ఆహ్వానమే పంపకుండా రాలేదంటూ నిందలా?

Publish Date:May 3, 2023

Advertisement

మంత్రి జగదీశ్ రెడ్డి అత్యుత్సాహంతో గవర్నర్ తమిళిసై పై చేసిన విమర్శలు, వ్యాఖ్యలు కేసీఆర్ సర్కార్ ను యిరుకున పెట్టాయా అంటే ఔననే సమాధానం వస్తోంది. అసలు గత కొన్నేళ్లుగా రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య సంబంధాలు ఉప్పు.. నిప్పులా ఉన్న సంగతి విదితమే. పెండింగ్ ఫైళ్ల విషయంలో ప్రభుత్వం, గవర్నర్ తగాదా సుప్రీం కోర్టు వరకూ కూడా వెళ్లింది. అంతకు ముందు తెలంగాణ బడ్జెట్ సమావేశాల వ్యవహారంలో కూడా గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం పంచాయతీ కోర్టు కెక్కింది. 

అప్పట్లోనే..  వ్యవస్థల మధ్య, వ్యక్తుల మధ్య విభేదాలు   ఈ స్థాయికి చేరుకోవడం ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధమనీ, అయితే తెలంగాణ ప్రభుత్వం,  ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు, గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ మధ్య నెలకొన్న ఘర్షణాత్మక వాతావరణం మర్యాద గీతను దాటేసిందనీ విమర్శలు వెల్లువెత్తాయి. అటు గవర్నర్, ఇటు ప్రభుత్వం కూడా తగ్గేదేలా అన్నట్లుగా పరస్పర విమర్శలతో బహిరంగ రచ్చకు ఎంత మాత్రం వెనుకాడని పరిస్థితి ఎంత మాత్రం సరికాదన్న వాదనలూ వినిపించాయి. రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణ విషయంలో కోర్టు తెలంగాణ సర్కార్ కు అక్షింతలు వేసింది. ఆ తరువాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్, ప్రభుత్వం మధ్య అగాధం.. మరో సారి కోర్టు మెట్లు ఎక్కింది.

 అలాగే గవర్నర్  తమిళిసై కూడా  ప్రొటోకాల్ ఇవ్వడం లేదని బహిరంగ విమర్శలకు దిగడమే కాకుండా.. ప్రభుత్వ విధానాలను కూడా తూర్పారపడుతున్నారు. అందుకు ఆమె మీడియా సమావేశాలనే ఉపయోగించుకుంటున్నారు.   గవర్నర్, ప్రభుత్వం మధ్య విభేదాలు కొత్త కాదు కానీ.. రాజ్యాంగ సంక్షోభం తలెత్తేంతగా ముదిరిపోవడం మాత్రం దేశంలో బహుశా ఇదే తొలిసారి.  

గవర్నర్‌ విషయంలో ప్రోటోకాల్ పాటించకుండా తెలంగాణ సర్కార్ ఇబ్బంది పెడుతోందనే విమర్శలు చాలా రోజులుగా ఉన్నాయి. అసలు ప్రోటోకాల్ ఇవ్వకపోగా.. ఆమె తెలంగాణను అవమానిస్తోందంటూ విమర్శలు చేయడం మంత్రులకు పరిపాటిగా మారింది. తాజాగా మంత్రి జగదీష్ రెడ్డి మరోసారి అలాంటి విమర్శలే చేశారు. అయితే ఆయన తాజా విమర్శలు ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేసే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి  గవర్నర్ రాలేదంటూ తమిళిసై సౌందరరాజన్ పై మంత్రి జగదీష్ రెడ్డి విమర్శలు చేశారు.  సచివాలయం ప్రారంభోత్సవానికి రావడం, రాకపోవడం అనేది ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నామంటూ.. ఆమె గైర్హాజర్ వల్ల ఆమె నిజస్వరూపమే బయటపడిందంటూ వ్యాఖ్యానించారు.

 తెలంగాణ అభివృద్దిని చూసి  తట్టుకోలేకపోతున్నారని కూడా అన్నారు.  అయితే జగదీశ్వరరెడ్డి విమర్శలపై రాజ్ భవన్ ఘాటుగా స్పందించింది.  నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి సంబంధించి ప్రభుత్వం నుంచి గవర్నర్‌కు ఆహ్వానం అందలేదని, పిలవని పేరంటానికి గవర్నర్ ఎలా వస్తారని నిలదీసింది.  ఒక వేళ ప్రభుత్వం నుంచి గవర్నర్ కు ఆహ్వానం అంది ఉంటే.. అందినా ఆమె రాకపోయి ఉంటే.. జగదీశ్ రెడ్డి విమర్శలలో ఒక అర్ధం ఉండేది. కానీ  గవర్నర్ కు ఆహ్వానం అందలేదని రాజ్ భవన్ స్పష్టం చేసిన తరువాత కూడా ప్రభుత్వం నుంచి, కానీ విమర్శలు చేసిన మంత్రి జగదీశ్ రెడ్డి నుంచి కానీ ఎటువంటి స్పందనా లేకపోవడంతో  గవర్నర్ విషయంలో ప్రభుత్వంమరోసారి ప్రొటోకాల్ పాటించలేదని బైటపడింది.  

By
en-us Political News

  
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.