జావో జగన్.. ఆవో బాబు..!

Publish Date:May 12, 2022

Advertisement

2024 ఎన్నికలు. ఏపీ ఎలా జరగబోతున్నాయి..? గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసిన జగన్ పార్టీ వైసీపీకి వచ్చే ఎన్నికల్లో ఏపీ జనాలు ఎలాంటి సీన్ చూపించబోతున్నారు..? జాతీయ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడేం చేయబోతున్నారు? కొన్ని మెట్లు దిగి అయినా పొత్తులతో మళ్లీ జయపతాకం ఎగరేస్తారా? గత ఎన్నికల్లో ఓటమి చవిచూసినా ప్రజా సమస్యలపై స్పందిస్తూ జనాల్లో ఉంటున్న పవన్ కళ్యాణ్ ఈసారి ఏం చేయబోతున్నారు..? ఏపీలో ఎప్పుడూ గుర్తింపు పొందని జాతీయ పార్టీ బీజేపీ మద్దతు ఎవరికి..?

ఏపీలో వైసీపీకి గానీ.. సీఎం జగన్ కి గాని 2019 నాటి క్రేజ్ ఇప్పుడు లేదనేందుకు అనేక అంశాలు, సంఘటనలూ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మూడేళ్లకుపైగా అధికారంలో ఉన్న జగన్ పాలనతో ఆయన సత్తా ఏంటో.. వైసీపీ రంగేంటో జనానికి బాగా తెలిసింది. జగన్ వల్ల అభివృద్ధి శూన్యమని.. ధరలు పెరిగిపోయని సామాన్యులు, మధ్యతరగతి జన జీవనం దుర్భరంగా మారినా పట్టించుకునే నాథుడే లేడనే విమర్శలున్నాయి. జగన్ అనుభవ రాహిత్యంతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుంది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనంత దుర్భరం అయింది. కొత్త ప్రాజెక్టులు రావు.. ఉన్న ప్రాజెక్టులు పూర్తి కావు.. ఏ పని ఎందుకు చేస్తున్నారో తెలియని అయోమయం.

జగన్ సీఎం అయినప్పటి నుంచీ ఏపీ రాజధానిపై గందరగోళం కొనసాగుతోంది. ఉన్న జిల్లాలతో పాలన సరిగా లేకపోయినా కొత్త జిల్లాలు ఏర్పాటు ఎందుకో అంటున్నారు. మంత్రివర్గ పునర్నిర్మాణం.. కొత్త కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు చూస్తే ‘అసలు తక్కువ.. హంగామా ఎక్కువ’ అన్నట్లు ఉందంటున్నారు. జగన్ ఇచ్చే ఉచితాలు లబ్ధిదారులకు కూడా వెగటు కలిగిస్తున్నాయట. జగన్ రెడ్డి సర్కార్ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర ఖజానాలో సొమ్ములు నిండుకున్నాయి. ధరల పెరుగుదల జనం నెత్తిన పిడుగులా మారింది. విద్యుత్ సంక్షోభం.. క్షీణించిన శాంతి భద్రతలు.. మహిళలకు రక్షణ లేకపోవడం.. ఫలితాలివ్వని సచివాలయ వ్యవస్థ.. చెత్త పన్ను.. ఎమ్మెల్యేలు.. వైసీపీ నేతల ఆగడాలు లాంటి ఎన్నో మైనస్ లతో.. పూర్ ట్రాక్ తో వైసీపీ ఎన్నికల్ని ఫేస్ చేయాల్సి ఉంది.

 అధికారంలోకి రాక ముందు ఓదార్పు యాత్రతో జనాల్లో తిరిగిన జగన్ దర్శనం సీఎం అయ్యాక కరవైపోయింది. కరోనా.. తుపాను లాంటి అత్యవసర సందర్భాల్లో కూడా జనానికి జగన్ అందుబాటులో ఉన్న సందర్భాలే లేవు. ఇలాంటి ధోరణుల వల్లే జనానికి- జగన్ కి మధ్య దూరం పెరిగిపోయిందనేది వాస్తవం. జగన్ ఏలుబడి పట్ల, వైసీపీ పాలన పట్ల జనానికి ముఖం మొత్తేసిందటున్నారు. మొన్నటికి మొన్న తిరుపతిలో జగన్ సభకు బలవంతంగా తీసుకువచ్చిన డ్వాక్రా మహిళలు సహా అనేక మంది సభా ప్రాంగణం ఫెన్సింగ్ దూకి మరీ పారిపోవడం లాంటి దృశ్యాలు ఇందుకు ఉదాహరణ.

2019 ఎన్నికల్లో అధికారం కోల్పోయినా మొక్కవోని ధైర్యంతో టీడీపీ అధినేత జనం మధ్యలోనే తిరుగుతున్నారు. వైసీపీ సర్కార్ తప్పుల్ని ఎత్తిచూపడంలో, సమస్య వచ్చినప్పుడు తానే రంగంలోకి దిగడం, పార్టీని నడిపిస్తున్న తీరు ఏపీలో మళ్లీ టీడీపీకి పూర్వపు వైభవం వచ్చే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అంటున్నారు. వయసు పైబడినా.. సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని రంగరించి చంద్రబాబు పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. ఏపీలో విద్యుత్ సమస్యలపై పోరాడినా.. ఆర్థిక సమస్యల గురించి మాట్లాడినా.. ప్రాజెక్టులపై గళమెత్తినా.. శాంతి భద్రతలు, మహిళలపై జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలపై స్పందించినా.. రహదారుల దుస్థితిపై నినదించినా.. ఆయన ఎక్స్ పీరియన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే చంద్రబాబు తాజాగా చేపట్టిన ‘బాదుడే బాదుడు’ కార్యక్రమానికి జనం నుంచి భారీ స్పందన వస్తోంది. వచ్చే ఎన్నికల్లో జనం ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారో స్పష్టం అవుతోందంటున్నారు విశ్లేషకులు.

పవన్ కళ్యాణ్ కు జనంలో విపరీతమైన క్రేజ్ ఉంది. పవన్ మాటలు జనాన్ని ఆకట్టుకుంటాయి. సమస్యలపై పోరాటాలూ చేస్తారు. ఇవి పవన్ కళ్యాణ్ ప్లస్ పాయింట్లు. 2019లో తనను జనం ఆమోదించకపోయినా వచ్చే ఎన్నికలకు షాట్ రెడీ చేసుకుంటున్నారు పవన్. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకూడదన్న పవన్ కళ్యాణ్ పిలుపు వచ్చే ఎన్నికల్లో కీలకం అంటున్నారు.

2024 ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా బరిలో దిగుతుందనుకున్నా పొత్తు కుదుర్చుకుంటే బీజేపీతో జగన్ వెళ్లే అవకాశం ఉందంటున్నారు. కానీ జగన్ తో చేతులు కలిపే సంకేతాలు బీజేపీ నుంచి లేవు. పవన్ మాటలతో టీడీపీ- జనసేన పొత్తుపై కొత్త ఆశలు కలుగుతున్నాయి. జనసేనతో ఇప్పటికే పొత్తున్న బీజేపీ రేపు చంద్రబాబుకు పవన్ దగ్గరైతే ఎలా స్పందిస్తుందో చూడాలి. అదే జరిగితే బాబుతో బీజేపీ మరోసారి దోస్తీకి సిద్ధపడినట్టే. అప్పుడు వైసీపీ అధినేతకు దబిడి దిబిడి తప్పదంటున్నారు విశ్లేషకులు.

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి.
వైకాపాకు చెందిన కొందరు రౌడీ మూకలు రక్తం పారిస్తాం, నరికేస్తాం అంటూ కెమెరాల ముందు ప్రగల్భాలు పలుకుతున్నారని, అలాంటి పిచ్చి చేష్టలు తమ వద్ద సాగవని పవన్ కళ్యాణ్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
లాకర్లలో సుమారు రెండున్నర కిలోల బంగారు ఆభరణాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. మరో లాకర్‌లో సుమారు రూ.1.50 కోట్ల నగదు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే నరహరి నివాసంలో నిర్వహించిన సోదాల్లో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ, ఇప్పుడు లాకర్ల నుంచి మరో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకోవడంతో మొత్తం నగదు రూ.3 కోట్లకు పైగా చేరింది.
కేంద్రకేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. దీనికి ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. అయితే దీనికి నిర్దిష్టమైన ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు.
జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ హడావిడి వెనుక సాయికృష్ణ కుటుంబంపై ప్రేమ ఎంతమాత్రం లేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ స్పష్టం చేశారు. జగన్ అసలు టార్గెట్ సీఐ నాగరాజు కాదనీ.. ఆయన ప్రధాన లక్ష్యం విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అని విశ్లేషించారు.
అధికార కూటమికి చెందిన నాయకులు, చివరికి హోం మంత్రి సైతం క్షేత్రస్థాయికి వెళ్లి బాధితులను పరామర్శించకపోవడం, సరైన క్లారిటీ ఇవ్వకపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చేలా ప్రవర్తిస్తున్న అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ బాస్ ను ఆదేశించారు.
ఒక బలమైన ప్రజాధారణ కలిగిన సరికొత్త వేదిక ఏర్పడితే ప్రజలు ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.
లకమైన రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రతిపక్షాల మద్దతుతో సంబంధం లేకుండా.. స్వతంత్రంగా ఆమోదింప చేసుకోవడమే ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు రహస్యం.
ఉభయ తెలుగు రాష్ట్రాలలో కలిపి ఇప్పటికే దాదాపు 20 లక్షల మందికి పైగా సభ్యులు జనసేనలో చేరారనీ.. ఈ బలంతో తెలంగాణ రాజకీయాల్లో తమ ఉనికిని గట్టిగా చాటుతామని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు, 2028లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీకి దిగుతుందని పవన్ ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఏపీ రాజకీయాలలో కాపు సామాజికవర్గం ఓటు బ్యాంకుకు ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగలిగే సత్తా ఉంది. అటువంటి కాపు సామాజికవర్గం విషయంలో జగన్ అనుసరిస్తున్న వ్యూహం మొదటికే మోసం తెచ్చేలా ఉందన్న ఆందోళన వైసీపీ వర్గాలలో వ్యక్తం అవుతున్నది.
శివసేన ఏక్ నాథ్ షిండే, శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. పార్టీ వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాకరే అసలైన వారసులం తామేనంటూ మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గం, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని యూబీటీ వర్గం పోటాపోటీగా భారీ బహిరంగ సభలను నిర్వహించడంతో ముంబైలో ఉద్రిక్తతలు పీక్స్ కు వెళ్లాయి.
విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత దిక్కుతోచని స్థితిలో ఉన్న వైసీపీకి సాయికృష్ణ అదృశ్యం ఘటనను అందివచ్చిన అవకాశంగా భావించి.. పొలిటికల్ మైలేజీ గెయిన్ చేయడానికి శతధా ప్రయత్నించింది. అయితే చంద్రబాబు తన చాణక్యంతో ఆ ప్రయత్నాలకు చెక్ పెట్టారు.
తెలంగాణ రాజకీయాల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం మరోసారి తీవ్ర ఉత్కంఠకు వేదికగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.