రూ.2 కోట్ల విలువైన హ్యాష్ ఆయిల్‌ తరలిస్తున్న ముఠా అరెస్ట్

Publish Date:Apr 21, 2026

Advertisement

 

వరంగల్ నగరంలో డ్రగ్స్ అక్రమ రవాణాపై పోలీసులు గట్టి దెబ్బ కొట్టారు. రెండు కోట్లకు పైగా విలువ చేసే హాష్ ఆయిల్‌ను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేశారు. ఈ ఘటన నగరంలో సంచలనం సృష్టించింది. ఇటీవల స్మగ్లర్లు మాదకద్రవ్యాలను తరలించేందుకు బస్సులు, రైళ్లను ప్రధానంగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో పోలీసులు రైల్వే స్టేషన్ల వద్ద తనిఖీలు కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలోనే వరంగల్ రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న కొందరిని పోలీసులు గమనించారు. ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్ కంట్రోల్ టీమ్‌తో కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించారు.

తనిఖీల సమయంలో వారి బ్యాగుల్లో భారీగా హాష్ ఆయిల్ ఉండటాన్ని గుర్తించిన పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే చర్యలు తీసుకున్న అధికారులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి మొత్తం 40 కిలోల హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఈ మాదకద్రవ్యాల విలువ సుమారు రూ.2.5 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు.విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. ఈ హాష్ ఆయిల్‌ను చిన్న ప్యాకెట్లుగా విభజించి ముంబైలో విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు తెలిసింది. ఒడిశాకు చెందిన హంటల్ సన్ను (23), హంటల్ సన్యాసి (23), కండెల చిన్నబాబు (56), కృష్ణా హంటల్ (56)లను పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.

నిందితులు గంజాయి మొక్కల నుంచి హాష్ ఆయిల్ తయారు చేసి, తక్కువ పరిమాణంలో ఎక్కువ లాభాలు పొందేందుకు ఈ అక్రమ వ్యాపారానికి పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయి విక్రయాలతో పోలిస్తే హాష్ ఆయిల్ స్మగ్లింగ్ ఎక్కువ లాభదాయకంగా మారడంతో ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. ఈ సంఘటనతో అంతర్రాష్ట్ర డ్రగ్స్ నెట్‌వర్క్‌పై పోలీసులు మరింత నిఘా పెంచారు. డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వరంగల్‌లో జరిగిన ఈ ఆపరేషన్ డ్రగ్స్ ముఠాలకు గట్టి హెచ్చరికగా నిలిచింది.


 

By
en-us Political News

  
కేరళలోని త్రిస్సూర్‌లో మంగళవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ఓ మైనర్ బాలుడు తన స్నేహితుల మాదిరిగా రీల్స్ చేసి గుర్తింపు పొందాలని ఆశపడ్డాడు. కానీ అదే ఆలోచన చివరకు అతని ప్రాణాన్ని బలి తీసుకుంది.
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఒక మామిడి తోట ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వచ్చిందని కుటుంబం ఆనందంతో ఉప్పొంగింది. కానీ ఆ ఆనందం కేవలం కొన్ని నెలలకే పరిమితమైంది.
త్వరలోనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగనున్నాయన్న చర్చతో వినియోగదారుల్లో గుబులు రేగుతోంది.
హిమాలయ పర్వతాల మధ్య విరాజిల్లుతున్న పవిత్ర క్షేత్రం కేదార్‌నాథ్ ఆలయం రేపు ఉదయం 8 గంటలకు భక్తుల దర్శనార్థం తిరిగి తెరుచుకోనుంది.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇలాకలో కూటమి పార్టీల మధ్య అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి.
లెన్స్‌కార్ట్ ఉద్యోగుల మత విశ్వాసాలపై ఆంక్షలా... సీఈఓ తీరుపై పెరుగుతున్న విమర్శలు!
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు.
దేశ రాజకీయాల్లో దశాబ్దాలుగా నలుగుతున్న మహిళా రిజర్వేషన్ల అంశంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది.
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు వరుసగా చట్టపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య విభజన అంశం మరోసారి రాజకీయ వేడిని రాజేస్తోంది.
హైదరాబాద్‌లో ఈరోజు ఉదయం ఎక్సైజ్ దాడులు హాట్ టాపిక్‌గా మారాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.