మదనపల్లి ఫైళ్ల దగ్ధం కేసు మాధవరెడ్డి అరెస్టు.. పెద్దిరెడ్డికి ఉచ్చు బిగిసిందా?

Publish Date:Apr 25, 2025

Advertisement

మదనపల్లి ఫైళ్ల దగ్ధం కేసులో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో అగ్ని ప్రమాదం సంఘటనలో కుట్ర అన్నకోణంలో దర్యాప్తు చేస్తున్న సిట్ దూకుడు పెంచింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడు మాధవరెడ్డిని సిట్ అరెస్టు చేసింది. మదనపల్లి ఫైళ్ల దగ్ధం కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న మాధవరెడ్డి గత ఆరు నెలలుగా కోర్టు నుంచి ముందస్తు బెయిలు పొంది అరెస్టు కాకుండా తప్పించుకున్నారు.

అయితే సిట్ అధికారులు కోర్టును ఆశ్రయించి ఆ యాంటిసిపేటరీ బెయిలు రద్దు అయ్యేలా చేశారు. మాధవరెడ్డికి యాంటిసిపేటరీ బెయిలు రద్దు కావడంతో అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలంలోని పెద్దగొట్టిగల్లోలోని ఒక ఫామ్ హౌస్ లో మాధవరెడ్డి ఉన్నట్లుగా అందిన పక్కా సమాచారం మేరకు సిట్ పోలీసులు అక్కడకు వెళ్లి ఆయనను అదుపులోనికి తీసుకున్నారు.  అరెస్టు సమయంలో మాధవరెడ్డి తన వద్ద ఉన్న మొబైల్ ఫోన్లను నీటిలో పడేసేందుకు చేసిన ప్రయత్నాన్ని అడ్డుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు. మాధవరెడ్డిని అదుపులోనికి తీసుకుని  తిరుపతికి తరలించారు. మాధవరెడ్డి అరెస్టుతో ఇక మాజీ మంత్రి పెద్దిరెడ్డికి ఉచ్చు బిగిసినట్లేనని అంటున్నారు. 

జగన్ హయాంలో వైసీపీ నేతల అక్రమ సంపాదన, భూకబ్జాల వ్యవహారం అడ్డూ అదుపూలేకుండా సాగిందన్న ఆరోపణలు ఉన్నాయి. అలా అడ్డూ అదుపూ లేకుండా భూకజ్జాలకు పాల్పడిన వారిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందువరుసలో ఉన్నారని అప్పట్లోనే ఆరోపణలు ఉన్నాయి. జగన్ ప్రభుత్వం పతనమై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత జగన్ హయాంలో అక్రమాలకు పాల్పడిన ఒక్కొక్కరూ భయంతో వణుకుతున్నారు. పోలీసు కేసులకు భయపడి సాక్ష్యాలను తారుమారు చేయడానికి పెద్దరెడ్డి ఒక అడుగు ముందుకు వేసి తన భూ ఆక్రమణలకు సంబంధించిన సాక్ష్యాలను గల్లంతు చేయడం కోసమే మదనపల్లె సబ్ కలెక్టరేట్ కార్యాల యంలో అగ్నిప్రమాద కుట్రకు తెరలేపారన్న అనుమానాలు ఉన్నాయి.

ప్రాథ‌మిక విచార‌ణ‌లో పైళ్ల ద‌గ్దం ప్ర‌మాద‌శాత్తూ జ‌ర‌గ‌లేద‌ని, ఎవ‌రో కావాల‌నే నిప్పు పెట్టార‌ని తేలింది.   ఆ ఫైళ్ల‌కు నిప్పుపెట్టి కాలిపోయేలా చేసింది పెద్దిరెడ్డి అనుచ‌రులే అని అప్ప‌ట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి.  దీనిపై ఆ కేసు దర్యాప్తులో భాగంగా ఫైళ్ల దగ్ధం వెనుక కుట్ర ఉందన్నది వెల్లడైంది. దీంతో ఈ కేసు దర్యాప్తునకు ప్రభు త్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ను ఏర్పాటు చేసింది.   ఇప్పుడు ఆ కేసులోనే పెద్దరెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి అరెస్టయ్యారు. దీంతో తరువాతి వంతు పెద్దిరెడ్డిదేనా అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.