మహోన్నత నేత 'కిసాన్' గొర్రెపాటి వెంకటసుబ్బయ్య! ఘంటసాలలో ప్రముఖుల నివాళులు

Publish Date:Dec 10, 2020

Advertisement

ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, రైతు బాంధవుడిగా పేరు పొందిన గొర్రెపాటి వెంకట సుబ్బయ్య 50 వర్ధంతిని ఘంటసాలలో నిర్వహించారు. సత్రం సెంటర్ లో వున్న కిసాన్ వెంకటసుబ్బయ్య గారి విగ్రహం వద్ద జాతీయ కాంగ్రెస్ కండువాలు , పూలమాల తో నివాళులు అర్పించారు. తర్వాత గ్రామపంచాయతీ వద్ద వున్న కిసాన్ వెంకటసుబ్బయ్య , ఆచార్య ఎన్జీ  రంగా విగ్రహాల వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో గొర్రెపాటి వెంకటసుబ్బయ్య సేవలను స్మరించుకున్నారు నేతలు. దేశం కోసం, రైతుల కోసం ఆయన చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. రైతుల సంక్షేమం కోసం  నిస్వార్ధ కృషి చేసి ' కిసాన్ ' బిరుదు తో ప్రజల హృదయాలలో వెంకట సుబ్బయ్య ధన్యజీవిగా నిలిచిపోయారని పలువురు వక్తలు కొనియాడారు.  
 

కృష్ణాజిల్లా ఘంటసాల గ్రామంలో జన్మించిన గొర్రెపాటి వెంకటసుబ్బయ్య గాంధిజీ పిలుపుతో దేశ స్వాతంత్ర పోరాటంలోకి దిగారు. తన 20వ ఏటనే ఆయన కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు. సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా 1920 లో జరిగిన ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా వెయ్యకుండా ఖాళీ పెట్టెలు పంపిన ఘన చరిత్ర ఘంటసాల గ్రామానిది. దేశంలోనే సంచలనంగా మారిన ఈ ఘటనలో తన సహాధ్యాయులు  గొట్టిపాటి బ్రహ్మయ్య, పండిత గొర్రెపాటి వెంకట సుబ్బయ్యలతో కలిసి ప్రధాన పాత్ర పోషించారు గొర్రెపాటి వెంకటసుబ్బయ్య. మహాత్మా గాంధీ ఘంటసాలలో పర్యటించినపుడు ఖద్దరు నిధికి విరాళాలు పోగుచేసి ఆయన మన్ననలు అందుకున్నారు.1929 లో బ్రిటిషు వారికి నల్ల జెండాలు చూపించి నిరసన తెలిపినందుకు అప్పటి ప్రభుత్వం గొర్రెపాటి వెంకటసుబ్బయ్యని  జైలు లో పెట్టింది. 1939 లో స్వగ్రామంలో జాతీయ జండా ఎగరేసినందుకు ఆయన లాఠీ దెబ్బలు తిన్నారు. 1946 లో అప్పటి బ్రిటిష్ అధికారి రోలాండ్ తో చర్చలు జరిపి పొగాకు రైతులపై విధించిన ఎక్సయిజ్ సుంకాన్ని సడలించటానికి కృషి చేశారు.గొర్రెపాటి వెంకటసుబ్బయ్య సతీమణి సరస్వతమ్మ కూడా భర్తకి తోడుగా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. 

 

నిర్బంధంగా రైతుల భూముల్ని ప్రభుత్వం ఆక్రమించటానికి వ్యతిరేకంగా గళమెత్తారు వెంకట సుబ్బయ్య. రైతాంగ ఉద్యమ నాయకులుగా  తీవ్ర స్థాయి లో ప్రభుత్వంపై పోరాటం చేశారు. కొల్లేరు , రొంపేరు,తమ్మిలేరు భూములని రైతు కూలీలకు ఇప్పించటానికి గట్టిగా పోరాడారు గొర్రెపాటి వెంకటసుబ్బయ్య. రైతుల కోసం  చేసిన కృషికి గుర్తుగా రైతులందరి చేత 'కిసాన్ ' వెంకటసుబ్బయ్య అని ఆప్యాయంగా పిలిపించుకున్నారు. జాతీయ నేత రాజాజీతో ఆయనకి ఎంతో అనుబంధం ఉండేది. ఆ చొరవతోనే రైతులకి అవసరమైన ఎన్నో ప్రయోజనాల్ని సాధించారు. ఒక దశలో రైతులకి న్యాయం చేయని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ని వీడటానికి కూడా సిద్ధపడ్డారు గొర్రెపాటి వెంకటసుబ్బయ్య.  కిసాన్ గొర్రెపాటి వెంకటసుబ్బయ్య దంపతులిద్దరూ నిరాడంబరంగా నిస్వార్ధంగా ప్రజలకి సేవ చేశారు. అనునిత్యం ప్రజలకి అందుబాటులో ఉంటూ వారి సమస్యలపై పోరాడేవారు. ఎవరైనా తాము గురువుగా భావించేవారి ఆత్మకథలని వ్రాస్తారు. కానీ తన శిష్యుడైన వెంకట సుబ్బయ్య గారి గురించి ఆయన గురువైన ఆచార్య ఎన్ జి రంగా  "మన కిసాన్ వెంకట సుబ్బయ్య" అనే పుస్తకం రాయడం మరో విశేషం. దీనిని బట్టి వెంకట సుబ్బయ్య గారి నిబద్ధతని అర్ధం చేసుకోవచ్చు. 

 

1949 నుండి 1952 వరకు కృష్ణా జిల్లా బోర్డు ఉపాధ్యక్షులుగా పనిచేశారు గొర్రెపాటి వెంకటసుబ్బయ్య. ఆంధ్ర రాష్ట్ర రైతు సమ్మేళన అధ్యక్షుడిగా 1943 నుండి 1970 వరకూ కొనసాగారు. 1959లో రాజాజీ నెలకొల్పిన స్వతంత్ర పార్టీకి ఆంధ్ర రాష్ట్ర ప్రధమ అధ్యక్షుడిగా పనిచేశారు. గాంధీ స్మారకనిధి సభ్యులుగా పనిచేసారు. ఆచార్య ఎన్ జి రంగా గారికి ప్రియ శిష్యుడిగా, సన్నిహిత సహచరులుగా మెలిగారు. గొర్రెపాటి వెంకటసుబ్బయ్య  నెలకొల్పిన రంగా ట్రస్ట్ లో 1957 నుండి 1970 వరకు సభ్యులుగా ఉన్నారు. 1965 నుండి 1970లో అయన చనిపోయే వరకూ వాహినీ పత్రిక సంపాదకులుగా వ్యవహరించారు. 

 

'కిసాన్ ' వెంకటసుబ్బయ్య గారి మనుమడు, కృష్ణాజిల్లాపరిషత్ మాజీ వైస్ ఛైర్మెన్ గొర్రెపాటి వెంకట రామకృష్ణ అధ్యక్షతన జరిగిన వర్ధంతి సభలో పలువురిని సన్మానించారు.  భౌద్ధ గురువు పూజ్య బంతేజా , ఆచార్య NG రంగా వ్యవసాయ పరిశోధన కో ఆర్డినేటర్ కే నాగేంద్రం , కేవీకే కో ఆర్డినేటర్ ఝాన్సీ ద్వారా  కిసాన్ వెంకట సుబ్బయ్య , ఆచార్య NG రంగా ల అనుచరులు  గొర్రెపాటి లీలాకృష్ణయ్య,  గొర్రెపాటి చంద్రశేఖర రావు, అయినపూడి చంద్రశేఖర రావు, గుత్తికొండ సీతా రామాంజనేయులను ఘనంగా సన్మానించారు. ఘంటసాల స్వాతంత్ర సమరయోధుల వారసులు గొర్రెపాటి గోపాలకృష్ణ, ఆకురాతి వేణు గోపాలరావు, వేమూరి గోపాలకృష్ణ , వేమూరి పట్టవర్ధన్ గార్లను కూడా సన్మానించారు.

By
en-us Political News

  
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.