మూడు గ్రూపులు.. ఆరు గొడవలు కాంగ్రెస్ లో కామన్

Publish Date:Aug 24, 2020

Advertisement

అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా హస్తంలో నేతల మధ్య అధిపత్య పోరు కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో వర్గపోరు ముదురుతోంది. అగ్రనేతలంతా ఎవరికివారే సొంత మైలేజీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా కట్టడి, వరద సహాయ చర్యల్లో కేసీఆర్ సర్కార్ విఫలమైందనే భావన ప్రజల్లో ఉంది. సీఎం కేసీఆర్ పాలనపై గతంలో ఎప్పుడు లేనంతగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని వివిధ సంస్థలు చేసిన సర్వేల్లో తేలింది. గత ఆరు నెలల్లో కేసీఆర్ గ్రాఫ్ దారుణంగా పడిపోయిందని చాలా సంస్థల అభిప్రాయ సేకరణలో వ్యక్తమైంది. ఇలాంటి సమయంలో ప్రజల్లోకి వెళ్లి మైలేజీ పెంచుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ.. అంతర్గత కుమ్ములాటలతో రోడ్డున పడుతోంది. ప్రజా సమస్యలపై ఒకరు పోరాడితే మిగితా వారు అతనికి సహకరించడం లేదు. ఆ నేతకు పోటీగా మరో నేత మరో కార్యక్రమం తీసుకుంటున్నారు. ఇలా సొంతంగానే ఎవరికి వారు కార్యక్రమాలు చేస్తూ... మిగితా వారి సహకారం లేక తుస్సుమంటున్నారు. 
                   

శ్రీశైలం పవర్ ప్లాంట్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై అనేక అనుమానాలు వస్తున్నాయి. మంటలు వచ్చిన కొన్ని గంటలకే సర్కార్ కుట్ర ఉందంటూ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ ఆరోపణలు ప్రజల్లోనూ చర్చకు దారి తీశాయి. శ్రీశైలం వెళ్లేందుకు ప్రయత్నించిన రేవంత్ ను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. ఈ అంశాన్ని జనాల్లోకి మరింతగా తీసుకువెళితే కాంగ్రెస్ కు బూస్ట్ వచ్చి కారు పార్టీ ఇబ్బందుల్లో పడేది. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం ఇందులో పూర్తిగా విఫలమయ్యారు. పోరాటానికి దిగిన రేవంత్ రెడ్డికి ఎవరూ సపోర్ట్ చేయలేదు. దీంతో ఒంటరిగానే వెళ్లారు రేవంత్ రెడ్డి. అయితే ఎవరికి చెప్పకుండానే ఏకపక్ష నిర్ణయాలతో రేవంత్ వెళ్లారని కాంగ్రెస్ లోని మరో వర్గం ఆరోపిస్తోంది. అందరు కలిసి ఉమ్మడిగా పోరాడితే ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగేదని, రేవంత్ తొందరపాటు చర్యలతో మంచి అవకాశం చేజారిపోయిందని చెబుతున్నారు. రేవంత్ వర్గం మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తున్నారు. కేసీఆర్ తో కొందరు నేతలు కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నారు. 

 

ఇక ఇటీవలే నిరాహర దీక్షకు దిగి అర్ధాంతరంగా విరమించిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క.. ఆసుపత్రల సందర్శన పేరుతో మరో యాత్ర చేపట్టారు. ఆగస్టు 25 నుంచి 11 రోజుల పాటు ఆయన ఒక్కరే బస్సు యాత్ర చేస్తున్నారు. 33 జిల్లాల్లోని హాస్పిటల్స్ ను ఆయన పరిశీలించనున్నారు. భట్టి తీరుపై పార్టీలో అసంతృప్తి వస్తోంది. పీసీసీ చీఫ్ పదివి కోసమే భట్టీ యాత్ర చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పీసీసీ చీఫ్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం సైలెంట్ గానే ఉంటున్నారు. తనను మార్చాలని గతంలోనే హైకమాండ్ ను కోరిన ఉత్తమ్.. పరిమితంగానే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టడం తప్ప దూకుడుగా వ్యవహరించడం లేదు. నల్గొండ జిల్లాకే చెందిన మరో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పీసీసీ చీఫ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కేసీఆర్ సర్కార్ పై విమర్శలు చేస్తున్నా... అవన్ని తన పీసీసీ చుట్టే తిరిగేలా మాట్లాడుతున్నారు. తనకు పార్టీ పగ్గాలు ఇస్తే టీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కొంటా అని చెబుతున్నారు కాని ప్రజా సమస్యలపై మాత్రం సీరియస్ గా స్పందించడం లేదు. పీసీసీ బాధ్యతలు తనకే ఇవ్వాలని, మరొకరికి ఇస్తే ఒప్పుకునేది లేదంటూ బెదిరించే దోరణిలో వెళుతున్నారు కోమటిరెడ్డి. రేవంత్ టీమ్ ను దూరం పెడుతున్నారు కోమటిరెడ్డి బ్రదర్స్. 

 

ప్రభుత్వంపై పోరాడాల్సిన కాంగ్రెస్ నేతలు.. ఒకరికొకరు టార్గెట్ చేసుకుంటూ కేడర్ ను మరింత గందరగోళంలో పడేస్తున్నారు. కోటి పది లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కీసర ఎమ్మార్వో నాగరాజు ఎపిసోడ్ కాంగ్రెస్ లో వర్గ పోరుకు తెర లేపింది. నాగరాజు కేసులో అరెస్టైన శ్రీనాథ్, అంజిరెడ్డికి రేవంత్ రెడ్డితో సంబంధాలున్నాయని టీఆర్ఎస్ ఆరోపించింది. అంజిరెడ్డి ఇంట్లో రేవంత్ రెడ్డి లెటర్ హెడ్స్ కూడా దొరికాయి. ఇలాంటి సమయంలో పార్టీ ఎంపీకి అండగా ఉండాల్సిన కాంగ్రెస్ లీడర్లు ఆయననే టార్గెట్ చేశారు. ఎంపీ సంగతి తేల్చాలని వీహెచ్ డిమాండ్ చేశారు. తర్వాత వీహెచ్ ను ఉద్దే శించి రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కీసర ఘటన కాంగ్రెస్ లో వర్గపోరును బహిర్గతం చేసింది.  సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా పీసీసీ రేసులో ఉన్నానని చెబుతున్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ఇస్తే ఊరుకునేది లేదంటూ పరోక్షంగా రేవంత్ ను టార్గెట్ చేస్తున్నారు. పార్టీ నేతల తీరుపై కేడర్ లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వంపై పోరాటానికి  మంచి అవకాశాలు వచ్చినా నేతల తీరుతో చేజార్చుకోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతోంది. లీడర్ల తీరు మారకపోతే కేసీఆర్ ను ఎదుర్కోవడం కష్టమని చెబుతున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు.

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.