మోడీ యురోపియ‌న్ మెలోడీస్

Publish Date:May 22, 2026

Advertisement

 

మోడీ యూర‌ప్ టూర్ వింత‌లూ విశేషాలు వివాదాలు విచిత్రాలు ఎలాంటివి? ఆయ‌న ఈ టూర్ లో ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నారు?  లేడీ జ‌ర్న‌లిస్టు వ్య‌వ‌హారం ద‌గ్గ‌ర  నుంచి మెలోనీ మెలోడీ, టాఫీ డిప్ల‌మ‌సీ వంటి వివ‌రాలేంటి?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఐదు దేశాలైన యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ.. దేశాల‌తో కూడిన‌ యూరప్ పర్యటన అంతర్జాతీయంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. ఈ పర్యటనలో ఎన్నో కీలక ఒప్పందాలు, వీటితో పాటు కొన్ని వివాదాలు, మరికొన్ని విచిత్రమైన వ్య‌వ‌హారాలు, నెటిజన్లను ఆకట్టుకున్న వింత‌లూ విశేషాలు చోటుచేసుకున్నాయి.  

మెలోనీ-మెలోడీ, టాఫీ డిప్లమసీ. ఈ టూర్ మొత్తంలో సోషల్ మీడియాను షేక్ చేసిన అతిపెద్ద విశేషం ఇది. మెలోడి క్రేజ్: గతంలో జీ-20, ఇతర సదస్సుల్లో మోడీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీల కలయికను నెటిజన్లు  మెలోడి అంటూ మీమ్స్, రీల్స్‌తో వైరల్ చేసిన సంగతి తెలిసిందే.

టాఫీ డిప్లమసీ విష‌యానికి వ‌స్తే.. ఈసారి రోమ్‌లో మెలోనిని కలిసిన ప్రధాని మోడీ, ఆమెకు భారతదేశానికి చెందిన ప్రసిద్ధ  పార్లే మెలోడీ టాఫీ ప్యాకెట్‌ను బహుమతిగా ఇచ్చారు.

మెలోని ఆ చాక్లెట్ ప్యాకెట్‌ను చూపిస్తూ,  పీఎం మోడీ మాకోసం చాలా చాలా మంచి టాఫీ తీసుకొచ్చారు.. అదే మెలోడీ  అంటూ నవ్వుతూ ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వేదికల్లో వీడియో పెట్టారు.

ఈ వీడియో ఎంత వైరల్ అయిందంటే.. భారతదేశంలో బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటి క్విక్ కామర్స్ యాప్స్‌లో  మెలోడీ  చాక్లెట్లు క్షణాల్లో అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయాయి. అంతేకాదు, సంబంధం లేని  పార్లే ఇండస్ట్రీస్  అనే లిస్టెడ్ కంపెనీ షేర్లు కూడా స్టాక్ మార్కెట్లో అప్పర్ సర్క్యూట్ తాకడం ఒక విచిత్రం!

ఇక‌పోతే లేడీ జర్నలిస్టు వ్యవహారం. ఈ పర్యటనలో కొన్ని వివాదాలు కూడా చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా నార్వే పర్యటనలో మీడియా వ్యవహారం చర్చనీయాంశమైంది.  నార్వే పర్యటనలో ప్రెస్ మీట్ సందర్భంగా అక్కడి ఒక లేడీ జర్నలిస్టు.. భారతదేశంలో మైనారిటీల హక్కులు, ప్రెస్ ఫ్రీడమ్ మోడీ సాధారణంగా మీడియా ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ఎందుకు వెనుకాడుతుంటారు అనే అంశాలపై బహిరంగంగానే ప్రశ్నించారు.

దీనిపై భారత అధికారులు గట్టిగానే స్పందించారు. భారతదేశం ఎల్లప్పుడూ ప్రజాస్వామ్య విలువలను, మైనారిటీల హక్కులను కాపాడుతుందని, వేధింపులకు గురైన ఎందరో శరణార్థులకు ఆశ్రయం ఇచ్చిన చరిత్ర భారత్‌కు ఉందని సమాధానమిచ్చారు.

ఇదే సమయంలో నార్వేకు చెందిన ఒక మీడియా సంస్థ మోడీని ఉద్దేశించి వేసిన ఒక కార్టూన్/చిత్రం జాతి వివక్ష పూరితంగా ఉందంటూ సోషల్ మీడియాలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి.
 
ఈ టూర్ లో జరిగిన ప్రధాన ఒప్పందాలు ఎలాంటివో చూస్తే.. వినోదం, వివాదాలు పక్కన పెడితే.. వ్యూహాత్మకంగా ఈ పర్యటన చాలా విజయవంతమైందిగా చెప్పాల్సి ఉంటుంది. IMEC ప్రాజెక్ట్ ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్.: ఇటలీ, నెదర్లాండ్స్‌తో జరిగిన చర్చల్లో ఈ మెగా కారిడార్‌ను వేగవంతం చేయడంపై కీలక అడుగులు పడ్డాయి.

గ్రీన్ ట్రాన్సిషన్- క్లీన్ ఎనర్జీ: నార్వే, స్వీడన్ దేశాలతో కలిసి పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్,  పర్యావరణ పరిరక్షణ సాంకేతికతపై భారత్ ఒప్పందాలు చేసుకుంది. ఇటలీ, స్వీడన్ దేశాలతో డిఫెన్స్ ఇండస్ట్రియల్ పార్టనర్‌షిప్, మారిటైమ్ సెక్యూరిటీ అంటే, సముద్ర తీర రక్షణ. ఉమ్మడి సైనిక సాంకేతికత అభివృద్ధిపై చర్చలు జరిగాయి. స్వీడన్ పర్యటనలో ప్రధాని మోడీకి ఆ దేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారం సైతం లభించింది.

కార్ డిప్లమసీ, కొలోసియం వాక్ విష‌యానికి వ‌స్తే..  రోమ్ నగరంలో మోడీ, మెలోనిలు ఒకే కారులో ప్రయాణిస్తూ, అక్కడి వీధుల్లో మాట్లాడుకుంటూ వెళ్లడం-కార్ డిప్లమసీ. అలాగే రాత్రి వేళ చారిత్రాత్మక కొలోసియం కట్టడం దగ్గర కలిసి నడుస్తూ దిగిన ఫోటోలు అంతర్జాతీయంగా  సాఫ్ట్ పవర్ డిప్లమసీ కి సరికొత్త ఉదాహరణలుగా నిలిచాయి.

మొత్తంగా చూస్తే.. సీరియస్ బిజినెస్ ఒప్పందాలు, నార్వే జర్నలిస్టుల వివాదాలు, ఇత‌ర‌ సోషల్ మీడియాను ఊపేసిన  మెలోడీ టాఫీ  విశేషాలతో ప్రధాని మోడీ యూరప్ పర్యటన సరికొత్త రికార్డులను సృష్టించింది.

By
en-us Political News

  
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం పోస్టులు ఇప్పిస్తామంటూ ఉమ్మడి వరంగల్, హనుమకొండ జిల్లాల్లో రూ.లక్షల్లో వసూలు చేస్తున్న దళారీల దందా వెలుగులోకి వచ్చింది. యూనియన్ ముసుగులో జరుగుతున్న ఈ అక్రమాలపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజారెడ్డి విచారణ ప్రకటించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్‌లోని సరూర్ నగర్ సాగరిక ఇంటెగ్రేటెడ్ హైస్కూల్‌లో రాఖీలు, తిలకం తొలగింపు వివాదంపై బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి టీచర్‌ను హిజాబ్‌‌పై ప్రశ్నించడం సంచలనంగా మారింది. పోలీసులు కార్పొరేటర్‌పై సుమోటో కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్న కూతురిపై లైంగిక దాడికి యత్నించిన భర్త శ్రీనివాస్‌ను భార్య రమాదేవి గొడ్డలితో నరికి చంపింది. అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా సీఐఎస్ఎఫ్ క్యాంపులో హెడ్ కానిస్టేబుల్ ఏకే 47 రైఫిల్‌తో చేసిన విచక్షణారహిత కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి చెందారు. సేవా పవర్ ప్రాజెక్ట్ వద్ద జరిగిన ఈ దారుణ ఘటనపై సీఐఎస్ఎఫ్ డీజీ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
ఒడిశా తాల్చేర్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన దారుణ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్ మాధాపూర్‌లో స్పా సెంటర్ ముసుగులో నడుస్తున్న అక్రమ వ్యభిచార రాకెట్‌ను ఎస్‌ఓటీ పోలీసులు మట్టుబెట్టారు. నలుగురు యువతులను రక్షించి, రూ. 45 వేల నగదు, 8 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
యాదాద్రి భువనగిరి జిల్లా చల్లూరులో భూభారతి వెబ్‌సైట్ ద్వారా ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండానే 7.18 ఎకరాల భూమి వేరొకరి పేరు మీదకు మారిపోయింది. యజమానులకు తెలియకుండా జరిగిన ఈ భారీ భూ భాగోతం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఏపీ సచివాలయ ఉద్యోగాలు, డీఎస్సీ నియామకాలు మరియు మెడికల్ సీట్లలో నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్ల అక్రమాలపై విచారణ ముమ్మరమైంది. హైకోర్టు ఆదేశాలు, విజిలెన్స్ తనిఖీలు మరియు సాప్ చేపట్టిన స్కిల్ టెస్ట్ వివరాలు ఇక్కడ చూడండి.
150 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వందేమాతరం గేయానికి జాతీయ గీతంతో సమాన హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ తెచ్చింది. 3 నిమిషాల 10 సెకన్ల ఆలాపన, సుప్రీంకోర్టు విచారణ మరియు చట్టపరమైన నిబంధనల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్ రాయదుర్గంలో ఐటీ కంపెనీ మహిళా ఉద్యోగిపై ఫుడ్ వెండర్ షేక్ నబీ కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి లైంగిక దాడి చేశాడు. ప్రైవేట్ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ రూ. 43 లక్షలు నొక్కేసి మూడేళ్లు వేధించిన నిందితుడిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు.
విజయవాడ ఎన్‌టీపీఎస్ కాలువలో లభించిన మహిళ శరీర భాగాల మిస్టరీ వీడింది. చేతిపై ఉన్న ఈక టాటూ ఆధారంగా మృతురాలిని మంగళగిరికి చెందిన 29 ఏళ్ల కళ్యాణిగా గుర్తించిన పోలీసులు, విచారణలో మటన్ షాప్ షఫీ చేసిన కిరాతక హత్యను ఛేదించారు.
కన్యాకుమారి యూట్యూబర్ ఇంట్లో ఏకంగా 118 సవర్ల (944 గ్రాములు) బంగారం, భారీగా నగదు చోరీకి గురయ్యాయి. సోషల్ మీడియాలో రీల్స్ కోసం చూపించిన సంపదే దొంగలను ఆకర్షించిందా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.