అమరగాయకుడు
Publish Date:Dec 4, 2013
Advertisement
ఆయన స్వరం షడ్జమం, ఆ రాగం రిషభం,ఆ సుమధుర గానం.. గాంధారం, ఆ గాన మాధుర్యం మధ్యమం, ఆయన పాట పంచమం, ఆయన కంఠం పలికించే ధ్వని దైవతం, ఆయన స్వరంలో ప్రతిఫలించే నాదం నిషాదం, ఇలా సప్తస్వరాలను తన గాన మాధుర్యంలో కట్టిపడేసిన అమరగాయకుడు ఘంటసాల.. ఆయన పాడని పాట లేదు.. ఆయన పాడలేని పాటా లేదు.. అందుకే ఆయన తెలుగుతెరను ఏళిన గాయకుడు, తెలుగు సంగీతానికి దిశా నిర్ధేశం చేసిన అమరుడు. భక్తి గీతమైన విరహగీతమైన, అల్లరి పాటైనా, ఆర్థతతో పాడే పాట అయిన ఆయన గొంతులో ఆ భావం ప్రస్పుటంగా కనిపిస్తుంది. అందుకే ఆయన తెలుగు సినిమా సంగీత ప్రపంచంలో మరే గాయకుడు అందుకోలేని అత్యున్నత శిఖరాలను అధిరోహించాడు.
ఘంటసాలగా ప్రఖ్యాతి గాంచిన ఘంటసాల వెంకటేశ్వరరావు 1922 డిసెంబర్ 4న గుడివాడ సమీపంలోని చౌటుపల్లి గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి మృదంగం వాయిస్తూ భజనలు చేసేవారు. అలా తండ్రి నుంచి సంక్రమించిన సంగీత జ్ఞానానికి ఆయన మరింత పదును పెట్టారు. తండ్రి మరణిస్తూ తనను గొప్ప సంగీత విధ్వాంసుడు కావాలని కోరటంతో అదే తన జీవిత ఆశయంగా ఆయన సంగీత సాగరానికి మధించి అమృతగానం పలికించారు.
1944లొ తన మేనకొడలైన సావిత్రిని వివాహం చేసుకున్నారు ఘంటసాల.. ఆమెరాకతొనే ఘంటసాల జీవితంలోకి అదృష్టం కూడా కలిసి వచ్చింది. తన పెళ్లిలో తానే కచేరి చేసి అందరిని ఆశ్చర్యపరిచిన ఘంటసాల ఆ పెళ్లి వచ్చిన సముద్రాల రాఘవాచార్యుల దృష్టిలో పడ్డారు. అదే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. సముద్రాల ప్రొత్సాహంతో సినీగాయకునిగా మారారు ఘంటసాల.
తరువాత ఎన్నో సినిమాల్లో పాటలు పాడారు ఘంటసాల, కాని ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు లేదు. కానీ తెలుగు పాటకు మకుటంలా భాసిల్లాల్సిన ఆయనన్ను కాలం అలా ఆగిపోనివ్వలేదు. 1955లో పాతాలభైరవి సినిమా విడుదలైంది. ఈ ఒక్క సినిమాతోనే ఘంటసాల పేరు ఆంద్ర దేశమంతా మారు మ్రోగిపోయింది. తరువాత వరుసగా మల్లీశ్వరీ, దేవదాసు, మాయాబజార్, శ్రీవెంకటేశ్వర మహత్యం లాంటి సినిమాతో ఆయన కీర్తి హిమశిఖరాలను తాకింది.
అప్పటి నుంచి దాదాపు 30 ఏళ్ల పాటు వెండితెర మీద ఘంటసాల శకం నడిచింది. భక్తి రస చిత్రమయినా, యాక్షన్ సినిమా అయినా, ఫ్యామిలీ డ్రామా అయినా ఎలాంటి సినిమా అయినా గాయకుడు మాత్రం ఘంటసాలే.. అలా తెలుగు పాటకు పర్యాయపదంగా మారారు ఘంటసాల.
అయితే 1969లో మాత్రం ఆ గాత్రం అలసిపోయింది. అప్పటి నుంచి ఆయన తరుచూ అనారోగ్యానికి గురవుతుండటంతో పాటలు పాడటం తగ్గించారు. అదే సమయంలో విదేశాల్లో ప్రదర్శనలు కూడా ఇవ్వడంతో శారీరకంగా చాలా అలసిపోయారు. అంత అలసి పోయాక కూడా ఆయన భగవద్గీత గానం చేసి తెలుగు జాతికి తరగని స్వర సంపవను అందించారు. కాని ఎంతటి పవిత్ర ప్రవాహమైనా ఎక్కడో ఒక చోట ఆగిపోవాల్సిందే. అందుకే వెండితెర అమృతదారలను సృష్టించిన ఘంటసాల స్వరప్రవాహం 1974 ఫిబ్రవరి 11న ఆగిపోయింది. ఎన్నాళ్లకు తరగని అపార గాన మాధుర్యాన్ని మనకందించి ఆయన మాత్రం తిరిగిరాని లోకాలకు తరలిపోయారు.
తెలుగు జాతికి తెలుగు పాటు జాతీయ స్థాయిలో సమున్నత స్థానం కల్పించిన అమరగాయకుడు ఘంటసాల గారిని ఈ అక్షరనివాళిని అర్పిస్తుంది తెలుగువన్..
http://www.teluguone.com/news/content/ghantasala-32-28038.html
హాయిగా నవ్వుకునే టిట్ బిట్స్ వున్న ఫన్ బక్కెట్ కామెడీ పదమూడో ఎపిసోడ్‌ని ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయండి..
మొన్నీమధ్య విడుదలైన గోపీచంద్ ‘సౌఖ్యం’ సినిమా మీద మన సక్కుబాయి రివ్యూ ఏమిటో చూసేద్దామా?
డిసెంబర్ 27, 2015 నుంచి జనవరి 02, 2016 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకోవచ్చు.
ఈ రెండు నిమిషాల నిడివి వున్న ఫన్ బక్కెట్ పన్నెండో కాపీ చూడండి.. మీకు నచ్చి తీరుతుంది. మాదీ గ్యారంటీ..
2015 సంవత్సరంలో టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచిన సినిమాలు ఏవో ఈ వీడియోలో చూస్తే క్లియర్‌గా తెలుస్తుంది.
క్రీడాకారుల జీవిత కథలతో రూపొందించిన బాలీవుడ్ సినిమాలు ఘన విజయాలు సాధిస్తున్నాయి. ‘భాగ్ మిల్కా భాగ్’, ‘మేరీకోం’ సినిమాలు దీనికి ఉదాహరణలు. ఆ సినిమాల స్ఫూర్తితోనే అజారుద్దీన్, మహేంద్రసింగ్ ధోనీ జీవిత కథల ఆధారంగా కూడా సినిమాలు రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలో అందాల క్రీడాకారిణి
2015 సంవత్సరంలో టాలీవుడ్‌లో టాప్ 10 ఫ్లాపులుగా మిగిలిన కళాఖండాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి చాలు.. ఫుల్లుగా క్లారిటీ వచ్చేస్తుంది.
టాలీవుడ్‌లో ఒక్కో ఏడాది కొంతమంది హీరోయిన్లు ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటూ వుంటారు. ఎవరి అకౌంట్లో ఎక్కువ ఫ్లాపులు పడితే వాళ్ళని ఐరన్ లెగ్స్ అనడం టాలీవుడ్‌లో మామూలే. మరి 2015లో ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటున్న హీరోయిన్లు ఎవరో చూద్దామా...
సుధీర్‌బాబు హీరోగా నటించిన ‘భలే మంచి రోజు’ గురించి స్టార్ హీరో ప్రభాస్ ఏమంటున్నాడంటే...
ఈవారం అంటే... 20 డిసెంబర్, 2015 నుంచి 26 డిసెంబర్ 2015 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను క్లిక్ చేస్తే చాలు..
డిసెంబర్ 13వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు వివిధ రాశుల వారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో చూస్తే చాలు.
త్రిష అందంగా వుంటుంది.. ఇంకా చెప్పాలంటే సూపరుగా వుంటుంది. అయితే ఇప్పుడు త్రిషని అందరూ త్రిషా.. నువ్వు సూపరు అంటున్నారు. ఈ ప్రశంస ఆమె అందానికి సంబంధించినది కాదు.. ఆమె వ్యక్తిత్వానికి సంబంధించింది. అందాల నటిగా అందరి ప్రశంసలు అందుకోవడం మాత్రమే కాదు.. సమాజం పట్ల బాధ్యతగా కూడా వ్యవహరించే త్రిషను చాలామంది ఈ కోణంలో కూడా అభిమానిస్తూ వుంటారు. ఆమధ్య స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా వీధులను ఊడ్చి స్ఫూర్తినిచ్చిన త్రిష అడపాదడపా సమాజ సేవా కార్యక్రమాల్లో
దర్శకుడు రాంగోపాల్ వర్మ అందరినీ మెప్పించగల సినిమాలు తీయడంలో విఫలమవుతున్నా, నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను ఆకట్టుకోగలుగుతున్నారు. ఏ విషయంపైనైనా తనకు తోచినట్లు నిర్భయంగా చెప్పగలగడమే అతనికి చాలా పాపులారిటీ తెచ్చిపెట్టిందని చెప్పవచ్చును. అయితే ఆ పాపులారిటీ పెరుతున్న కొద్దీ అతను తన హద్దులను కూడా దాటిపోతున్నట్లు కనిపిస్తోంది. సహజ సిద్దమయిన కొన్ని సమాజ సూత్రాలను, నియమనిబంధనలను తనకు వర్తించవు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.





