త‌ల్లీ గోదారీ.. శాంతించ‌వ‌మ్మా

Publish Date:Jul 14, 2022

Advertisement

ప్ర‌కృతి ప్ర‌కోపించింది,  గోదావరి కన్నెర్ర చేసింది.  వేదంలా కాకుండా ఉగ్రంగా ప్రవహిస్తూ జనాలను బయపెడుతోంది. తల్లి గోదావరి ఉగ్రగోదావరిగా మారింది. గోదావరికి వరద రావడం సహజమే అయినా.. వందేళ్లలో ఈ స్థాయిలో వరద రాలేదనీ, అదీ జులై నెలలో ఈ స్థాయి వరద ఎన్నడూ లేదనీ, ఇది   ఊహించ‌ని విప‌త్తనీ అధికారులే కాదు.. గోదావరి తీరాన నివసించే జనమూ అంటున్నారు.   రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అన్ని నీటి ప్రాజెక్టులు నిండు కుండల్లా ఉన్నియి. ముఖ్యంగా తెలంగాణాలోని క‌డెం ప్రాజెక్టులోకి వ‌ర‌ద ఉధృతి   భ‌యోత్పాతం క‌ల్పించింది. అనేక గ్రామాలు ముంపున‌కు గురయ్యాయి. ప్రాజెక్టు డ్యామేజ్ అయి ఊళ్లకు ఊళ్లు కొట్టుకుపోతాయన్న ఆందోళన అధికారుల్లోనే కాదు స్థానికుల్లోనూ వ్యక్తమైంది. అయితే అదృష్ట‌వ‌శాత్తూ గురు వారం ఉద‌యానికి ఉధృతి    త‌గ్గుముఖం ప‌ట్టింది. 

ప్రమాదకర స్థాయికి చేరిన కడెం ప్రాజెక్ట్ లోకి వరద ఉధృతి ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 3 లక్షల క్యూసెక్కులు కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా  ప్రస్తుత నీటి మట్టం 692 అడుగులకు చేరింది. లెఫ్ట్ కెనాల్‌కు గండి పడటంతో ప్రాజెక్టు కు ముప్పు తప్పింది. అయినప్పటికీ హైటెన్షన్ కొనసాగుతోంది.  భద్రాచలం వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. ఉదయం 9 గంటలకు నీటి మట్టం 59.40 అడుగులకు చేరింది. 17,58,166 క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చి చేరింది.

మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మరో వైపు పెద్దపల్లి జిల్లాలోనూ గోదా వరి వంతెన పై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. మంచిర్యాల వెళ్లే వాహనాలను పోలీసులు గోదావరిఖని బస్టాండ్ వద్ద నిలిపి వేశారు. తెలంగాణ-మహ రాష్ట్ర మధ్య రవాణా నిలిచిపోయింది.  లక్ష్మీ(మేడిగడ్డ)బ్యారేజీలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో బ్యారేజీ మొత్తం 85 గేట్లు ఎత్తి నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 22,15,760 క్యూసెక్కులకు చేరుకుంది. సరస్వతి(అన్నారం) బ్యారేజీలోని మొత్తం 66 గేట్లు ఎత్తి నీటిని దిగు వకు విడుదల చేయనున్నారు.

ఇన్ ఫ్లో,ఔట్ ఫ్లో 14,77,975 క్యూసెక్కులు. బ్యారేజీ పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి మట్టం 8.38 టీఎంసీలకు చేరుకుంది. నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కు భారీ స్థాయిలో వరద పోటెత్తుతోంది. ఎగువ ప్రాంతాల నుండి ప్రాజెక్ట్‌లోకి  21760 క్యూసెక్కుల వరద నీటి ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు కాగ ప్రస్తుతం నీటి మట్టం 1397.82 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 17.802 టీఎం సీలు ఉండగా ప్రస్తుతం నీటి సామర్థ్యం 9.156 టీఎంసీలకు చేరుకుంది.

మూసీ ప్రాజెక్టు కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు ఆరు గేట్లు ఒక అడుగు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 3553.33 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 3553.33 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి సామర్థ్యం 645 అడుగులు కాగా ప్రస్తుత సామర్థ్యం 638.30 అడుగులకు చేరింది. అలాగే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలకు  ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 2.84 టీఎంసీ లుగా నమోదు అయ్యింది. శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 4,04,041 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు(90 టీఎంసీల)కు గాను ప్రస్తుత నీటి మట్టం 1087.40 అడుగుల(74.506 టీఎంసీలు)కు చేరింది. వరద ఉధృతి నేపథ్యంలో అధికారులు 36 గేట్ల ద్వారా 4,16,934 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

జూన్ మొదట నుండి ప్రాజెక్టు లోకి 107.831 టీఎంసీలు వరద చేరింది. మొత్తం ఔట్ ఫ్లో 53.391 టీఎంసీల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు.  ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో..ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వ‌ద్ద‌ వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 15.52 లక్షల క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. వదర ప్రవాహం నేపథ్యంలో సాయంత్రానికి మూడ వ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి విపత్తుల శాఖ స్పెషల్ సిఎస్ జి.సాయిప్రసాద్, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్  వరద పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. సహాయక చర్యల్లో 7 ఎన్డీఆర్ఎఫ్, 5 ఎస్డీఆర్ఎఫ్ లు  పాల్గొన్నా యి. అల్లూరి జిల్లాలో 4, అంబేద్కర్ కోనసీమలో 3,  ఏలూరులో 2, తూర్పుగోదావరి లో 1, పశ్చిమగోదావరి లో 2 బృందాలు సహా యక చర్యలు చేపట్టారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా  ఉండాలని జాగ్రత్తలు తీసు కోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్  డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ సూచనలు చేశారు.  తుంగభద్ర ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్ట్ 30 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. తుంగభద్ర ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 1,05,840 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్‌ఫ్లో 1,09,031 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. తుంగభద్ర పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులుగా కాగా, ప్రస్తుతం 1631 అడుగులుగా కొనసాగుతుంది.

By
en-us Political News

  
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.