'రుద్రమదేవి' బంగారం కొట్టేశారు
Publish Date:Jul 20, 2014
Advertisement
రాణీ రుద్రమదేవి సినిమా కోసం అనుష్క ధరించవలసిన నగలు మాయమయ్యాయి.గుణశేఖర్ తానే దర్శకుడిగా, తానే నిర్మాతగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోన్న ‘రుద్రమదేవి’ సినిమా కోసం నిజమైన బంగారు ఆభరణాల్ని అనుష్కకి అలంకరిస్తున్నారు. ఈ విషయాన్ని గతంలోనే గుణశేఖర్ వెల్లడిరచాడు కూడా. ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుండగా భోజన విరామ సమయంలో బంగారు ఆభరణాల్ని ఎవరో కొట్టేశారన్న వార్త అందరిని షాక్ కి గురి చేసింది. గుణశేఖర్ వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో నగలు పోయిన విషయమై ఫిర్యాదు చేశారు.పోలీసులు దీనిమీద దర్యాప్తు జరుపుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/gold-stolen-from-rudramadevi-sets-32-36162.html
http://www.teluguone.com/news/content/gold-stolen-from-rudramadevi-sets-32-36162.html





