బంజార రేడియో, యూట్యూబ్ చానల్ ప్రారంభం.. తెలుగువన్ పై ప్రశంసల వర్షం
Publish Date:Nov 14, 2021
Advertisement
దేశంలో బంజారా జాతికి గొప్ప విశిష్టత ఉంది. సంస్కృతి, సంప్రదాయాలకు గిరిజనులు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నారు. అయితే ఇప్పటికీ బంజార బాష, సంస్కృతికి సమాజంలో సరైన గుర్తింపు లేదు. లంబాడాలు అభివృద్దికి ఆమడ దూరంలోనే ఉంటున్నారు. అందుకే దేశంలోనే తొలిసారిగా తెలుగు వన్ గొప్ప కార్యం చేపట్టింది. బంజార జాతి అభ్యున్నతి కోసం రెడియో , యూట్యాబ్ ఛానెల్ తీసుకొచ్చింది. హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో సేవాలాల్ ఉత్సవ కమిటీ మరియు స్వామి వివేకానంద సంఘ ఆధ్వర్యంలో నిర్వహించిన బంజార ఉత్సవ్ 2021లో ఈ చానెళ్లను లాంఛ్ చేశారు. బంజారా ఉత్సవ్ కు ముఖ్య అతిథిగా హాజరైన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా టోరీ గోర్ బంజార రేడియో మరియు యూట్యూబ్ చానెల్ ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో తెలుగు వన్ ఎండీ కంఠమనేని రవిశంకర్, మాజీ ఎంపీ రవీంద్రనాయక్, సేవాలాల్ ఉత్సవ కమిటీ చైర్మన్ అశోక్ రాథోడ్ పాల్గొన్నారు. బంజారా భాష,సంస్కృతిని పెంపొందించే టోరీ గోర్ బంజార రేడియో మరియు యూట్యూబ్ చానెల్ ను లాంచ్ చేయడం ఎంతో ఆనందంగా ఉందని గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. రాష్ట్రంలో బంజారా జాతి అభివృద్ధి దిశలో ముందుకు పోవాలని కోరుకున్నారు. గిరిజన బిడ్డలు గొప్ప చదువులు చదివి ఉన్నంత ఉద్యోగాలను పొందాలని దత్తాత్రేయ ఆకాక్షించారు. బంజారా జాతి అభ్యున్నతి కోసమే దేశంలోనే తొలిసారిగా బంజార రేడియో, యూట్యూబ్ ఛానల్ తీసుకొచ్చామని తెలుగు వన్ ఎండీ రవి శంకర్ చెప్పారు. బంజారాలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బంజారలు అన్ని రంగాల్లో ఎదగాలన్నదే తెలుగు వన్ ఆశయమని చెప్పారు రవిశంకర్. బంజార బాష, సంస్కృతిని ప్రపంచానికి గొప్పగా పరిచయం చేసేందుకు తెలుగువన్ చేస్తున్న కృషి అమోఘమని రవీంద్రనాయక్ ప్రశంసించారు. తెలుగు వన్ ఎండీ రవిశంకర్ ను ఆయన అభినందించారు. ఇక బంజార ఉత్సవ్ లో గిరిజన జాతి ఔన్నత్యాని తెలిపేలా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. గిరిజన సంప్రాదాయాలు ఉట్టిపడేలా సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ఉత్సవాల్లో లంబాడి విన్యాసాలు, ఆటపాటలు అందరిని ఆకట్టుకున్నాయి.
http://www.teluguone.com/news/content/governer-bandaru-dattatreya-launched-tori-gore-banjara-radio-youtube-chanel-39-126373.html





