విశ్వ నగరం గోడు వినే వారేరీ?

Publish Date:Jul 21, 2023

Advertisement

వానొస్తే అందరికీ ఆనందమే కొంచెం ఎక్కువగా వాన కురిస్తే కొంత అసౌకర్యం  అయినా ఓకే, కానీ హైదరాబాద్  నగరవాసులకు వానంటే భయం. కొద్ది పాటి భారీ వర్షం అంటే వణుకు. అదే అతి భారీ వర్షం అంటే పై ప్రాణాలు పైనే పోతాయి. కోడి తన పిల్లలను రెక్కల చాటున దాచినట్లుగా పెద్దలు పిల్లలను ఇంటి నుంచి కదల నివ్వరు. ఆఫీసులకు వెళ్లే వారు , పనులపై వెళ్లే వారు , ప్రయాణాలు చేసే వాళ్లు తమ పనులు  వాయిదా వేసుకుంటారు.  ఇది విశ్వనగర జీవికి అలవాటైం పోయింది. లేకపోతే ఏ హోర్డింగో   పైన  పడుతుంది. లేదా తవ్వి వదిలేసిన కాలువలు మింగేస్తాయి. ఇక మూతలు లేని మ్యాన్ హోల్స్  ఎటూ ఉండనే ఉన్నాయి. అప్పుడెప్పుడో 115 యేళ్ల క్రింద మూసీ పొంగి వేల మంది చనిపోయారు. అడపాదడపా అలాంటివి వరదలు హైదరాబాద్ ను పలకరిస్తూనే ఉన్నాయి. 1908 వరదల అనుభవంతో నిజాం ప్రభుత్వం హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్లను నిర్మించి నగరానికి ముప్పును నివారించింది. 1908లో దాదాపు 15 వేల మందిని పొట్టన పెట్టుకున్న   మూసీ భారీ వరద చరిత్రలో నిలబడిపోయింది. 2000 సంవత్సరంలో వచ్చిన భారీ వర్షాలు  వందమంది ప్రాణాలు బలిగొంది. 30 వేలకు  పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. అప్పుడు జియోలాజికల్ సర్వే ఆప్ ఇండియా చేసిన ప్రతి పాదనలు కార్యరూపం దాల్చలేదు. దీని ఫలితంగా 2016,2020 లలో హైదరాబాద్ భారీ వరదలను ఎదుర్కోవల్సి వచ్చింది. 
తాజాగా కురిసిన భారీ వర్షాలు వరదలను సృష్టించకపోయినా నగర జీవితాలను అతలాకుతలం చేసిందనే చెప్పాలి. ఇందుకు కారణాలు అన్వేషిస్తే జీహెచ్ఎంసీ చేస్తున్న ప్రణాళికల్లేని కార్యక్రమాలు, సహజ నీటి మార్గాల మూసివేత, రియల్ ఎస్టేట్ వ్యాపారుల అత్యాశ, వీటికి తోడు నగర వాసుల బాధ్యతా రాహిత్యం కూడా కారణాలుగా కనిపిస్తాయి. దీనికి  కష్ట సమయాలలో  చేతులెత్తేసే నగర పోలీస్ విభాగం తోడవుతుంది. 
వందేళ్లకు ముందే నగరాన్ని రక్షించడానికి నిజాంలు రిజర్వాయర్లు కట్టారు. 1996లో చంద్ర బాబు 111 జీవోను  తెచ్చి రిజర్వాయర్లను  తద్వారా హైదరాబాద్ నగరాన్ని కాపాడే ప్రయత్నం చేశారు. తరువాతి ప్రభుత్వాలు జీవో నెంబర్ 111 అమలులో ఉన్న 84 గ్రామాల్లో పెద్ద ఎత్తున నిర్మాణాలకు అనుమతి నిచ్చి నగరాన్ని వరదల నగరంగా మార్చారు. ప్రస్తుత పరిణామాలకు గతంలో చేసిన తప్పులే  కారణమని చెప్పక తప్పదు. 
అయితే విశ్వ నగరాన్ని ప్రజల నగరంగా మార్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.  వర్షాలు రానప్పుడు  కూడా నగర జీవితం నరకమే అనేది నిత్య సత్యం. 
విశ్వ నగరం అని చెప్పుకుంటున్న హైదరాబాద్ లో  70శాతం రోడ్లు అన్యాక్రాంతమై ఉంటాయి. 100 అడుగుల రోడ్డు ఉన్నా ప్రజలు 30 అడుగులలోనే రాకపోకలు సాగించాల్సిన దుస్థితి ఉంటుంది. పబ్లిక్ రోడ్డును పార్కింగ్ స్థలాలుగా  వాడుకుంటున్న వాణిజ్య సముదాయాలు , రోడ్డుపై అనుమతులు లేకుండా  వెలుస్తున్న తిను బండారాల దుకాణాలు నగర జీవికి నరకమే చూపిస్తున్నాయి. చలానాలు  వేయడానికి లేదా  వసూలు చేయడానికి  ఆసక్తి చూపించే  నగర పోలీసు విభాగం ట్రాఫిక్ జాంలపై దృష్టి సారించలేవు. నగరాన్ని వరదలు పదేళ్లకోసారి ముంచెత్తుతుంటే ట్రాఫిక్ సమస్య ప్రతి రోజూ ఆ పని  చేస్తూనే ఉంది.

By
en-us Political News

  
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో   నైతికత, విలువలు పలుచన అయిపోతున్నాయి.   ఏ పార్టీ నుంచి గెలిచామనే అంశంతో సంబంధం లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార కాంక్ష,  రాజకీయ లబ్ధికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు
గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఒకింత జోరు తగ్గించిన వంగవీటి రాధా.. ఉన్నట్టుండి జనసేనానిని తో భేటీ అవ్వడం, అదీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వేడి రగిలిన సమయంలో కలవడం వెనుక పక్కా వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సొంత మేనకోడలు నిశ్చితార్థానికి వైఎస్ జగన్ హాజరుకాకపోవడంపై రాజకీయవర్గాలలోనే కాదు.. సామాన్య జనంలో కూడా చర్చ జరుగుతోంది. గతంలో షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ నిశ్చితార్థానికి జగన్ దంపతులు హాజరైన సంగతిని పలువురు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు.
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.