క్రికెట్‌ రాజ‌కీయాల్లో ఏదైనా జ‌ర‌గ‌చ్చు

Publish Date:Jul 20, 2022

Advertisement

సాగినంత‌కాలం తానే రాజ‌నుకుంటాడు.. సాగ‌క‌పోతే ఊర‌క చ‌తికిల ప‌డ‌తాడు..ఇదెక్క‌డో విన్న‌మాట‌లా ఉంది గ‌దా.. పోనీ భ‌గ‌వ‌ద్గీత‌లోదే అనుకుందాం.. కింగ్ కోహ్లీకి  ఇపుడు భ‌గ‌వ‌ద్గీత  విన‌డం అవ‌స‌ర‌మ‌ని అత‌ని వీరాభిమానులు అంటున్నారు. కానీ గ‌వాస్క‌ర్ వంటి  సీనియ‌ర్లు  అలా అన‌డం లేదు. ఒక్క ఇర‌వై నిమిషాలు స‌మ‌యం ఇస్తే.. కోహ్లీకి మ‌ళ్లీ సెంచ‌రీ కొట్టే స‌త్తాకి మార్గం బోధిస్తాన‌న్నాడు. 

కోహ్లీ.. క్రికెట్‌లో క్రికెట్ దేవుడు స‌చిన్ టెండూల్క‌ర్ త‌ర్వాత  క్రికెట్ అభిమానుల హృద‌యాల్లో నిలిచిన సూప‌ర్ డూప‌ర్ స్టార్‌. మామూలుగానే స‌చిన్‌తో ప్ర‌తీ క్రికెట్ స్టార్‌నీ పోల్చ‌డం దేశంలో ఆన‌వాయితీ.  కానీ ఆట తీరులో కాస్తంత‌యినా వ్య‌త్యాసం ఉంటుంద‌న్న‌ది గ్ర‌హించాలి. కానీ కోహ్లీ క్రీజులోకి రాగానే ప్రేక్ష‌కు డికి మ‌రో స‌చిన్ వ‌చ్చేడ‌నే  భావ‌న బ‌లంగా  నాటుకుపోయింది. అందువ‌ల్ల  కోహ్లీ త‌న‌కు తాను ఏమ‌ను కుంటాడ‌నేది వేరే సంగ‌తి ప్రేక్ష‌కులు, క్రికెట్ పిచ్చాళ్ల దృష్టిలో అత‌ను స‌చిన్ లానే ప‌రుగుల వ‌ర‌ద సృష్టించాల్సిందే. అది రూలు .. రూల్ ఈజ్ రూల్ ఫ‌ర్ ఆల్‌!!

కానీ, కాల‌క్ర‌మంలో అనేక సీరీస్‌లు ఆడిన త‌ర్వాత బ్యాటింగ్ ప‌దును కాస్తంత త‌గ్గుతుంద‌న్నది గ‌వాస్క‌ర్ కాలం నుంచి ఉన్న‌ది, గ‌మ‌నిస్తున్న‌దీను. దానికి గ‌వాస్క‌ర్ వంటివ‌రూ అంగీక‌రిస్తున్నారు.  ఫామ్ దెబ్బ‌తిన గానే హ‌ఠాత్తుగా సూప‌ర్ స్టార్, గాడ్‌.. అనే పీఠాన్నుంచి అమాంతం తోసేయాల్సిన అవ‌స‌రం అయితే లేదు. కానీ క్రికెట్ వీరాభిమానుల‌కు అదేం ప‌ట్ట‌దు. ప‌రుగుల వ‌ర‌ద సృష్టించ‌లేన‌పుడు గ‌వాస్క‌ర్ అయినా, స‌చిన్ అయినా.. ఇపుడు కోహ్లీ అయినా ఒక్క‌టే. త‌ప్ప‌దు వారి భావోద్వేగం అలాంటిది మ‌రి. 

కోహ్లీ 2019 న‌వంబ‌ర్ నుంచి ఒక్క అంత‌ర్జాతీయ సెంచ‌రీ చేయ‌లేదు. దానిక్కార‌ణం అత‌ను ఆఫ్‌స్టంప్ లైన్ తో ఇబ్బంది ప‌డుతున్నాడ‌ని స్ఫుర‌ద్రూపి అయిన గ‌వాస్క‌ర్ ఇట్టే ప‌ట్టేశాడు. ఎంత‌యినా బ్యాట‌ర్ సంగ‌తి మ‌రో బ్యాట‌ర్‌కే తెలుస్తుంది. గ‌వాస్క‌ర్ అంత‌ర్జాతీయ అనుభ‌వంతో పాటు అతి ప్ర‌మాద‌క‌ర బౌల‌ర్ల ను ఎదుర్కొన్న ధీరుడుగా  పేరు గ‌డించిన పొట్టివాడు, గ‌ట్టివాడు!  కోహ్లీ సెంచ‌రీ కాదు అర్ధ సెంచ‌రీ దాట డానికి నానా యిబ్బందీ ప‌డుతున్నాడ‌ని అనేకానేక వంక‌ర కామెంట్లు అత‌న్ని ఇబ్బంది పెడుతున్నాయి. ప్లేయ‌ర్ అన్న‌వాడికి ఎపుడో ఒక‌ప్పుడు ఇలాంటి లీన్ పాచ్ రావ‌డం చాలా స‌హ‌జం. దీనికి  కోహ్లీ  మ‌రీ గుమ్మ‌డి లా  బాధ‌ప‌డిపోన‌క్క‌ర్లేదు. కాస్తంత విశ్రాంతి తీసుకుంటే జూనియ‌ర్ ఎన్టీఆర్‌ లా విజృంభించే అవ‌కాశాలూ లేక‌పోలేద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

తాజాగా లెజండ‌రీ క్రికెట‌ర్ సునీల్ గ‌వాస్క‌ర్ కోహ్లీ వైపు మొగ్గుచూపి, అత‌గాడిది మ‌రీ దిగులుప‌డి పోయేంత ప‌రిస్థితేమీ కాద‌న్నాడు. చిన్న‌పాటి ఇబ్బందులు ఉన్నాయి, వాటిని అధిగ‌మించ‌డానికి తాను మందు వేస్తాన‌ని అన్నాడు. కామెంట్ల కంటే అత‌ని ఆటతీరులో వ‌చ్చిన చిన్న‌పాటి లోపాల్ని స‌రిది ద్దుకునేందుకు వీలు క‌ల్పించే మార్గాల్ని తోటి ప్లేయ‌ర్లు, సీనియ‌ర్లు క‌ల్పించాల‌ని గ‌వాస్క‌ర్ భావం కావ‌చ్చు. సాధార‌ణంగా బొంబాయి వాళ్ల‌నే నెత్తినెక్కించుకునే గ‌వాస్క‌ర్‌కు హ‌ఠాత్తుగా కోహ్లీ మీద అపార ప్రేమ‌, అభిమానం పొంగ డానికి కార‌ణం బొంబాయి కుర్రాడు శ‌ర్మ ఫామ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. 

క్రికెట్ రాజ‌కీయాలు బ‌య‌ట రాజ‌కీయాల‌కు ఆట్టే తేడా లేదు. కాబోతే బిసిసిఐ మేధావుల రాజ‌కీయాల ప్ర‌భావం త‌ర్వాత‌నే వెలుగులోకి వ‌స్తుంది. అప్ప‌టికి జ‌ర‌గాల్సిన అన్యాయం ప్లేయ‌ర్ల‌కు జ‌రుగుతుంది. ఇది పాతికేళ్లుగా సాగుతున్న‌దే. గంగూలీ, రాహుల్ ద్రావిడ్ వంటి వారికీ బొంబాయి మేధావుల రాజ‌కీయ సెగ త‌గిలింది. ఎవ‌రు అద్భుతంగా రాణిస్తున్నా, ఎవ‌రు స‌చిన్‌ను, శ‌ర్మ‌నో మించిపోతున్నా వెంట‌నే బొంబాయికి చెందిన కామెంటేట‌ర్లు, మాజీ ప్లేయ‌ర్లు త‌మ గూగ్లీల‌తో దాడి చేయ‌డం చాలా స‌హ‌జం. వారికి బొంబాయి, శివాజీ పార్కు ప్లేయ‌ర్ల కంటే లోకంలో మ‌రే ప్లేయ‌రూ అస‌లు ప్లేయ‌రే కాదు.  

ధోనీ విజృంభిస్తు న్న స‌మ‌యంలో ఈ గ‌వాస్క‌ర్లంతా నోరు మూసుకోవాల్సి వ‌చ్చింది. ధోనీ ఆట‌లో స్పీడు, ఆలోచ‌న‌ల అమ‌లు, విజ‌యాల‌ను బేరీజు వేసుకుంటే ఏ బొంబాయి ప్లేయ‌రూ అత‌ని ముందు దిగ‌తుడుపే కావ‌డంతో ఎవ్వ‌రూ అత‌న్ని కాద‌న‌లేక‌పోయారు. ధోనీ అంటే విజ‌యం అనే ప్ర‌శంస‌ల‌తో అత‌ని హ‌వా సాగ‌నిచ్చేరు.  ఇపుడు కోహ్లీ మీద  అంత తొంద‌ర‌గా ఏమీ అన‌లేని ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. అందుకే కేవ‌లం ఆట‌లో చిన్న‌పాటి పొర‌పాట్ల‌ను స‌ద్దితే స‌రిపోతుంది, అది నా వ‌ల్లే అవుతుంద‌ని గ‌వాస్క‌ర్ త‌న వ‌ద్ద‌కు పిలిచాడు. మ‌రి వెళ్లాలా, వ‌ద్దా అన్న‌ది కోహ్లీ ఆలోచించుకోవాలి. 

By
en-us Political News

  
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.