ఇదేం చెత్త పన్ను కేసీఆర్?

Publish Date:Mar 23, 2021

Advertisement

అప్పట్లో తుగ్లక్ హయాంలో జుట్టు పన్ను ఉండేది. ఇప్పుడు కేసీఆర్ పాలనలో చెత్త పన్ను వసూలు చేస్తున్నారు. అవును, ఇదేమీ ఆరోపణ కాదు. పచ్చి నిజం. వరంగల్ కార్పొరేషన్‌లో జరుగుతోంది ఈ తతంగం. ఆస్తి పన్ను, నీటి పన్నుతో పాటు చెత్త రవాణా పన్ను కూడా జారీ చేస్తున్నారు. ప్లింత్ ఏరియా ఆధారంగా పన్ను విధిస్తున్నారు. ఎంత పెద్ద స్థలం ఉంటే.. అంత ఎక్కువ చెత్త పన్ను విధిస్తున్నారు. ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్నా.. కార్పొరేషన్ తీరుపై విమర్శలు వస్తున్నా.. అధికారుల తీరు ఏమాత్రం మారడం లేదు. 

చెత్త తరలింపునకు ఇప్పటి వరరకూ ఒక్కో ఇంటి నుంచి నెలకు 60 రూపాయలు వసూలు చేసేవారు. ఆదాయం పెంచుకోవాలనే ఆలోచనలో ఉన్న వరంగల్ కార్పొరేషన్ కొత్తగా చెత్త రవాణా పన్ను తీసుకొచ్చారు. ఆస్తిపన్నుతో పాటు చెత్త తరలింపు పన్ను వసూలు చేసేందుకు 4 నెలల క్రితం గ్రేటర్‌ కౌన్సిల్‌ సమావేశంలో తీర్మానించారు. బిల్డింగ్ ప్లింత్‌ ఏరియా ఆధారంగా చెత్త పన్ను మదింపు చేస్తున్నారు. పన్ను నోటీసుల్లో కొత్తగా గార్బేజ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ (జీటీ) పన్ను విధించారు. భవనం విస్తీర్ణాన్ని బట్టి చెత్త పన్ను 100 నుంచి 150 వరకూ ఉంటోంది. గతంలో 60 రూపాయలతో అయిపోయేది.. ఇప్పుడు ఏకంగా డబుల్ అయిందని నగరవాసులు మండిపడుతున్నారు.

2020-21 ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు- మార్చి నెల ఆస్తి పన్ను డిమాండ్‌ నోటీసులో చెత్త పన్ను కూడా కలిపి ఇచ్చారు. అయితే.. 42 విలీన గ్రామాలు, గ్రేటర్ పరిధిలోని 183 మురికివాడలకు చెత్త పన్ను నుంచి మినహాయింపు ఇచ్చారు. నివాసిత గృహాలు, వ్యాపార, వాణిజ్య భవనాలకు ప్లింత్‌ ఏరియా ఆధారంగా పన్ను మదింపు చేయడం ఇబ్బందిగా మారనుంది. రెసిడెన్షియల్‌ కేటగిరీలో 1200-1500 చదరపు అడుగుల ప్లింత్‌ ఏరియా ఉంటే చెత్త తరలింపు పన్ను రూ.120-150 అవుతోంది. వాణిజ్య భవనమైతే 1000-2000 చదరపు అడుగులుంటే నెలకు రూ.120-240 వరకు వస్తోంది. చెత్త పన్ను చెత్త చెత్తగా ఉందంటూ వరంగల్ నగర పౌరులు కార్పొరేషన్‌ తీరుపై కస్సుమంటున్నారు. 

By
en-us Political News

  
పేటీఎం బ్యాచ్, రూ.5 బ్యాచ్.. ఇవి గత కొన్నేళ్లుగా ఉన్నా, ఇప్పటికీ ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్న పదాల్లో కొన్ని. ఒక పార్టీకి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి, ట్రోల్స్ చేయడానికి డబ్బులు తీసుకునే వారిని, మరీ ముఖ్యంగా వైసిపి సోషల్ మీడియా వింగ్‌ను, టిడిపి, జనసేన శ్రేణులు పేటీఎం బ్యాచ్ అని పిలుస్తుంటారు. ప్రతి పోస్టుకు ఐదు రూపాయలు ఇస్తారనే ప్రచారంతో ఐదు రూపాయల బ్యాచ్ అని కూడా అంటారు.
సీఎం, మంత్రుల హెలికాప్టర్ పెద్దగుట్టపై ల్యాండ్ అయినప్పటికీ.. అక్కడ వారిని రిసీవ్ చేసుకోవడానికి కనీసం ఒక్క జిల్లా ఉన్నతాధికారి కూడా అందుబాటులో లేకపోవడం తీవ్ర కలకలం రేపింది. వేద పాఠశాల శంకుస్థాపన ప్రాంగణమైన పెద్ద గుట్టపై సీఎం హెలికాప్టర్ ల్యాండ్ అయినా, అధికారుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్, సమన్వయ రాహిత్యం కారణంగా ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు కలెక్టర్ గానీ, ఎస్పీ గానీ, ఇతర ప్రోటోకాల్ అధికారులు గానీ సమయానికి అక్కడకు చేరుకోలేకపోయారు.
రాయలసీమ అభివృద్ధిపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తీవ్రస్థాయిలో ఎండగట్టారు మంత్రి నారా లోకేష్. గత ఐదేళ్లలో సీమ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తూ జగన్ ఈ ప్రాంతానికి క్యాన్సర్ గడ్డలా మారారని విమర్శించారు.
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌పై ఆంధ్రప్రదేశ్‌లో కేసు నమోదైంది. టీవీ డిబేట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన ఫిర్యాదుతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
నెల్లూరు జిల్లాలో నిర్వహించనున్న 2026 మహానాడును స్త్రీ శక్తి థీమ్‌తో నిర్వహించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే, మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి వ్యతిరేకంగా సొంత పార్టీ సీనియర్ నేతలే కూటమి కట్టడం హాట్ టాపిక్‌గా మారింది.
గత కొంత కాలంగా ప్రదాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కసరత్తు చేస్తున్నారు. కేబినెట్ లో పనితీరు సరిగా లేని వారికి ఉద్వాసన పలికి, కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ప్రధాని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలే అంటున్నాయి. ఆ మేరకు ఇప్పటికే కసరత్తు పూర్తయ్యిందని కూడా చెబుతున్నారు.
కూటమిలో వైరుధ్యాలు లేవని, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లి విలువైన సమయం గడపడమే ఇందుకు నిదర్శనమని అప్పసాని రాజేష్ అన్నారు. ఒకరి కాళ్ళ దగ్గర మాటలను తాకట్టు పెట్టి, వారు విసిరే ఎంగిలి మెతుకుల కోసం కొందరు కిరాయి రాజకీయ విశ్లేషకులుగా మారారని నాగేశ్వర్ ఉద్దేశించి అప్పసాని రాజేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు.. పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేనకు దక్కే రాజ్యసభ సీటు ద్వారా నాగబాబును ఢిల్లీకి పంపించి, జాతీయ స్థాయిలో పార్టీ వాయిస్‌ను వినిపించేలా చేయాలన్న‌ ఆలోచనలో జ‌న‌సేన‌ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.
బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా  తన వ్యక్తిగత ప్రతిష్టను, సమాజంలో ఉన్న గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడారని మంత్రి భరత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.  
మళ్ళీ తేర మీదకి కర్ణాటక సీఎం కుర్చీ పంచాయతీ.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.