ఆ పది నియోజకవర్గాల్లోనూ ఉప ఎన్నికలు.. కేసీఆర్

Publish Date:Aug 2, 2025

Advertisement

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారా? 2023 ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత దాదాపుగా రాజకీయాలకు దూరమైనట్లుగా కనిపించిన ఆయన ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అవుతున్నారా?  పార్టీని, పార్టీ శ్రేణులనూ స్థానిక ఎన్నికలకు సమాయత్తం చేయడానికి నడుం బిగించారా? అంటే తాజాగా ఆయన తన ఎర్రవెల్లి ఫాం హౌస్ నుంచి విడుదల చేసిన ప్రకటనను బట్టి చూస్తే ఔననే సమాధానమే వస్తున్నది.

శనివారం (ఆగస్టు 2) ఆయన ఆయన పార్టీ నేతలు, శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో ఆయన బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ గూటికి ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తథ్యమనీ, ఆయా నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు వస్తాయనీ పేర్కొన్నారు. ఇప్పటి నుంచీ ఆయా నియోజకవర్గాలలో ఉప ఎన్నికలకు సన్నద్ధం కావాలని పార్టీ నేతలూ, కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. అలాగే పార్టీ సంస్థాగతంలో బలోపేతం చేయాల్సిన అవసరం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. అయితే ముందుగా స్థానిక ఎన్నికలలో పార్టీని విజయం దిశగా నడిపించేందుకు సమాయత్తం కావాలనీ, అలాగే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ఉప ఎన్నికలకు సన్నద్ధం కావాలనీ, ఆ ఎన్నికలలో విజయం సాధించిన అనంతరం పార్టీ సంస్థాగత నిర్మాణం, బలోపేతంపై దృష్టిసారిద్దామన్నారు.

ఇక పోతే బనకచర్ల విషయంలో రేవంత్ వైఖరిని ప్రజలలో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. బనకచర్ల నిర్మింతి తీరుతామంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ లు చెబుతున్నా.. నోరుమెదపకుండా తెలంగాణ సీఎం మౌనం వహిస్తున్నారని విమర్శలు గుప్పించారు.   బనకచర్లపై రాజకీయ, న్యాయపరమైన పోరాటానికి బీఆర్ఎస్ సన్నద్ధం కావాలన్నారు.   

By
en-us Political News

  
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.