లోకేష్ పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి

Publish Date:Jan 23, 2023

Advertisement

కుప్పం నుంచి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ఈ నెల 27న ప్రారంభం కానున్నది. ఆయన పాదయాత్రకు నాన్చి నాచ్చి ఎట్ట కేలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.  నిబంధనలకు లోబడి పాదయాత్ర సాగాలని షరతు విధించింది.  అలాగే  పాదయాత్రలో ఎటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలూ చేయరాదని కండీషన్ పెట్టింది.  

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ.. రాష్ట్రంలో ఉత్కంఠభరిత వాతావరణం చిక్కన అవుతోంది. ఆయన పాదయాత్రకు అనుమతి విషయంలో పోలీసులు అనుసరిస్తున్న విధానం తెలుగుదేశం శ్రేణులను రెచ్చగొట్టే విధంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాదయాత్ర ప్రారంభానికి ముందే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి క్షీణించే విధంగా పోలీసులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లోకేష్ పాదయాత్ర ఈ నెల 27 నుంచి శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ పాదయాత్రను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తెలుగుదేశం యాత్రకు అన్ని ఏర్పాట్లూ చేసింది. కుప్పం నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్రకు నారా, నందమూరి కుటుంబ సభ్యులతో పాటు.. ఎన్టీఆర్ కుటుంబీకులు అంతా హాజరయ్యేం  అవకాశం ఉంది.  

మొత్తం రాష్ట్రం  దృష్టి అంతా లోకేష్ పాదయాత్రపైనే ఉంది.  అందుకే పాదయాత్రకు అనుమతి విషయంలో పోలీసుల వైఖరి పట్ల సర్వత్రా అసహనం వ్యక్తం అవుతోంది. కావాలనే అనుమతి విషయం తేల్చకుండా పోలీసులు తాత్సారం చేయడంపై తెలుగుదేశం శ్రేణులు ఆరోపిస్తున్నాయి. తెలుగుదేశం సీనియర్ నాయకుడు వర్ల రామయ్య లేఖకు డీజీపీ స్పందించిన తీరును రాజకీయాలకు అతీతంగా అందరూ తప్పు పడుతున్నారు. ఇప్పటికే అసందర్భం, అనుచితం అయిన జీవో 1తో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన జగన్ ప్రభుత్వం.. పోలీసుల ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదనడానికి వర్ల లేఖకు డీజీపీ స్పందనే నిదర్శనమని పరిశీలకులు అంటున్నారు. లోకేష్ ప్రజలలో చైతన్యం తీసుకువచ్చేందుకు, ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు చేస్తున్న పాదయాత్ర ఒక  ప్రాంతానికో, నియోజకవర్గానికో పరిమితమైనది కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన 400 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలూ కవర్ అయ్యేలా 4000 కిలోమీటర్ల మేర సాగనుంది. ఈ యాత్రలో ఆయనను అన్ని వర్గాల ప్రజలనూ కలుస్తారు. తనను కలవడానికి వచ్చే ప్రజలందరితోనూ మాట్లాడుతారు. ఇందుకు ఆంక్షలు విధించడానికి ప్రభుత్వానికి ఉన్న అధికారం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రం మొత్తం ఒక అగ్నిగోళంగా తయారైంది. పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తే రాష్ట్రంలో జనం స్వచ్ఛందంగా బయటకు వచ్చి ప్రభుత్వ నియంతృత్వ వైఖరికి నిరసనగా ఆందోళనలకు దిగే అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అలాగే పాదయాత్రకు అనుమతి ఇవ్వకుంటే కోర్టును ఆశ్రయించడానికీ,  చట్ట పరంగా ఎలా ముందుకు వెళ్లాలన్న విషయంలో కూడా తెలుగుదేశం స్పష్టమైన అవగాహనతో ఉందని అంటున్నారు.

గతంలో అంటే విపక్ష నేతగా జగన్ రాష్ట్రంలో పాదయాత్ర చేసిన సందర్బంగా ఎటువంటి అనుమతులూ లేకపోయినా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం యాత్రకు పూర్తి భద్రత కల్పించిన సంగతిని ఈ సందర్భంగా తెలుగుదేశం గుర్తు చేస్తున్నది. ఈ పరిణామాలన్నీ గమనించిన సర్కార్ ఎట్టకేలకు లోకేష్ పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కింద పడ్డా మాదే పై చేయి అని చెప్పుకునేందుకు, రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేయరాదనీ, నిబంధనలను మీరరాదనీ షరతులు విధించింది.

దీనిపై తెలుగుదేశం శ్రేణులు జోకులు పేల్చుతున్నాయి. ముఖ్యమంత్రిని నడిరోడ్డు మీద కాల్చాలి అని గతంలో విపక్ష నేతగా జగన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ అవి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కావా అని ప్రశ్నిస్తున్నాయి. సంయమనంతో అంశాల వారీగా విశ్లేషణాత్మక విమర్శలు లోకేష్ తన పాదయాత్ర సందర్భంగా చేస్తారనీ, అవి రెచ్చగొట్టేవిగా ఉండవనీ, జగన్ దుష్టపాలనను ప్రజలకు అవగతమయ్యేలా వివరణాత్మకంగా ఉంటాయనీ చెబుతున్నారు. లోకేష్ పాదయాత్ర శాంతియుతంగా క్రమశిక్షణతో జరుగుతుందనీ, రెచ్చగొట్టే చర్యలూ, వ్యాఖ్యలకు పాల్పడకుండా పోలీసులు వైసీపీ గూండాలనే నియంత్రించాల్సి ఉంటుందని చెబుతున్నాయి. 

By
en-us Political News

  
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.
గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.