సీట్ల సర్దుబాటుపైనే ఇప్పుడు దృష్టంతా?

Publish Date:Jan 23, 2023

Advertisement

జనసేన   తెలుగుదేశం  పొత్తు పై ఇక ఇప్పుడెవరికీ ఎటువంటి అనుమానాలూ లేవు. జనసేన సీనియర్ నేత, పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు కూడా పొత్తు ఉంటుంది. సీట్ల సర్దుబాటుపై పార్టీ అధినేత పవన్ నిర్ణయం తీసుకుంటారు అని చెప్పేశారు.  వైసీపీని  గద్దె దించాలంటే పొత్తులు తప్పవని ఇటీవల రణస్థలంలో జరిగిన యువగళం సభలో పవన్ కల్యాణ్ స్పష్టత ఇవ్వడం, ఆ తరువాత సీట్ల సర్దుబాటుపై నాగబాబు సంకేతాలివ్వడంతో  ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా  ఇరు పార్టీల మధ్యా సీట్ల సర్దుబాటుపైనే చర్చ సాగుతోంది.  ఎపిలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలలో 40-50 స్థానాలపై జనసేన డిమాండ్   చేస్తున్నట్లుగా ఇరు పార్టీలలోనూ చర్చ అయితే జరుగుతోంది. కానీ చివరకు పాతిక సీట్లతో జనసేన సరిపెట్టుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ  వర్గాలు అంచనా వేస్తున్నాయి.  ఆ సీట్లన్నీ కూడా ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. ఇంకా సీట్ల సర్దుబాటుపై ఇరు పార్టీల నుంచీ ఎటువంటి ప్రకటనా రాకముందే.. తెలుగువన్  ఈ నెల 5వ తేదీనే జనసేన- తెలుగుదేశం పొత్తు ఖరారు.. సీట్ల సర్దుబాటు కొలిక్కి అన్న శీర్షికన ప్రత్యేక కథనంలో పేర్కొంది. పొత్తులో జనసేన పార్టీకి ఏడు జిల్లాల పరిధిలో 20 సీట్లు కేటాయించేందుకు తెలుగుదేశం అంగీకరించిందనీ, ఈ మేరకు ఇరు పార్టీల మధ్యా అవగాహన కూడా కుదిరిందనీ ఆ కథనం లో వెల్లడించింది. ఇప్పుడు సీట్ల సర్దుబాటుపై జనసేనాని నిర్ణయం తీసుకుంటారని ప్రకటించడమే కాకుండా.. ఎవరూ ఫలానా స్థానం నుంచి పోటీ చేస్తామంటూ ప్రకటనలు చేయవద్దని పార్టీ నేతలకు స్పష్టమైన సందేశం ఇచ్చారు.

ఈ నేపథ్యంలోనే జనసేన తెలుగుదేశంతో సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే చర్చలు ప్రారంభించిందని తేటతెల్లమైపోయింది.  తెలుగువన్ చెప్పినట్లు ఏడు జిల్లాల్లో సీట్ల సర్దుబాటుపై ఒక అవగాహన ఇరు పార్టీల మధ్యా కుదిరిందన్న చర్చ కూడా రాజకీయ వర్గాలలో ఆరంభమైంది. ఇవి కాక మరి కొన్ని స్థానాల విషయంలో ప్రతిష్ఠంభన కొనసాగుతోందని అంటున్నారు. ఇప్పటి వరకూ  గుంటూరు, కృష్ణ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ, చిత్తూరు,కర్నూలు జిల్లాలలో సీట్ల సర్దుబాటు విషయంలో ఒక అవగాహన ఇరు పార్టీల మధ్యా కుదిరిందని చెబుతున్నారు. విజయనగరం, అనంతపురం జిల్లాల విషయంలో చర్చలు సాగుతున్నాయంటున్నారు.

అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు  గుంటూరు జిల్లాలో తెనాలి, సత్తెన పల్లి, కృష్ణా జిల్లాలో పెడన, కైకలూరు, విజయవాడ వెస్ట్, తూర్పుగోదావరి జిల్లాలో అమలాపురం, పి. గన్నవరం, రాజోలు, రాజానగరం, కాకినాడ రూరల్ నియోజకవర్గాలలోనూ, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, నరసాపురం, తాడేపల్ల్లిగూడెం, పాలకొల్లు నియోజకవర్గాలలోనూ జనసేన అభ్యర్థులు రంగంలో ఉంటారు. ఇక విశాఖ జిల్లాలో పెందుర్తి, భీమిలి, గాజువాక, చోడవరం నియోజకవర్గాలలో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారు. చిత్తూరు జిల్లాలో చిత్తూరు లేదా తిరుపతిలో పొత్తలో భాగంగా జనసేన పోటీ చేస్తుంది.  ప్రకాశం జిల్లా లోని దర్శి, గిద్దలూరు స్థానాలను తెలుగుదేశం జనసేనకు కేటాయించింది.  

ఏతా వాతా ఈ పొత్తు  కారణంగా జనసేన, తెలుగుదేశం కూడా అనివార్యంగా కొన్ని త్యాగాలకు సిద్ధపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలలో కొన్ని స్థానాలను తెలుగుదేశం జనసేనకు కేటాయించడం అంటే.. ఆయా స్థానాలలో ఇంత కాలం అధికార వైసీపీ వేధింపులను తట్టుకుని నిలబడిన కొందరు నాయకులు తమతమ స్థానాలను త్యాగం చేయాల్సి ఉంటుంది.  అలాగే మిగిలిన స్ధానాల జనసేన త్యాగం చేయాల్సి ఉంటుంది.

మొత్తం మీద తెలుగుదేశం అధినేత ఇప్పటికే ఓ పాతిక స్థానాలను జనసేనకు కేటాయించడానికి ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఇందుకు 2019 ఎన్నికల ఫలితాలను బేస్ గా చేసుకున్నారని అంటున్నారు.  ప్రభుత్వ వ్యతిరేక వోటు చీలకుండా ఉండాలంటే.. జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తు అవసరం.  ఇరు పార్టీలకూ కూడా అది అవసరం.   అందుకే రాష్ట్రంలో రాజకీయ సమీకరణాల మార్పుపై జరుగుతున్న చర్చలో బీజేపీ ప్రస్తావన ఎక్కడా రావడం లేదు.అందుకే వచ్చే ఎన్నికల నాటికి బిజెపి, జనసేన మధ్య మైత్రీ బంధం తెగిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

By
en-us Political News

  
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.
గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.