దాగుడు మూతా దండా కోర్.. కుక్క వచ్చే పిల్లా భద్రం

Publish Date:Dec 25, 2022

Advertisement

దాగుడు మూతా ఆడండీ 
కళ్ళకు చేతులు తీసేశా
 ఇదిగో దొంగను వదిలేశా 
దొంగకు అందక రారండీ 
 తల్లిని వచ్చీ తాకండి
దాగుడుమూతా దండాకోర్
 పిల్లీ వచ్చే ఎలుకా భద్రం
హైడ్ అండ్ సీక్.. దాగుడు మూతలు పిల్లలకు చాలా ఇష్టమైన ఆట. రోజంతా ఆడుకుంటూ గడిపేయమన్నా వారికీ ఆట బోర్ కొట్టదు. అయితే అంత కు మించిన కిక్ ఓ చిన్నారికి ఈ ఆటలో దొరుకుతోంది.

పూర్వ కాలంలో పిల్లలంతా కలిసి ఈ ఆట ఆడుకునే వారు. ఇంటి ఆవరణలో ఖాళీ స్థలం,  పాఠశాల ప్రాంగణంలో విశాలమైన మైదానాలూ ఉండే రోజుల్లో పిల్లలకు ఆటపాటలతో ఆనందంగా గడపడానికి బోలెడంత సమయం ఉండేది. ఆట పాటలతో చదువు సాగేది. ఇప్పుడు సింగిల్ చైల్డ్ ఫ్యామిలీలు, పాఠశాలల్లో తరగతి గదులు తప్ప మైదానమే కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో పిల్లలకు ఆటపాటలన్నవి ఎండమావుల్లాగే మిగిలిపోయిన పరిస్థితి.

దీంతో పెంపుడు జంతువులే వారికి ఇంట్లో నేస్తాలయ్యాయి. అలా ఓ అమ్మాయి తన పెంపుడు కుక్కకు తనకు ఇష్టమైన ఆట నేర్పి దాంతోనే ఆనందంగా ఆడుకుంటున్న వీడియో ఒకటి తాజాగా నెట్టింట తెగ వైరల్ అయ్యింది. పెంపుడు కుక్కలు, పిల్లులతో చిన్నారుల సరదాల వీడియోలు గతంలో చాలా వచ్చాయి.

అయితే ఈ వీడియోలో అమ్మాయి ఆట ఎలా ఆడాలో కుక్కకు నేర్పుతుంటే.. ఆ కుక్క శ్రద్ధగా విని ఆ తరువాత ఆ ఆమ్మాయితో సమానంగా ఆటలో నిమగ్నం అవ్వడం విపరీతంగా ఆకట్టుకుంటోంది. నెటిజన్లు ఆ ఆటను చూసి ఫిదా అయిపోతున్నారు. ఈ వీడియోకు తెగ లైకులు, షేర్లు వస్తున్నాయి. 

By
en-us Political News

  
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఒక షాకింగ్ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
దీపావళి పండుగ వేళ ఛత్తీస్‌గఢ్‌లో అత్యంత హృదయ విదారకరమైన ఘటన చోటుచేసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారింది.
ఇటీకాల కాలంలో టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులతో పాటు ఉద్యోగుల పని వాతావరణంలోనూ విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
పండుగ వేళ నగరంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
తెలుగు రాష్ట్రాల ప్రజలను వాతావరణ శాఖ మరోసారి అప్రమత్తం చేసింది.
హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు కలకలం రేపుతున్నాయి
హైదరాబాద్‌లో దీపావళి వేడుకల వేళ అపశ్రుతి చోటుచేసుకుంది.
మహిళా సాధికారతే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రాజకీయాల్లో గెలుపు కోసం ప్రచారం, సభలు, సమావేశాలు.. ఇలా ఎన్నో వ్యూహాలు అవసరమని భావిస్తుంటారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది దీపావళి వేడుకలను అత్యంత ప్రత్యేమైన ప్రాంతంలో జరుపుకున్నారు.
రెక్కల కష్టంతో బతుకులు.. రోడ్డు ప్రమాదంతో ఆవిరైన ప్రాణాలు.!
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.