ఏపీలో వరుస దారుణాలు? జగన్ రెడ్డి ప్రభుత్వానిదే పాపమా?
Publish Date:Sep 9, 2021
Advertisement
ఏపీలో వరుస దారుణాలు. రెండేళ్లలో వందలాది అరాచకాలు. ఆంధ్రప్రదేశ్‌కి ఏమైంది? మహిళలకు ఎందుకు రక్షణ లేకుండా పోతోంది? ఓ శాడిస్టు నడిరోడ్డుపైనే కత్తితో హతమారుస్తాడు. మరో దుర్మార్గుడు ఏకంగా పెట్రోల్ పోసి తగలబెట్టేస్తాడా? ఇద్దరు ఉన్మాదులు నదీ తీరంలో అఘా-యిత్యానికి తెగబడుతారు. తాజాగా, గుంటూరు జిల్లాలో అర్థరాత్రి బైక్‌పై వెళ్తున్న దంపతులను బెదిరించి.. వివాహితను పొలాల్లోకి లాక్కెళ్లి.. చెరబట్టారు. ఏమిటీ అమానుషం? ఎందుకీ ఉన్మాదం? అనూష.. రమ్య.. ఇలా ఎంతమంది యువతులు మానవ మృగాళ్లకి బలి కావాలి? ఒకప్పుడు ప్రశాంతంగా ఉండే రాష్ట్రం.. ఇప్పుడు ఎందుకిలా రాక్షస రాజ్యంగా మారింది? ఎవరిది తప్పిదం? ఎక్కడుంది లోపం? అంటే.. అన్ని వేళ్లూ జగన్‌రెడ్డి సర్కారు వైపే చూపిస్తున్నాయని అంటున్నారు. యువతిపై దారుణానికి ఒడిగడితే.. ఎన్కౌంటర్ పేరుతో కాల్చిపారేశారు తెలంగాణ పోలీసులు. ఆ ఘటనతో ఏపీలో దిశ చట్టం తీసుకొచ్చింది వైసీపీ సర్కారు. 21 రోజుల్లోనే నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తామంటూ ప్రగల్బాలు పలికింది. మూడు వారాల్లో శిక్ష కాదుకదా.. నెలలు గడుస్తున్నా తాడేపల్లి రే*ప్ కేసు ఇద్దరు నిందితుల్లో ఇంకొకడు ఇంకా పరారీలోనే ఉండటం జగన్ సర్కారు చేతగానితనానికి నిదర్శనమనే విమర్శలు ఉన్నాయి. రక్షణ భటులను రక్షణ కోసం కాకుండా.. టీడీపీపై కక్ష్య సాధింపు చర్యల్లో బిజీగా ఉంచడంతో ఖాకీలంతా అసలు పని వదిలేసి కొసరు పనులు ఎక్కువగా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులంటే భయంలేక పోవడం వల్లే.. ఏపీలో వరుస దారుణాలు జరుగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఖాకీల తీరు అడుగడుగునా వివాదాస్పదమవుతోంది. తాజా, గుంటూరు ఘటననే తీసుకుంటే.. గ్యాంగ్ రే*ప్ బాధితులు అర్ధరాత్రి సత్తెనపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా.. ఫిర్యాదు తీసుకునేందుకు అక్కడి పోలీసులు నిరాకరించారంటే ఇంతకంటే దారుణం ఇంకోటి ఉండదు. ఘటన జరిగిన ప్రదేశం గుంటూరు అర్బన్ పరిధిలోకి వస్తుందని.. తమ పోలీస్‌స్టేషన్ గుంటూరు రూరల్ పరిధిలో ఉంటుందని చెప్పి బాధితులను తిప్పిపంపించేయడంపై పోలీసులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటన ఎక్కడ జరిగినా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. కేసును సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేయాలంటూ ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నప్పటికీ సత్తెనపల్లి పోలీసులు ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించడం ఖాకీల అధ్వానపు పనితీరుకు నిదర్శనమని మండిపడుతున్నారు. దిశ చట్టం పేరుతో ప్రచారం అయితే ఫుల్‌గా చేసుకుంటున్నారు కానీ.. ఆ చట్టం ప్రకారం ఇప్పటి వరకూ ఒకరికైనా తక్షణ కఠిన శిక్ష పడిన దాఖలాలు ఉన్నాయా? అని ప్రశ్నిస్తున్నారు. దిశ బిల్లు ఆమోదం కోసం కేంద్రంపై జగన్‌రెడ్డి ప్రభుత్వం ఎలాంటి ఒత్తిడి చేయడం లేదనేది ప్రతిపక్షాల మాట. ఇక దిశ పేరుతో మొబైల్ యాప్‌ను హడావుడిగా తీసుకొచ్చి.. ఇదే మీకు శ్రీరామరక్ష అంటూ సర్కారు చేతులు దులిపేసుకుందని అంటున్నారు. దిశ యాప్ వచ్చాక కూడా.. ముగ్గురు మహిళలపై అమానుషాలు జరిగాయంటే.. దిశ యాప్ ఏ మేరకు దారుణాలను అడ్డుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. గుంటూరులో అర్థరాత్రి సడెన్‌గా ఉన్మాదులు అడ్డగించి దాడి చేస్తే.. జేబులోంచి మొబైల్ తీసి.. దిశ యాప్ ఓపెన్ చేసి.. బటన్ నొక్కేంత ఛాన్స్ ఎక్కడుంటుంది? దిశ యాప్ కొన్ని పరిస్థితుల్లో మాత్రమే ఉపయుక్తం. అంతేకానీ, ఆ ఒక్క యాప్‌తో అన్ని ఘటనలనూ అడ్డుకోలేమనే విషయం సర్కారుకు తెలీదా? సీఎం జగన్‌రెడ్డి నివాసముండే తాడేపల్లి ప్యాలేస్ సమీపంలోని సీతానగరం ఘాట్‌లో యువతిపై అఘాయిత్యం జరిగితే.. నెలల తరబడి ఒక్క నిందితుడిని కూడా పట్టుకోలేకపోయారు. పోలీసులు పనితీరు ఇలా ఉంటే.. ఇక నేరగాళ్లలో భయం ఎలా ఉంటుంది? దిశ చట్టంతో ఇప్పటి వరకూ తక్షణ శిక్ష పడకపోతే.. ఇక తామేమైనా తప్పుచేస్తే పోలీసులు శిక్షిస్తారనే ఫియర్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రతిపక్షాలు దిశ చట్టం ఉత్తుత్తి చట్టమంటూ ఉద్యమిస్తుంటే.. వారిని అణిచివేస్తూ.. విపక్షం గొంతునొక్కడంపై వైసీపీ ప్రభుత్వం కనబరుస్తున్న శ్రద్ధ.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడంపై పెట్టుంటే.. ఇలా వరుస ఘటనలు జరిగి ఉండకపోవచ్చు అంటున్నారు. ఇలాంటి దారుణాలన్నీ పోలీసులు, పాలకుల చేతగానితనం వల్లేనంటూ మహిళలు మండిపడుతున్నారు.
http://www.teluguone.com/news/content/gang-rape-on-women-in-sattenapalli-39-122732.html





