుంటూరులో మేయర్ రాజీనామాతో, జరగబోతున్న నష్టం ఎవరికి?  ఉన్న అధికారాన్ని కాపాడుకో లేకపోయిన వైసిపి కి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఈ దెబ్బకు గుంటూరులో  వైసిపి పట్టు పూర్తిగా కోల్పోయినట్లేనా? 

గుంటూరు నగరపాలక సంస్థను వైసిపి కోల్పోయింది.. ఆ పార్టీ నాయకుడు,  నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేసేశారు.  ఈ విషయంలో ప్రత్యర్థి కూటమి పార్టీ పవర్ కంటే ,సొంత పార్టీలోని నాయకుల అసమర్ధతే మేయర్ మనోహర్ తో రాజీనామా చేపించిందన్న చర్చ జరుగుతున్నది. నిజానికి మరి కొద్ది రోజుల్లోనే అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు టిడిపి పని మొదలుపెట్టింది.  కానీ టిడిపి చేతిలో దెబ్బతినకుండా, మనోహర్ చేసిన రాజీనామా..  రాజకీయాల్లో హత్యలు ఉండవు..  ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి అన్న దానికి పదానికి ప్రత్యక్ష ఉదాహరణ గా చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. 
గుంటూరు కార్పొరేషన్ లో మొత్తం 57 డివిజన్లు ఉన్నాయి. .ఈ డివిజన్లో గతం లో  2021 లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు  46 మంది విజయం సాధించారు. కూటమి పార్టీలకు చెందిన కార్పొరేటర్లు కు 11 సీట్లు మాత్రమే వచ్చాయి.  దీంతో వైసీపీ నుండి కావటి మనోహర్ నాయుడు మేయర్ గా పనిచేస్తున్నారు.  ఐతే 2024 ఎన్నికల్లో ప్రభంజన విజయాన్ని అందుకున్న కూటమి నాయకులు  గుంటూరు మేయర్ స్థానం పై దృష్టి పెట్టారు.  మారుతున్న కాలంతో పాటు, కార్పొరేషన్ లో రాజకీయ నాయకుల్లో కూడా మార్పు వచ్చింది  2024 ఎన్నికలకు ముందే, ఆరుగురు వైసిపి కార్పొరేటర్లు కూటమి పార్టీల వైపు వెళ్లిపోయారు. ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో, కూటమి భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో మరో ఆరుగురు కార్పొరేటర్లు కూటమికి జై కొట్టారు.  ఆరు, ఆరు 12 కదా ,ఈ బారా తో హైరానా ఎందుకనుకున్నారు వైసీపీ నేతలు. ఆ తర్వాత ఒక్కొక్క మార్పు జరిగే కొద్దీ , వైసీపీ నాయకులకు టెన్షన్ పుట్టుకొచ్చింది. ఈ వ్యవహారం ఓ వైపు పార్టీకి, మరోవైపు మేయర్ స్థానానికి చేటు తెచ్చేలా ఉంది  అని తెలుసుకున్నా సరే వైసిపి జిల్లా నాయకులు ఆలస్యంగా నిద్ర మేల్కొన్నారు.  ఇక్కడ వైసిపి నాయకులు నిద్ర పోయారు అనడం కంటే ,నిద్ర నటించారు అంటే బాగుంటుందని సొంత పార్టీ కాడరే దుమ్ముత్తిపోసే పరిస్థితికి తీసుకు వచ్చారు వ్యవహారాన్ని. ఈ లోపు కూటమి నాయకులు చేయాల్సిన డ్యామేజ్ అంతా చేసేసారట. 

కూటమి నుంచి విజయం సాధించిన నాయకులు, ఎమ్మెల్యేలు, కేంద్రమంత్రి గుంటూరులోనే మకాం వేసి, తమ దగ్గర ఉన్న వనరులను వైసీపీ కార్పొరేటర్ కు రుచి చూపించారు. దీంతో ఒక్కొక్కరుగా మొదలైన మార్పు వ్యవహారం,  చివరికి పాతిక మంది వైసీపీ కార్పొరేటర్లు, కూటమి పంచన చేరే వరకూ వెళ్లింది.  కౌన్సిల్లో 36 మంది కార్పొరేటర్ల మద్దతు కూడగట్టుకుంది. అనూహ్యంగా స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది.  ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యులకు గాను ఆరుగురు సభ్యులు టిడిపికి చెందినవారు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గెలిచారు. దీంతోనే అర్థం అయిపోయింది  మనోహర్ కు గుంటూరు కార్పొరేషన్ రాజకీయాల్లో ఏం జరగబోతుందో అనేది...... అయితే ఈ వ్యవహారంలో మనోహర్ కు సహకరించాల్సిన సొంత పార్టీ నేతలు ,వెన్నుపోటు పొడిచారట ...స్టాండింగ్ కమిటీలో టిడిపి వాళ్ళు ఎట్టా గెలుస్తారో చూస్తామని, జబ్బలు చరిచిన వాళ్ళు ,చివరి రెండు రోజులు సైలెంట్ అయిపోయి సొంత కార్పొరేటర్ ను కాపాడుకోలేని పరిస్థితికి వచ్చారట.... గుంటూరు నగరంలోనూ జిల్లాలోనూ మా పవర్ ఏంటో చూపిస్తామని ,బీరాలు పలికే కొంతమంది సొంత పార్టీ నాయకుల వ్యవహారం  కళ్లారా చూసిన మనోహర్ వీళ్లేనా పార్టీని కాపాడుకునేది అని అప్పట్లోనే అంతర్మథనానికి గురయ్యారట. తన పక్కన ఉండే  కార్పొరేటర్లను పక్క పార్టీలోకి పంపించిన నాయకులు కొందరైతే,  కార్పొరేటర్లు వెళ్ళిపోతున్నా,  పోతే పోనీ మనకేంటి అని రెచ్చగొట్టిన నాయకులను చూసిన మనోహర్ ఇక కార్పొరేషన్ రాజకీయాల్లో ఉండకూడదని నిశ్చయిం చుకున్నట్లు ప్రచారం ఉంది. ఆ ప్రచారానికి తగినట్లుగానే ఎలాంటి హడావుడీ లేకుండా మేయర్  పదవికి రాజీనామా చేశారు.  

అయితే టిడిపికి చెందిన నాయకులు, మార్చిలో  గుంటూరు మేయర్ ను మార్చేస్తామని చెప్పినట్లుగానే, చెప్పిన పని చెప్పినట్లుగా తమ చేతికి మట్టి అంటకుండా చేసేసారు. నిజానికి, మేయర్ పై అవిశ్వాసం పెట్టాలంటే రాజకీయంగా, న్యాయపరంగా కొన్ని చిక్కులు వస్తాయని టిడిపి ఆలోచించింది.  సొంత పార్టీ కార్పొరేటర్ లను కాపాడుకునే ప్రయత్నాలు రాజకీయ పార్టీలు చేస్తుంటాయి. కానీ గుంటూరులో మాత్రం అలాంటిది జరగలేదు. వైసిపి నిట్ట నిలువునా చేతులెత్తేసింది. ఓ పక్కన కూటమికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్,కీలకంగా మారి గుంటూరులో చక్రం తిప్పుతుంటే , ప్రతిఘటించాల్సిన  వైసిపి నాయకులు బేర్ మన్నారట. దీంతో పెద్ద స్థాయి నాయకులే పార్టీని వదిలి వెళ్ళిపోతుంటే, ఇక మనకెందుకులే అనుకున్నారు క్షేత్రస్థాయిలో కార్పొరేటర్లు.  దీంతో ఎలాంటి ప్రతిఘటన లేకుండానే వైసిపి మేయర్ స్థానాన్ని కోల్పోయింది.... గుంటూరులో ఈ వ్యవహారం ,రాబోయే రోజుల్లో వైసిపి లో ఎలాంటి మార్పులు తీసుకు వస్తుందో చూడాలి.  

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సోమవారం (మార్చి 17) మధ్యాహ్నం భేటీ కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ మంత్రివర్గ సమావేశంలో అమరావతి పనులు సహా పలు కీలక నిర్ణయాలకు, బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శని, ఆదివారాలతో పోలిస్తే సోమవారం (మార్చి 17) రద్దీ ఒకింత తగ్గినప్పటికీ టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి పది గంటలకు పైగా సమయం పడుతోంది.
సోష‌ల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టే సంస్కృతిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండి పడ్డారు.ఆలాంటి వారి విష‌యంలో సీరియ‌స్‌ యాక్ష‌న్ తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. ప్ర‌జాప్ర‌తినిధులు త‌ప్పులు చేస్తే.. వారిని ప్ర‌శ్నించ‌డం వ‌ర‌కు ప‌రిమితం కావాల‌ని, కానీ, వారి ఇంట్లో ఆడ‌వాళ్లు ఏం త‌ప్పులు చేశార‌ని వారిపై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నార‌ని నిల‌దీశారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. ఆదివారం (మార్చి 16) ఉదయం శ్రీవారి దర్శనం కోం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
గుంటూరు మేయ‌ర్, వైసీపీ నేత కావ‌టి మ‌నోహ‌ర్ నాయుడు త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. 2021లో మేయ‌ర్‌గా ఎన్నికైన మ‌నోహ‌ర్ మరో ఏడాది ప‌ద‌వీ కాలం ఉండ‌గానే రాజీనామా చేశారు. గ‌త నెల‌లో జ‌రిగిన గుంటూరు న‌గ‌ర‌పాల‌క స్టాండింగ్ క‌మిటీ ఎన్నిక‌ల్లో ఆరు స్థానాల‌కు ఆరు స్థానాలనూ తెలుగుదేశం, జ‌న‌సేన కార్పొరేట‌ర్లు కైవ‌సం చేసుకున్నారు. దీంతో అవిశ్వాస తీర్మానం భయంతో ఆయన రాజీనామా చేసినట్లు చెబుతున్నారు.
ఎన్నికల ముందు తన పార్టీ మీటింగుల్లో పవన్ కళ్యాణ్ చాలా మాటలు మాట్లాడారు. మనకు ఆర్థిక, అంగ బలాలు, టీడీపీ స్థాయిలో గ్రౌండ్ లెవల్ నెట్‌వర్క్ లేవు, పోల్ మేనేజ్‌మెంట్ కూడా తెలియదు అందుకే జనసేన స్థాయికి తగ్గట్లు 21 స్థానాలకే పరిమితం అవుతున్నామని జనసైనికులకు వివరించారు.
హిందీ భాషను తమపై రుద్దకండి అంటూ చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదని  నటుడు ప్రకాశ్ రాజ్ తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ట్వీట్ చేశారు. దీనికి కౌంటర్ గా  సినీ నిర్మాత, న‌టుడు బండ్ల గ‌ణేశ్ ట్విట్ట‌ర్‌ వేదిక‌గా ఓ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన జనాలు ఇది ఖచ్చితంగా ప్రకాశ్ రాజ్ కు కౌంటర్ ట్వీట్ అని తెలుస్తోంది. 
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై హైదరాబాద్ లోని రెండు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. రేవంత్ రెడ్డి చేసిన మార్చురీ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖరరెడ్డి, కునా వివేకానందగౌడ్ లు పేట్ బషీర్ బాగ్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు? అంటే చెప్పడం కష్టం. అసలు ఉంటుందా? అంటే అదీ అనుమానమే? ఎందుకలా? నిన్న మొన్నటి దాకా, ఇదిగో, అదిగో అంటూ ఊహాగానాలు చేస్తూ వచ్చిన మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఇప్పడు ఎందుకు మౌనం పాటిస్తోంది? అంటే స్పష్టమైన సమాధానం ఏదీ రాక పోయినా కాంగ్రెస్ అధిష్టానం కొత్త ఆలోచనల కారణంగానే కాబినెట్ విస్తరణ అలోచన అటకెక్కిందని విశ్వసనీయ వర్గాల సమాచారంగా కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
మామూలుగానే దక్షిణాదిలో బీజేపీకి ఉన్న పట్టు అంతంత మాత్రమే. నియోజకవర్గాల పునర్విభజన అంశం తెరమీదకు వచ్చిన క్షణం నుంచీ దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ నేతల పరిస్థితి ఇబ్బందుల్లో పడింది. డీలిమిటేషన్ తో పాటు.. త్రిభాషా సూత్రాన్ని బీజేపీ హై కమాండ్ చర్చలోకి తీసుకురావడంతో దక్షిణాదిలో పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారింది.
 అపార్ట్ మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత పక్కింట్లో పిడుగు పడినా తమకు పట్టనట్టుంటున్నారు. ఇరుగు పొరుగు అనే కాన్సెప్ట్ పూర్తిగా కనుమరుగైంది. నగరాల్లో ఇలా ఉంటే గ్రామాల్లో శుభవార్త అయినా, దుర్వార్త అయినా కలిసి పంచుకుంటున్నారు. రష్యాలో ఓ సర్కస్ లో రెండు ఏనుగుల్లో ఒకటి  చనిపోయింది.
వైఎస్ వివేకా హత్య జరిగి శనివారం (మార్చి 15)కి సరిగ్గా ఆరేళ్లు. ఈ ఆరేళ్లలో వివేకా హత్య కేసు అనేక మలుపులు తిరిగింది. గొడ్డలి పోటు నుంచి గుండెపోటు దాకా.. నారాసుర రక్త చరిత్ర నుంచి ఇంటి మనుషులే హత్య చేశారనే అనేక మలుపులు తిరిగింది. చివరికి కోర్టులు నిర్ధారించి, తీర్పు వెలువరించలేదు కానీ, వివేకా హత్యకు మోటివ్ ఏమిటో, హత్య సూత్రధారులు, పాత్రధారులు ఎవరన్న దాని మీద ప్రజలకు సందేహాలేవీ లేకుండా తెలిసిపోయింది. తేలిపోయింది. అయినా ఇప్పటి వరకూ హంతకులు ఎవరన్నది న్యాయస్థానం తేల్చ లేదు. హంతకులకు శిక్ష పడలేదు. కానీ ఈ కేసులో బాధితులు మాత్రం కఠినాతి కఠినమైన శిక్ష అనుభవిస్తున్నారు.
పోటీ పరీక్షలకు రాణించలేకపోతున్నారని తన ఇద్దరు పిల్లల కాళ్లు, చేతులను కట్టేసిన ఓ తండ్రి తలలను బకెట్లో ముంచి చంపేసాడు. తర్వాత తానూ ఊరివేసుకుని చనిపోయాడు. కాకినాడ  జిల్లా వాకల పూడిలో అసిస్టెంట్ అకౌంట్ గా పని చేస్తున్న వానపల్లి చంద్రకిషోర్ ఒకటో తరగతి చదువుతున్న జోషిల్ , యుకేజీ చదువుతున్న నిఖిల్ పోటీ పరీక్షలకు రాణించలేకపోతున్నారని మనస్థాపం చెంది ఈ దారుణానికి పాల్పడ్డాడు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.