బాబు అరెస్టుకు రంగం సిద్ధం?.. ఆధారాలెందుకు అధికారం ఉందన్నదే వైసీపీ ధీమా

Publish Date:May 10, 2022

Advertisement

నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా ఉంది వైసీపీ వ్యవహారం. నారాయణ అరెస్టు వార్త బయటకు వచ్చిన మరుక్షణం నుంచీ వైసీపీ కి చెందిన సోషల్ మీడియాలో మరో వార్త ట్రెండింగ్ అవుతోంది. నారాయణ తరువాతి వంతు నారా చంద్రబాబునాయుడేనని. ఇందుకు వారు కారణాలు కూడా చెబుతున్నారు. అమరావతిలో అక్రమాలకు పాల్పడ్డారన్న కేసు ఇప్పటికే ఆయన మీద ఉందనీ, సీబీసీఐడీ దర్యాప్తు కూడా చేస్తోందని పేర్కొంటున్నారు. చంద్రబాబుపై ఈ ఫిర్యాదు చేసింది ఎవరో కాదు.. సాక్షాత్తూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి. ఆ అక్రమాల వల్ల ప్రజలకు నష్టం జరిగిందన్నది ఆయన ఫిర్యాదు సారాంశం. ఎక్కడైనా ఎప్పుడైనా నష్టపోయిన వారు ఫిర్యాదు చేస్తారు.

కానీ ఇక్కడ మేం నష్టపోయామంటూ ఏ ఒక్క ఫిర్యాదూ లేకపోయినా, ఎమ్మెల్యే మాత్రం ప్రజలు నష్టపోయారంటూ చంద్రబాబుపై చేసిన ఫిర్యాదుకు సీబీసీఐడీ స్వీకరించింది.తొలుత అమరావతి కోసం ల్యాండ్ పూలింగ్ ద్వారా భూముల సమీకరణలో అక్రమాలు జరిగాయంటూ పెట్టిన కేసులన్నీ వీగిపోవడంతో.. తాజాగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పుల్లో అక్రమాలంటూ మరో ఫిర్యాదు చేశారు. దీనిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ప్రాథమిక ఆధారాలున్నాయంటూ ఎఫ్ఐఆర్ కూడా ప్రిపేర్ చేసేసింది. 
ఇప్పుడు వైసీపీ లక్ష్యం ఈ కేసు ఆధారంగా చంద్రబాబును అరెస్టు చేయడమే. ఇదే ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో జోరుగా ట్రెండ్ అవుతోంది. అయితే ఇదే విషయం రాష్ట్రంలో రాజకీయ వర్గాలలో కూడా చర్చ జరుగుతోంది.  గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ   అడ్డగోలు అరెస్టులు చేసేలా ఒక విధానాన్ని డెవలప్ చేసుకుంది. అధికార పార్టీ వాళ్లు ఫిర్యాదు చేస్తారు. అది చాలు ఆధారాలు, విచారణలతో పని లేకుండా అరెస్టులు చేసేయడమే..ఆ కేసులు కోర్టులో నిలబడతాయా, లేదా అన్నది తరువాత సంగతి ముందు అరెస్టు చేసేయాలి. అంతే. వైసీపీ ప్రభుత్వం ఈ విధానంతోనే ప్రత్యర్థి పార్టీల నేతలు, ప్రభుత్వ నిర్ణయాలను ఎత్తి చూపే వారిని వేధింపులకు గురి చేస్తున్నది. కరోనా సమయంలో ప్రభుత్వ వైద్యులకు మాస్క్లలు కూడా ఇవ్వడం లేదంటూ ప్రభుత్వంపై విమర్శలు చేసిన పాపానికి సుధాకర్ అనే వైద్యుడిని నడిరోడ్డుపై పోలీసులు లాఠీలతో కొట్టి పిచ్చోడని ముద్రవేసి వేధింపులకు గురి చేయడం దగ్గర నుంచి.. మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీ హయాంలో  అడ్డగోలు అరెస్టులకు ఎన్నో ఉదాహరణలు చెప్పుకుంటూ పోవచ్చు. ఆరెస్టులను తప్పుపడుతూ న్యాయస్తానాలు బెయిలు ఇస్తే కోర్టులను తప్పుపట్టం వైసీపీకి అలవాటుగా మారిపోయింది.  తాజాగా మాజీ మంత్రి నారాయణ అరెస్టు కూడా ఈ కోవలోకే వస్తుంది.

టెన్త్ పేపర్ల లీకేజీ కేసులో ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండా ఏపీ సీఐడీ పోలీసులు నారాయణను అరెస్టు చేశారు. కుమారుడి ఆబ్దికం కార్యక్రమంలో ఉన్న ఆయనను అరెస్టు చేశారు. ఇంతకీ టెన్త్ పరీక్ష పేపర్లు లీకయ్యాయంటూ ఆరోపణలు వెల్లువెత్తిన వెంటనే చర్యలు తీసుకోవలసింది పోయి, ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అసలు పేపర్లు లీక్ కాలేదని విలేకరుల సమావేశం పెట్టి మరీ ఖండించారు. ఇప్పటి వరకూ ఆయన ఆ మాటను వెనక్కు తీసుకోలేదు. పేపర్ల లీకయ్యాయని అంగీకరించనూ లేదు. కానీ ఏపీలో టెన్త్ పేపర్ల లీకేజీకి బాధ్యులంటూ అరెస్టులు జరిగాయి. నారాయణ అరెస్టుకు ముందు ఇదే కేసులో 60 మందిని అరెస్టు చేశారు. వీరిలో ప్రభుత్వ ఉపాధ్యాయులు, సిబ్బంది 38 మంది ఉంటే..ప్రైవేటు విద్యాసంస్థల సిబ్బంది 22 మంది ఉన్నారు. అయినా సరే ఏపీలో టెన్త్ పరీక్ష పత్రాల లీకుకు మంత్రిగారు బాధ్యత తీసుకోరు. మొత్తం తప్పంతా నారాయణ విద్యా సంస్థలదే అని తేల్చేసి నారాయణను అరెస్టు చేస్తారు. 

ఇదే విధంగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో చంద్రబాబు అరెస్టుకు జగన్ డైరెక్షన్ లో అరెస్టుకు రంగం సిద్ధమౌతోందని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.  ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ మార్పు వల్ల నష్టపోయామంటూ అందుకు సంబంధించిన ఏ ఒక్క రైతూ ఫిర్యాదు చేయకపోయినా, అధికార పార్టీ ఎమ్మెల్యే ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన సీఐడీ ప్రాథమిక ఆధారాలున్నాయని ఎఫ్ఐఆర్ లో పేర్కొనడమే ఇందుకు నిదర్శనంగా పరిశీలకులు చెబుతున్నారు. ఏ క్షణంలోనైనా చంద్రబాబునూ అరెస్టు చేసే అవకాశాలున్నాయని వారు విశ్లేషిస్తున్నారు. అయితే కోర్టు సెలవుల సమయంలో బాబును అరెస్టు చేసి వెంటనే బెయిలు వచ్చే అవకాశం లేకుండా చేయాలన్నది జగన్ ఆలోచనగా కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్ కోసం సాగిస్తున్న ప్రయత్నాలు
అయితే 2014 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి ఫైర్ బ్రాండ్ నేతల నోటి దురుసు కూడా ఒక ప్రధాన కారణం అయ్యిందని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అయితే పరాజయం తరువాత కూడా వైసీపీ తీర మారలేదు. అప్పట్లో నోరున్నది దూషించడానికే అన్నట్లుగా వ్యవహరించిన కొడాలి నాని వంటి వారు ఓటమి తరువాత సైలెంట్ అయిపోయినా.. వారి స్థానంలోకి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు వచ్చి చేరారు.
ఇటీవల కాలంలో ముగ్గురుర వైసీపీ నేతలపై నమోదైన మూడు కేసుల్లో ఆ నేతలు వ్యవహరిస్తున్న తీరు, వారికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మద్దతు విమర్శలకు గురౌతోంది. పూర్తిగా కుటుంబ వివాదాలు, ప్రత్యక్షంగా వారు పాల్పడిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో నమోదైన కేసులను కూడా రాజకీయ వేధింపులంటూ  వారు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి.
ప్రభుత్వ బాకాలుగా వ్యవహరిస్తున్న మరికొన్ని మీడియా సంస్థల విలేకరులపై కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శనకారులపై పోలీసుల దాష్టీకాన్నీ, తమ ఆందోళనలపై కేంద్రం అనుసరిస్తున్నఅణచివేతనూ ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వ అనుకూలతకే ప్రాధాన్యం ఇవ్వడంతోనే ప్రధాన స్రవంతి మీడియా ప్రజాగ్రహానికి గురౌతోందని చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ లో సభ్యత్వం లేని వ్యక్తి ఆరు నెలల కాల పరిమితి మించి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీంతో మోడీ ఆదేశాల మేరకు రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా సమర్పించారు.
పరీక్షల్లో పారదర్శకత, విద్యారంగంలో సంస్కరణలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో యువత చేపట్టిన పోరాటానికి మద్దతు ప్రకటించడమే కాకుండా.. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న ధర్నాలో స్వయంగా పాల్గొంటానని వెల్లడించారు.
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.