మాజీలు.. కార్యాలయాల ఖాళీ నెపంతో ప్రభుత్వ ఫర్నీచర్ తరలింపునకు యత్నాలు!?

Publish Date:Dec 7, 2023

Advertisement

ఒక వైపు తెలంగాణ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లు జరుగుతుంటే.. ఇదే సందుగా మాజీ మంత్రులు తమ కార్యాలయాల నుంచి ప్రభుత్వ ఫర్నీచర్ ను తరలించుకుపోయేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అది గమనించి కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుపడటంతో రాష్ట్రంలో పలు చోట్ల ఉద్రిక్తత నెలకొంది. మంత్రి కార్యాలయాలలో ఫర్నీచర్ ప్రభుత్వ సొత్తు. అధికారం ఉన్నంత వరకూ అనుభవించడం మాత్రమే మంత్రుల పని. అధికారం నుంచి తప్పుకోగానే ఆ కార్యాలయాన్ని వీడాలే తప్ప ఫర్నిచర్ ను కూడా తరలించేయడం సరికాదు.

అయితే కొందరు బీఆర్ఎస్ మాజీలు అదే చేస్తున్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అనుచరులు రవీంద్ర భారతి సమీపంలో ఉన్న ఆయన కార్యాలయాన్ని ఖాళీ చేసే క్రమంలో ఫర్నీచర్, కంపూటర్లను కూడా ట్రాలీలోకి ఎక్కించేస్తుండగా గమనించిన కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ప్రభుత్వ సొత్తును తరలించడం తగదంటూ వాగ్వాదానికి దిగారు. విషయం పోలీసుల వరకూ వెళ్లింది.  ఇక పలువురు ఎమ్మెల్యులు కూడా తమ తమ క్యాపు కార్యాలయాలను ఖాళీ చేసే నెపంతో ఫర్నీచర్ కు కూడా తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఎక్కడికక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలనూ సముదాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలలోని ఫర్నిచర్, ఇతర వస్తువుల పర్యవేక్షణ బాధ్యత వహిస్తున్న రోడ్లు  భవనాల శాఖ స్పందించి.. పరాజయం పాలైన కొందరు ఎమ్మెల్యేలు కార్యాలయంలో ఫర్నీచర్ తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలు సరికాదని పేర్కొంది.  

 బోధన్‌లో మాజీ షకీల్ అమీర్  తన క్యాంపు కార్యాలయంలోని ఫర్నీచర్ తలరించడానికి చేసిన ప్రయత్నం కూడా ఉద్రిక్తతలకు దారి తీసింది.  అసలు విషయమేమిటంటే తెలంగాణ ఏర్పాటు అనంతరం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర  ఒక్కో నియోజకవర్గంలో క్యాంపు కార్యాలయాలను కోటి రూపాయల చొప్పున నిధులతో నిర్మించింది. వాటి విద్యుత్ బిల్లులు, పన్నులను కూడా ప్రభుత్వమే చెల్లిస్తూ వచ్చింది.  

ఇప్పుడు ప్రభుత్వం మారింది. పరాజయం పాలైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో కొందరు తమతమ క్యాంపు కార్యాలయాలను ఖాళీ చేసే నెపంతో ప్రభుత్వ ఫర్నీచర్ ను కూడా తరలించే ప్రయత్నాలు చేస్తుండటంతో ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. పరాజయం పాలైన  ఎమ్మెల్యేలు తమతమ క్యాంపు కార్యాలయాలను ఖాళీ చేసిన తరువాత వాటికి అవసరమైన మరమ్మతులు చేసి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఆర్అండ్ బీ శాఖ అప్పగించాల్సి ఉంటుంది.

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వివరాలు. రూ. 5 లక్షల ఉచిత బీమా కవరేజ్, అర్హతలు, వయస్సు పరిమితి మరియు దరఖాస్తు విధానం గురించిన పూర్తి సమాచారం.
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.