మహారాష్ట్ర రాయగఢ్ జిల్లాలో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. జనజీవనం పూర్తిగా స్తంభించిపోవడమే కాకుండా, ఇప్పుడు ప్రజల ప్రాణాలకు సరికొత్త ముప్పు వచ్చి పడింది. పణ్వేల్ తాలూకా పరిధిలోని హెచ్‌పీసీఎల్ పాతాళగంగా ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్ వరద నీటిలో మునిగిపోవడంతో అక్కడ ఉన్న సుమారు మూడు వేల గ్యాస్ సిలిండర్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఈ సిలిండర్లలో పూర్తిగా గ్యాస్ నింపిన వాటితో పాటు, ఖాళీ సిలిండర్లు కూడా ఉన్నాయి. ప్లాంట్ నుంచి కొట్టుకొచ్చిన ఈ వేలాది సిలిండర్లు ఇప్పుడు పాతాళగంగా నదిలోకి, దాని పరిసర ప్రాంతాల్లోకి భారీగా వచ్చి చేరుతుండటం తీవ్ర కలకలం రేపుతోంది.
నదిలో కానీ, లేదా నదీ తీర ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా ఎల్పీజీ సిలిండర్లు కొట్టుకొచ్చి కనిపిస్తే, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోవద్దని అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. వరద ఉధృతికి కొట్టుకొచ్చిన ఆ సిలిండర్లు లీక్ అయ్యే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. ఉత్సాహంతోనో లేక ఉచితంగా దొరికాయనో వాటిని ఇళ్లకు తీసుకెళ్లడం, వాటి రెగ్యులేటర్లను తెరిచేందుకు ప్రయత్నించడం లాంటివి చేస్తే పేలుళ్లు సంభవించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన మూడు వేల సిలిండర్లను సురక్షితంగా స్వాధీనం చేసుకునేందుకు విపత్తు నిర్వహణ బృందాలు, హెచ్‌పీసీఎల్ ప్రతినిధులు నదీ పరివాహక ప్రాంతాల్లో విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. నది పరిసర గ్రామాల ప్రజలు ఎవరైనా ఈ సిలిండర్లను గుర్తిస్తే, వాటికి దూరంగా ఉంటూ వెంటనే స్థానిక అధికారులకు సమాచారం అందించాలని అధికారులు ప్రజలను కోరుతున్నారు. వర్షాలు, వరదల ముప్పుతో పాటు ఇప్పుడు గ్యాస్ సిలిండర్ల ముప్పు కూడా తోడవడంతో రాయగఢ్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. వ్యవహరిస్తోంది.
maharashtra floods, raigad rain news, 3000 lpg cylinders washed away, patalganga river
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/gas-cylinders-washed-away-in-floodwaters-36-225466.html
జూలై 9 గురువారం నాడు దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ సహా ప్రముఖ నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ పసిడి తాజా రేట్లను ఇక్కడ తెలుసుకోండి.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సరికొత్త EPS Scheme 2026 తో ఉద్యోగుల పెన్షన్ విధానంలో భారీ మార్పులు జరిగాయి. కేవలం 20 రోజుల్లోనే క్లెయిమ్ సెటిల్‌మెంట్, ఆలస్యమైతే 12% పెనాల్టీ వడ్డీతో పాటు పాత స్కీమ్ EPS 1995 కు మరియు కొత్త విధానానికి గల ముఖ్యమైన తేడాలను ఈ స్టోరీలో పూర్తిగా తెలుసుకోండి.
కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ సుంకం Customs Duty మినహాయింపులను భారీగా విస్తరించడంతో డిక్సన్ టెక్, సిర్మా ఎస్జీఎస్, అంబర్ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు 6 శాతం వరకు పెరిగాయి. 2029 వరకు వర్తించే ఈ కొత్త రూల్స్ ఎలక్ట్రానిక్స్ రంగాన్ని ఎలా మార్చబోతున్నాయో ఇక్కడ చూడండి.
భారత ఆర్థిక రంగంలో చారిత్రక మైలురాయి తొలిసారిగా ఎఫ్‌ఐఐ FII ఆస్తులను అధిగమించి రూ. 76.41 లక్షల కోట్లకు చేరిన దేశీయ మ్యూచువల్ ఫండ్స్ ఆస్తులు. పూర్తి వివరాలు మరియు ఆసక్తికర గణాంకాలు ఇక్కడ చూడండి.
ఐసీఐసీఐ బ్యాంక్ షాపింగ్ ఫెస్టివల్ ఆఫర్లు ఈరోజు అర్ధరాత్రితో ముగియనున్నాయి. ఎలక్ట్రానిక్స్, ఈ-కామర్స్, ఫ్యాషన్ వస్తువులపై ₹7,500 వరకు డిస్కౌంట్ పొందే పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
న్యూజిలాండ్‌లో ఉన్నత చదువుల కోసం ఇమ్మిగ్రేషన్ శాఖ సరికొత్త పాత్‌వే స్టూడెంట్ వీసా (PSV) నిబంధనలను తెచ్చింది. ఒకే వీసాతో ఐదేళ్లలో 3 కోర్సులు చదివే ఈ కొత్త రూల్స్, అర్హతల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
టాటా గ్రూప్ ఐటీ దిగ్గజం టీసీఎస్ (TCS) నేడు తమ క్యూ1 ఫలితాలను విడుదల చేయనుంది. ఉద్యోగుల వేతనాల పెంపు ప్రభావం మరియు రాబోయే డివిడెండ్, మార్కెట్ నిపుణుల అంచనాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
నిన్నటి భారీ పతనం తర్వాత భారత స్టాక్ మార్కెట్లు అదిరిపోయే రీతిలో కోలుకున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాల్లో పయనిస్తూ ఇన్వెస్టర్ల సంపదను పెంచాయి. మార్కెట్ జోరుకు గల 5 ముఖ్య కారణాలు మరియు రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.
ఫిఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్‌లో ఫ్రాన్స్‌తో తలపడనున్న మోరాకోకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా స్టార్ ప్లేయర్ ఇస్మాయిల్ సైబారీ మ్యాచ్‌కు దూరమయ్యాడు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఈ పత్రాలను నమ్మిన మెటాలాయిడ్ సంస్థ షేర్‌హోల్డర్స్ అగ్రిమెంట్, ప్రాజెక్ట్ గవర్నెన్స్ ఒప్పందాలు సహా పలు ప్రక్రియలను పూర్తి చేసింది. అయితే అనంతరం నిర్వహించిన డ్యూ డిలిజెన్స్‌లో సమర్పించిన బ్యాంకు పత్రాలు, గ్యారంటీలు, ఖాతా వివరాలు నకిలీవని తేలింది. దీంతో తాము మోసపోయినట్లు గుర్తించిన సంస్థ ప్రతినిధులు నేరుగా సంబంధిత బ్యాంకును సంప్రదించగా, పత్రాల్లో పేర్కొన్న వివరాలు తమ రికార్డుల్లో లేవని స్పష్టం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఫిఫా వరల్డ్‌కప్ 2026 క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ విడుదల. అర్జెంటీనా, ఫ్రాన్స్, స్పెయిన్, ఇంగ్లాండ్ జట్ల మ్యాచ్‌ల తేదీలు, సమయాలు మరియు పూర్తి వివరాలు తెలుగులో చూడండి.
భారత టెన్నిస్ దిగ్గజం, 18 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల విజేత లియాండర్ పేస్ ఆసియా టెన్నిస్ సమాఖ్య (ATF) ప్లేయర్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. వింబుల్డన్ వేదికగా జరిగిన ఈ చారిత్రాత్మక నిర్ణయం మరియు పేస్ సాధించిన రికార్డుల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
లోకేష్ షూఆల్స్, సోలమ్, అపాక్ట్, బూ యంగ్, హ్వాసుంగ్ వంటి దిగ్గజ కంపెనీలతో పాటు, శాంసంగ్ , ఎల్‌జీ వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాల ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణం, ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, మౌలిక వసతులను వారికి సమగ్రంగా వివరించి వారు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఉత్సుకత, ఆసక్తి చూపేలా చేయడంలో సఫలీకృతులయ్యారు.