Publish Date:Apr 30, 2025
సాధారణంగా ఒకటి కంటే ఎక్కువ పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు చిన్న చిన్న పొరపొచ్చారు, విభేదాలు తలెత్తడం సాధారణమే. అటువంటి చిన్న ఇబ్బందే భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విశాఖ నార్త్ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు విష్ణు కుమార్ రాజు మధ్య తలెత్తింది. వారిరువురి మధ్యా తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్న సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఫిల్మ్ నగర్ లీజు అంశానికి సంబంధించి ఇరువురి మధ్యా వాగ్వాదం జరిగింది.
విషయమేంటంటే ఈ లీజు వ్యవహారంలో అవకతవకలు జరిగాయంటూ విష్ణుకుమార్ రాజు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఆ సందర్భంగా ఆయన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేరు కూడా ప్రస్తావించారు. దీనిపై గంటా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. లీజు విషయంలో అవకతవకలపై కలెక్టర్ కు ఫిర్యాదు చేయడానికి ముందు స్థానిక ఎమ్మెల్యేనైన తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదన్నది గంటా అభ్యంతరం. ఈ విషయంలో ఇరువురి మధ్యా జరిగిన వాగ్వాదం ముదిరి పాకాన పడుతుందని అంతా భావించారు. అయితే సకాలంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ జోక్యం చేసుకుని ఇరువురికీ సర్ది చెప్పడంతో ఈ వివాదం టీకప్పులో తుపానుగా తేలిపోయింది.
విశాఖలో జరిగిన ప్రజా ఫిర్యాదులపై ఏర్పడిన శాసనసభ కమిటీ సమావేశం సందర్భంగా రఘురామకృష్ణం రాజు ఇరువురు ఎమ్మెల్యేలనూ ఒక దగ్గర కూర్చోబెట్టి మధ్యవర్తిత్వం నెరిపారని తెలుస్తోంది. రఘురామకృష్ణం రాజు జోక్యంతో ఎమ్మెల్యేలు ఇద్దరూ కూడా విభేదాలను మరచి ఇరువురూ కలిసిపోయారని తెలుస్తోంది. సకాలంలో జోక్యం చేసుకుని వివాదం ముదరకుండా నిలువరించడంలో రఘురామకృష్ణం రాజు చోరవ పట్ల కూటమి పార్టీల్లో హర్షం వ్యక్తమౌతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ganta-25-197204.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.