పేకాట డెన్ తో ఆ మంత్రికి ఊస్టింగేనా ? జగన్ సర్కార్ కు ఆయన గండమేనా?  

Publish Date:Jan 5, 2021

Advertisement

గడ్డం గ్యాంగ్ తో గండం వచ్చిందా? కృష్ణా జిల్లా రాజకీయాల్లో మార్పులు జరగబోతున్నాయా? తాడేపల్లికి ఆయన పరుగులెందుకు? ఇదే ఇప్పుడు అమరావతితో పాటు ఆంధ్రప్రదేశ్ లో చర్చగా మారింది. గుడివాడలో  పేకాట డెన్ బయటపడటం తీవ్ర కలకలం రేపింది.  తమ్మిరిస పేకాట శిబిరంపై ఎస్ఈబీ దాడులు చేసి.. 30 మంది పేకాట రాయుళ్లను పట్టుకుంది. 28 కార్లు, భారీగా నగదు సీజ్ చేసింది.  అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే  పేకాట క్లబ్‌ నడుపుతున్నారని.. సాక్షాత్తూ మంత్రి అండ కూడా ఉందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో వైసీపీ సర్కార్ ఇబ్బందుల్లో పడింది. దాడులతో  మంత్రి కొడాలి నాని ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారని తెలుస్తోంది. అయన తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని ఉన్నపళంగా వెళ్లి సీఎం జగన్ ను కలిశారు. సీఎం ఆఫీసు నుండి వచ్చిన పిలుపువల్లే మంత్రి హడావుడిగా తాడేపల్లికి పరుగులు పెట్టారంటున్నారు. 

 కొద్ది రోజుల క్రితం గుడివాడలో జరిగిన బహిరంగ సభలో పేకాట క్లబ్‌లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు."మీరు పేకాట క్లబ్‌లు, సిమెంట్ కంపెనీలు, మీడియా సంస్థలను నడపగా లేనిది.. నేను సినిమాల్లో నటిస్తే తప్పేంటి?" అని మంత్రిని ప్రశ్నించారు. పవన్ ఆ మాటలు అన్న కొన్ని రోజులకే ఇలా పేకాట క్లబ్ పై దాడులు జరగడంతో ఏపీ రాజకీయాల్లో ఈ వ్యవహారం పెను సంచలనంగా మారింది. గుడివాడ పేకాట డెన్ కొడాలి నానీకి పెద్ద తలనొప్పిగా మారిందనే ప్రచారం జరుగుతోంది. పేకాట డెన్  వ్యవహారంపై సీఎం జగన్  సీరియస్ గా ఉన్నారని,  మంత్రి కొడాలిని  క్యాంప్ కార్యాలయానికి పిలిపించి చివాట్లు పెట్టినట్లు చెబుతున్నారు. అంతే కాదు కొడాలి మంత్రి పదవికి ఎసరు వచ్చిందనే చర్చ జరుగుతోంది. పేకాట డెన్ తో ప్రభుత్వం అభాసుపాలైందని భావిస్తున్న జగన్.. కొడాలిని మంత్రి వర్గం నుంచి తొలగించి.. ఆ డ్యామేజీని కంట్రోల్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు వైసీపీ వర్గాల సమాచారం. 

 జగన్ కేబినెట్ లో ఉన్న కొడాలి నాని వ్యవహారం మొదటి నుంచి వైసీపీకి ఇబ్బందిగానే మారిందనే చర్చ ఆ పార్టీలోనే జరుగుతోంది. మంత్రిగా ఉంటూ కూడా వివాదాస్పద వ్యాఖ్యలే చేస్తున్నారు కొడాలి. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ లపై బూతులు మాట్లాడుతున్నారు. అమ్మ మొగుడు వంటి అన్ పార్లమెంటరీ పదాలు కొడాలి నానికి ఊతపదాలుగా మారిపోయాయి. తన మంత్రి పదవిని కాపాడుకునేందుకే కొడాలి అలా మాట్లాడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. కేబినెట్‌లోని 90 శాతం మంత్రుల పదవి కాలం రెండున్నర సంవత్సరాలేనని సర్కార్ ఏర్పాటు చేసిన కొన్ని రోజులపై  జగన్ స్పష్టం చేశారు. దీంతో అయిదు సంవత్సరాలు ఉండే 10శాతం జాబితాలో చోటు కోసం మంత్రులలో పోటీ నెలకొంది. ఇందు కోసం అందరికి భిన్నంగా పనితీరు కంటే.. బూతు సాహిత్యాన్నే కొడాలి అస్త్రంగా ఎంచుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.  

 గతంలో నరేంద్ర మోడీ, బీజేపీ నేతలను ఉద్దేశించి మంత్రి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుమలకు సీఎం జగన్ సతీసమేతంగా రావాలని బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై మంత్రి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముందు ప్రధాని నరేంద్ర మోడీని సతీసమేతంగా రామాలయానికి వెళ్లి భూమి పూజ చేసిన తర్వాత బీజేపీ ఆ మాటలు ఇతరులకు చెబితే బాగుంటుందని చెప్పారు. మోడీని ఉద్దేశించి నాని చేసిన వ్యాఖ్యలను బీజేపీ సీరియస్ గా తీసుకుంది. వైసీపీలోనూ కొంత ఆందోళన కలిగించింది. అందుకే చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలను తిట్టినప్పుడు శభాష్ అన్నవాళ్ళు, ప్రధాని మోడీని, ఇతర బీజేపీ నేతలను విమర్శించినప్పుడు మాత్రం కంగారు పడ్డారు.  దీంతో ఆ సమయంలోనే కొడాలిని జగన్ తన కేబినెట్ నుంచి తప్పిస్తారనే ప్రచారం జరిగింది. మంత్రి పదవి ప్రతిష్టని దిగజార్చే విధంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు విపక్షాలతోపాటు సామాన్య ప్రజలలోనూ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కొడాలి బూతులు మాట్లాడుతున్నా సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలెవరు అతన్ని వారించలేదని చెబుతున్నారు. అందుకే అతను మరింతగా రెచ్చిపోయి మాట్లాడుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. చివరకి అవే ఆ మంత్రితో పాటు జగన్ సర్కార్ కు గండంగా మారాయంటున్నారు.

కొడాలి నానికి సంబంధించి  మరో ప్రచారం కూడా జరుగుతోంది. గుడివాడ నుంచి ఎన్నికైనవారికి మంత్రి పదవి ఇస్తే .. ఆ ప్రభుత్వం పూర్తి కాలం పనిచేయదు అనే సెంటిమెంట్ ఎప్పటినుంచో ఉంది. 1955లో గుడివాడ నుంచి ఎంపికైన వేముల కూర్మయ్యకు ప్రకాశం పంతులు తన కేబినెట్ లో స్ధానం కల్పించారు. కాని ప్రకాశం పంతులు ప్రభుత్వం పూర్తి కాలం పనిచేయలేదు. తరువాత 1983లో గుడివాడ నుంచి గెలిచిన టీడీపీ వ్యవస్ధాపకులు NTR ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. అయితే 1984లో నాదేండ్ల భాస్కరరావు కారణంగా ఎన్.టి.ఆర్ కు పదవి గండం ఎదురైంది. అందుకే 1985లో ఎన్.టి.ఆర్. గుడివాడ నుంచి శాసనసభ్యుడుగా గెలిచినా ..సెంటిమెంట్‌ భయంతోనే గుడివాడకు రాజీనామా చేశారని చెబుతారు. 1989లో గుడివాడ నుంచి ఎంపికయిన కఠారి ఈశ్వర్ కుమార్‌కు.. చెన్నారెడ్డి తన కేబినట్‌లో చోటు కల్పించారు. అయితే చెన్నారెడ్డి ప్రభుత్వం కూడా పూర్తికాలం కొనసాగలేదు. వీటన్నిటిని పట్టించుకోకుండా జగన్ గుడివాడ నుంచి ఎంపికయిన కొడాలి నానికి తన కేబినెట్‌లో చోటు కల్పించారు. దీనితో ఇప్పుడు కొడాలి నాని కారణంగా జగన్ సర్కార్‌కు కాలగండం ఏర్పడనుందా అనే చర్చ కూడా ఏపీలో జోరుగా సాగుతుంది.

By
en-us Political News

  
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.