నడుముకి రూ.3.36 కోట్ల బంగారు బెల్ట్! కస్టమ్స్ అధికారులకు చిక్కిన స్మగ్లర్లు

Publish Date:Jun 26, 2026

Advertisement

విమానాశ్రయాల్లో కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి బంగారం తరలించేందుకు స్మగ్లర్లు రోజురోజుకూ కొత్త కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. అయితే స్మగ్లర్ల ఎత్తుగడలను    కస్టమ్స్ అధికారులు చిత్తు చేస్తున్నారు.  తాజాగా హైదరాబాద్ శంషాబాద్ లోని    రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో   ఇద్దరు ప్రయాణికులు ఏకంగా తమ నడుము చుట్టూ రూ.3.36 కోట్ల విలువైన బంగారం దాచుకుని కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పాలని చేసిన ప్రయత్నం విఫలమైంది. 

కౌలాలంపూర్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఈ ఇద్దరు  ప్రయాణికులపై కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్   అధికారులకు ముందుగానే సమాచారం అందింది. అడ్వాన్స్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ , డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన  సమాచారంతో విమానం దిగిన క్షణం నుంచే వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు.

ముందుగా వారి లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించకపో వడంతో ఇద్దరూ ఏమీ జరగనట్లు హుందాగా బయటకు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో వారి హావభావాలు, నడవడిక అధికారులకు అనుమానం కలిగించాయి. వెంటనే వారిని పక్కకు తీసుకెళ్ళి తమదైన విచారించగా  అసలు కథ బయటపడింది. వారు ధరించిన ప్యాంట్ల నడుము భాగంలో ప్రత్యేకంగా కుట్టిన రహస్య పాకెట్లలో తెల్లటి సెలోపేన్ టేపుతో చుట్టిన బంగారం పేస్ట్‌ను బెల్ట్ మాదిరిగా అమర్చినట్లు అధికారులు గుర్తించారు.  స్వర్ణకారుడి సహాయంతో బంగారం పేస్ట్‌ను వెలికితీసి పరీక్షించగా, అది స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారమని తేలింది.

ఈ ఘటనలో మొత్తం 2.271 కిలోల బంగారం స్వాధీనం చేసుకోగా, దాని విలువ సుమారు రూ.3.36 కోట్లుగా అధికారులు అంచనా వేశారు. ఆ ఇద్దరు ప్రయాణికులను అరెస్ట్ చేసి, ఈ స్మగ్లింగ్ వెనుక ఉన్న ముఠా, బంగారం ఎవరికి చేరాల్సి ఉంది, దీనికి సూత్రధారులు ఎవరు అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.  

By
en-us Political News

  
ఖనిజాల నిధిగా పిలిచే మన నేల పొట్టలో అపారమైన ప్రాకృతిక సంపద దాగి ఉంది.
హైడ్రా కమిషనర్ నియామకానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.
దేశంలో కరెన్సీ వ్యవస్థను మరింత ఆధునికీకరించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భార్య ప్రాణాలు పోతుంటే వీడియో కాల్‌లో చూపించిన కసాయి భర్త..!
తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లు కేటాయించాలని వినతి..!
జింబాబ్వేపై 3-0తో సాధించిన క్లీన్ స్వీప్ భారత క్రికెట్ అభిమానుల్లో కొత్త జోష్ నింపింది. అశోక్ శర్మ, యశ్ ఠాకూర్ లాంటి డెబ్యూటెంట్లలో కాన్ఫిడెన్స్ నింపి, వారి నుంచి అద్భుత ప్రదర్శన రాబట్టిన వెరీ వెరీ స్పెషల్ వీవీవీఎస్ లక్ష్మణ్ ప్రశాంతత, విజన్ క్రికెట్ అభిమానుల మనస్సులను హత్తుకుంది.
ఆధార్ కోసం తిరిగి తిరిగి ఆలసి.. కలెక్టరేట్‌లో ఆత్మహత్యాయత్నం..!
కిరాణా దుకాణం నడుపుతూ బయటకు సాధారణ వ్యాపారిలా కనిపించిన ఇద్దరు వ్యక్తులు
అమెరికా కలలతో సుదూర తీరాలకు వెళ్లిన ఒక కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
నేడు పోలీసుల ఎదుట విచారణకు హాజరుకానున్న ట్రైనీ ఐపీఎస్..!
ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే.. ఫేస్‌బుక్ పోస్ట్ వేదిక నుంచి ఆ వీడియో అదృశ్యమైంది. కంటెంట్ నిబంధనలను ఉల్లంఘించిందనో లేదా చట్టపరమైన అభ్యంతరంఉందనో ఉందనో చూపే సందేశం ఆ వీడియో క్లిక్ చేస్తే రావడం వినియోగదారులను విస్మయానికి గురి చేసింది.
కృష్ణా నది ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి పెరిగి ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. జూరాల ప్రాజెక్టుకు 32వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది.
ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ వై. లక్ష్మణరావు నేతృత్వంలోని న్యాయస్థానం విచారణ జరిపి.. తమ్మినేని కుమారుడిపై నమోదైన అభియోగాలు తీవ్రమైనవని పేర్కొంటూ ముందస్తు బెయిలు నిరాకరించింది. కాగా ఇదే కేసులో నిందితులుగా ఉన్న తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణిశ్రీ లకు మాత్రం ముందస్తు బెయిల్ మంజూరుర చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.