రవాణా నిబంధనల ఉల్లంఘనపై సర్కార్ ఉక్కుపాదం : మంత్రి పొన్నం

Publish Date:Jun 8, 2026

Advertisement

 

తెలంగాణ వ్యాప్తంగా రవాణా శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ వ్యవస్థను మరింత బలో పేతం చేసి, నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఆయన ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్ర రహదారులపై ఓవర్‌లోడింగ్‌తో నడుస్తున్న వాహనాలు, త్రైమాసిక పన్నులు చెల్లించని వాహనాలు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేని వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సూచించారు. నిబంధనల ఉల్లంఘనలను గుర్తించిన వెంటనే జరిమానాలు విధించడంతో పాటు అవసరమైతే వాహనాలను సీజ్ చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.

చెక్‌పోస్టుల రద్దు తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తనిఖీలను విస్తృతం చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాల వారీగా 10 ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు, రాష్ట్ర స్థాయిలో రెండు స్పెషల్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేయనున్నట్లు వెల్లడించారు.

విద్యార్థుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని స్పష్టం చేసిన మంత్రి, స్కూల్ బస్సులు, మినీ వ్యాన్‌లకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలని అన్నారు. అనుమతించిన సామర్థ్యానికి మించి విద్యార్థులను తరలిస్తున్నట్లు గుర్తిస్తే సంబంధిత వాహనాలను సీజ్ చేయడంతో పాటు విద్యాసంస్థల యాజమాన్యాలపై కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాలు తెలంగాణలో పన్నులు చెల్లించకుండా తిరుగుతున్న అంశంపై ప్రత్యేక నిఘా ఉంచాలని మంత్రి సూచించారు. పన్నులు ఎగవేస్తున్న వాహన యజమానులపై భారీ జరిమానాలు విధించడంతో పాటు అవసరమైతే వాహనాలను స్వాధీనం చేసుకోవాలని చెప్పారు. అలాగే ప్రయాణికుల భద్రత దృష్ట్యా స్లీపర్ బస్సుల్లో నిబంధనల ఉల్లంఘనలను ఏమాత్రం ఉపేక్షించవద్దని, ప్రమాదాలకు కారణమయ్యే నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. సమీక్షా సమావేశంలో వికాస్ రాజ్, ఇలాంబత్రి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 

By
en-us Political News

  
ప్రపంచవ్యాప్తంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, పెరుగుతున్న సమర వాతావరణం నేపథ్యంలో భారత ప్రభుత్వం అత్యంత అప్రమత్తమైంది.
అశోక్‌నగర్‌లో నిరుద్యోగుల మెరుపు ధర్నా..!
వైసీపీ అధినేత జగన్ వైఖరిపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
భారత స్వాతంత్య్ర సంగ్రామంలో కోట్లాది మంది భారతీయుల్లో దేశభక్తి రగిలించిన అమర గేయం
ఛత్తీస్‌గఢ్ మీదుగా పయనిస్తున్న తీవ్ర వాయుగుండం, చురుగ్గా ఉన్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం
విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై ప్రవళ్లిక పట్ల దురుసు ప్రవర్తన.. చర్యలకు డిమాండ్..!
జగన్‌కు ములాఖత్‌కు నిరాకరణ.. జైలు వద్ద సీదిరి కుటుంబ సభ్యులను పరామర్శించారు.. !
మానవత్వం మరుగున పడిపోతోందా? కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాల్సిన చేతులే.. అదను చూసి లూటీకి తెగబడుతున్నాయా?
విధుల్లో ఉన్న మహిళా ఎస్సైపై వైసీపీ నేతలు దురుసు ప్రవర్తన..!
పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు..!
గచ్చిబౌలిలో నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో మట్టి కుప్పకూలడంతో ముగ్గురు కార్మికులు గాయపడ్డారు.
తెలంగాణలో విద్యా వ్యవస్థ, నిరుద్యోగం, ఉద్యోగ నైపుణ్యాలు (స్కిల్స్) అంశాలపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
ఫార్ములా-ఈ కారు రేస్ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రేపు నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరుకానున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.