Publish Date:Mar 29, 2025
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని గన్నవరం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. గన్నవరం కోర్టు శంశీని ఒక్కరోజు కస్టడీలోకి తీసుకోవడానికి అనుమతించడంతో విజయవాడ వచ్చిన గన్నవరం పోలీసులు విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని అదుపులోనికి తీసుకున్నారు. జైలు నుంచి ఆయనను కంకిపాడు పోలీసు స్టుషన్ కు తరలించారు. అంతకు ముందు జైలు నుంచి నేరుగా విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించారు.
వైద్యులిచ్చిన నివేదిక ఆధారంగా వంశీ ఆరోగ్యంగానే ఉన్నట్లు నిర్ధారించుకుని అక్కడ నుంచి కంకిపాడు పోలీసు స్టేషన్ కు తరలించారు. అక్కడ వంశీని విచారిస్తున్నారు. ఇంతకీ గన్నవరం పోలీసులు వంశీ కస్టడీని ఎందుకు కోరారంటే.. ఉమ్మడి జిల్లా అత్కూరు మండలంలో శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తికి అతని పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తిని కొందరు ఆక్రమించుకుని, అప్పటికి గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న వంశీ సహకారంతో వారి పేర కుట్రపూరితంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీనిపై బాధితుడు శ్రీధర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో ఈ కుట్రకు సూత్రధారి వంశీయేనని పేర్కొన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి వంశీని కోర్టు అనుమతి మేరకు ఒక రోజు కస్టడీలోకి తీసుకున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/gannavaram-police-take-vamshi-into-custody-25-195223.html
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.