గవర్నర్ వర్సెస్ సీఎం.. తమిళ సభలో కొత్త చిత్రం

Publish Date:Jan 10, 2023

Advertisement

తమిళనాడు అసెంబ్లీకి మంచి చరిత్ర వుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకోవడం.. కొండకచో ముష్టిఘాతలకు పాల్పడడం .. మొదలు మినీ వస్త్రాపహరణ యత్నాల వరకు.. చాలా చాలా అవాంఛనీయ సంఘటనలకు తమిళనాడు అసెంబ్లీ వేదికగా నిలిచిన ఘన చరిత్ర వుంది.  అఫ్కోర్స్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్త్ర ప్రదేశ్  రాష్ట్రాలలోనూ, నిండు సభలో ప్రతిపక్ష నేత కన్నీళ్లు పెట్టుకున్న సంఘటనల వంటివి చాలానే జరుగుతున్నాయి  అది వేరే విషయం. ఇప్పుడు తమిళనాడు శాసనసభలో  మరో మారు...  మరో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. 

ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రతిపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేయడం సాధారణం. అది ఎక్కడైనా ఉన్నదే. జరిగేదే. కానీ తమిళనాడు అసెంబ్లీ నుంచి గవర్నర్ ఆర్ఎన్ రవి వాకౌట్ చేశారు. సీఎం స్టాలిన్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆయన సభ నుంచి వెళ్లిపోయారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సభను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ ఆర్ఎన్ రవి  తమిళనాడు చరిత్రను వక్రీకరించి పుస్తకాలు రాశారని.. వాటిని సవరించాల్సిన అవసరం ఉందని అన్నారు. తమిళనాడు ద్రవిడుల భూమి అన్న ప్రచారం జరిగిందని,  తమిళనాడు పేరును తమిళగం అని మార్చాలని చెప్పారు.  దీనిపై డీఎంకే సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అసెంబ్లీలో ఆందోళనకు దిగారు.  దీంతో ఎమ్మెల్యేల తీరును నిరసిస్తూ తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసిన గవర్నర్ సభ నుంచి వాకౌట్ చేశారు. ఇదే సమయంలో డీఎంకే మిత్రపక్ష ఎమ్మెల్యేలు కూడా సభ నుంచి వాకౌట్‌ చేసి అసెంబ్లీ ఎదుట ఆందోళనకు దిగారు. 
గవర్నర్ తన ప్రసంగంలో ఉద్దేశపూర్వకంగానే తమిళనాడు పదాన్ని పలకలేదని ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రసంగం కాపీల్లో తమిళనాడు అని ఉన్నా.. గవర్నర్ ప్రస్తావించకపోవడంపై సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసంగంలో ఉన్న విషయాలను చదవకుండా తమిళనాడు ప్రజలను అవమానించారని మండిపడ్డారు. ప్రసంగంలో ఉన్న ద్రావిడ మోడల్, తమిళనాడు అన్న చోట గవర్నర్ ప్రత్యామ్నాయ పదాలను వాడారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని మాత్రమే స్పీకర్ రికార్డ్ చేయాలని,  గవర్నర్ ప్రసంగంలోని పలు అభ్యంతరకర వ్యాఖ్యలను తొలగించాలని స్టాలిన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ దాన్ని ఆమోదించింది.

అయితే, ఇది ఎదో యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన అయితే కాదు, తెలంగాణలో ఎలాగైతే, గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య యుద్ధం నడుస్తోందో, తమిళ నాడులోనూ చాలా కాలంగా ముఖ్యమంత్రి గవర్నర్ మధ్య అలాంటి యుద్ధమే నడుస్తోంది. అందులో భాగంగానే ఈ పరిణామాన్ని చూడాలి. తమిళనాడు  గవర్నర్ ఆర్ఎన్ రవి. ముఖ్యమత్రి స్టాలిన్ ప్రభుత్వం మధ్య గతంలో ‘నీట్’ పరీక్ష విషయంలో, ఇటీవల కోయంబత్తూర్ లో జరిగిన కారు విష్పోటనం విషయంలో వివాదం తలెత్తింది. 

ఈ వివాదాల నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చందూ అసలు గవర్నర్ వ్యవస్థే అనవసరమని సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర పదవి అనవసరమైందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా బిల్లుల్ని గవర్నర్ పెండింగులో పెట్టడం ఏ మేరకు సమంజసమని జస్టిస్ చందూ ప్రశ్నించారు.

అయితే  బిల్లులను పెండింగ్ లో పెట్టే అధికారం భారత రాజ్యాంగమే గవర్నర్ కి  కల్పించిందని, మరో వాదన వుంది. నిజానికి  కేంద్రంలో రాష్ట్రాలలో వేర్వేరు పార్టీల ప్రభుత్వాలు ఉన్నప్పుడు గవర్నర్ వ్యవస్థ ఎప్పటికప్పడు వివాదస్పద మవుతోందని, ఈ నేపధ్యంలో  బ్రిటిష్ కాలం నాటి గవర్నర్ వ్యవస్థను కొనసాగించడం అవసరమా అనే చర్చ కూడా జరుగుతోంది. తమిళనాడు అసెంబ్లీలో జరిగిన ఘటన నేపథ్యంలో ఇప్పడు మళ్ళీ మరో మారు  అదే  చర్చ మొదలైంది.

By
en-us Political News

  
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
జగన్‌ తాను మళ్లీ  అధికారంలోకి వస్తానంటూ జగన్ 2.o అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ మేం 10x చూపిస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ జగన్ చేసిన హెచ్చరికలకు పవన్ కల్యాణ్  దీటుగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.  
పులివెందుల నియోజకవర్గ పరిధిలో కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. దశాబ్దాల కాలంగా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఏకపక్షంగా జగన్ కు పట్టుఉన్న నియోజకవర్గం పులివెందుల. అటువంటి పులివెందులలో ఎంపీటీసి జడ్పీటీసి స్థానాలను టీడీపీ  ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది.
2019 ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత   శైలిని ఒకింత మార్చుకున్నారు. 2024 ఎన్నికల ముందు వరకూ ఆయన పార్టీ నేతలు నోటి దురుసు ప్రదర్శించడాన్ని ప్రోత్సహించారు కానీ, స్వయంగా తాను ఒకింత సహనం చూపారు. అంత మాత్రాన రాజకీయ విలువలతో మృదు విమర్శలు చేశారని కాదు కానీ, అధికారంలోకి రావడానికి ముందున్నంత దూకుడు లేదని చెప్పాల్సి ఉంటుంది.
వైయస్ జగన్ ఇలాకాలో టీడీపీ 40 ఏళ్ళ చరిత్రను తిరగాసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.