ఘాట్కేసర్‌లో అర్థరాత్రి హైడ్రామా.. కార్లను వెంబడించిన పోకిరీలు!

Publish Date:Jun 29, 2026

Advertisement

 

ఘాట్కేసర్‌లో అర్థరాత్రి వేళ చోటుచేసుకున్న ఘటన స్థానికులను కలవరానికి గురిచేసింది. రోడ్డుపై వెళ్తున్న వాహనాలనే లక్ష్యంగా చేసుకుని కొందరు యువకులు బీభత్సం సృష్టించారు. బైక్‌లపై దూసుకొచ్చిన వారు కార్లను వెంబడిస్తూ, ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తూ వాహనదారులను భయభ్రాంతులకు గురిచేశారు. కొంతదూరం వరకు వెంటాడుతూ దాడికి కూడా యత్నించినట్లు సమాచారం.

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఓ కారు డ్యాష్‌క్యామ్‌లో రికార్డు కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వీడియోలో బైక్‌లపై వచ్చిన యువకులు కారు చుట్టూ తిరుగుతూ, దానిని అడ్డుకునేందుకు ప్రయత్నించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కారులో మహిళలు, చిన్నారులు ఉన్నారని తెలిసినా వెనక్కి తగ్గకుండా మరింత దూకుడుగా వ్యవహరిస్తూ హంగామా సృష్టించినట్లు బాధితులు తెలిపారు.

పోకిరీల తీరుతో కారులో ఉన్న చిన్నారులు భయంతో బిగ్గరగా ఏడవగా, మహిళలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పరిస్థితి విషమించడంతో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి అక్కడి నుంచి సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది.

ఈ భయానక అనుభవాన్ని వివరిస్తూ ఓ యువతి సోషల్ మీడియాలో వీడియోను పోస్టు చేసింది. రాత్రి వేళల్లో ప్రజల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ, డ్యాష్‌క్యామ్ దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది. రాత్రి వేళల్లో ఇలాంటి పోకిరీల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని నెటిజన్లు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు స్పందించి విచారణ చేపడతారా? బాధ్యులను గుర్తించి చట్టం ముందు నిలబెడతారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

By
en-us Political News

  
దేశవ్యాప్తంగా మహిళా క్రికెట్ ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఎమర్జింగ్ ఉమెన్స్ క్రికెట్‌ లీగ్ (EWCL) లోగో జూబ్లీహిల్స్‌లో ఘనంగా ఆవిష్కరించబడింది. ఆగస్టు 15 నుంచి 16 జట్లతో ప్రారంభం కానున్న ఈ లీగ్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఐపీఎల్ స్టార్, పంజాబ్ కింగ్స్ క్రికెటర్ శశాంక్ సింగ్ మరియు అతని రిటైర్డ్ ఐపీఎస్ తండ్రి శైలేష్ సింగ్‌లపై భోపాల్‌లో వంట మనిషిపై దాడి, బంధించిన ఆరోపణలపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
పవన్ కల్యాణ్ గత కొంత కాలంగా తీవ్రమైన భుజాల నొప్పితో బాధపడుతున్న సంగతి విదితమే. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలన్న ఉద్దేశంతో ఆయన అంబానీ ఆస్పత్రిలో చేరినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
2026 ఫిఫా వరల్డ్‌కప్‌ నాకౌట్‌లో పెను సంచలనం నమోదైంది. బలమైన జర్మనీ జట్టుకు పరాగ్వే పెనాల్టీ షూటౌట్‌లో 4 3 తేడాతో షాకిచ్చి లాస్ట్ 16కు దూసుకెళ్లింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) భారత ఫార్మా కంపెనీలు, కెమిస్ట్ అసోసియేషన్లపై దాఖలైన 14 ఏళ్ల నాటి యాంటీ కాంపిటీటివ్ కేసును కొట్టివేసింది. తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ వెలువరించిన ఈ కీలక తీర్పు పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI వల్ల డబ్బు ఆదా అవుతుందని అనుకుంటున్నారా అయితే ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోవాల్సిందే. మానవ ఉద్యోగుల కంటే ఏఐ నిర్వహణకే టెక్ కంపెనీలకు విపరీతమైన ఖర్చవుతోందని ఎన్విడియా ఎగ్జిక్యూటివ్ మరియు ఎంఐటీ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఢిల్లీ ప్రభుత్వ సరికొత్త ఈవీ పాలసీ 2026 పూర్తి వివరాలు. మొదటి 1000 ఎలక్ట్రిక్ ట్రక్కులకు 10 ఏళ్ల నో ఎంట్రీ మినహాయింపు, కార్లపై రోడ్డు టాక్స్ రద్దు మరియు భారీ సబ్సిడీల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
బిట్‌కాయిన్ ధర మళ్లీ 60,000 డాలర్ల దిగువకు పడిపోయింది. అమెరికా ఫెడ్ నిర్ణయాలు, అంతర్జాతీయ పరిణామాల మధ్య క్రిప్టో మార్కెట్ తదుపరి గమ్యం ఏంటి? నిపుణులు సూచిస్తున్న కీలక మద్దతు ధరల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
యూఏఈలో నివసిస్తున్న 35 లక్షల మంది భారతీయులకు అలర్ట్. జూలై 1, 2026 నుంచి భారత పాస్‌పోర్ట్, వీసా సేవలు మరియు కొత్త సెంటర్ల నిబంధనల్లో కీలక మార్పులు వచ్చాయి. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. 10 గ్రాముల పసిడి ధర రూ.1,41,000 మార్కు కంటే దిగువకు పడిపోగా, వెండి ధర కూడా క్షీణించింది. పూర్తి లేటెస్ట్ రేట్లు మరియు ఇన్వెస్టర్ల గైడ్ ఇక్కడ చూడండి.
భారతీయ స్టాక్ మార్కెట్లో లాభాల పండగ. సరికొత్త మైలురాయి 24,000 మార్కును దాటి దూసుకెళ్లిన నిఫ్టీ 50. దాదాపు 3 శాతం లాభాలతో సెన్సెక్స్‌ను నడిపిస్తున్న మారుతీ సుజుకీ షేర్లు. పూర్తి వివరాలు మరియు నేటి టాప్ స్టాక్స్ అప్‌డేట్ కోసం ఇప్పుడే చదవండి.
అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ క్షీణిస్తున్నా ఎన్‌ఆర్‌ఐలకు ఇండియాలోనే ఆకర్షణీయమైన డాలర్ రాబడులు లభిస్తాయని ప్రముఖ ఆర్థిక నిపుణుడు ఫిరోజ్ అజీజ్ స్పష్టం చేశారు. పూర్తి వివరాలు మరియు గణాంకాలు ఇక్కడ చూడండి.
ఏపీ ఈఏపీసెట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. మీ రిజిస్ట్రేషన్, హాల్ టికెట్ నంబర్లతో ర్యాంక్ కార్డును డౌన్‌లోడ్ చేసుకునే డైరెక్ట్ లింక్, క్వాలిఫైయింగ్ మార్కులు మరియు కౌన్సెలింగ్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.