కృష్ణాజిల్లాని ఈ రాక్షసుడి చేతిలో పెట్టారేంటో!
Publish Date:Jul 29, 2024
Advertisement
కృష్ణాజిల్లా ఎస్పీగా గంగాధరరావుని నియమించడం కృష్ణాజిల్లా పోలీసు శాఖలో మాత్రమే కాకుండా, తెలుగుదేశం పార్టీలో కూడా చర్చకు దారితీసింది. జగన్ పార్టీతో ఐదేళ్ళు అంటకాగి, జగన్ చెప్పినట్టల్లా ఆడి, తెలుగుదేశం నాయకులను, కార్యకర్తలను వేధించిన గంగాధర్‌ని ఇప్పుడు కృష్ణాజిల్లా ఎస్పీగా చంద్రబాబు నియమించారు. గంగాధర్ తన ప్రతాపాన్ని కేవలం టీడీపీ క్యాడర్ మీద మాత్రమే చూపించలేదు.. సాక్షాత్తూ చంద్రబాబు నాయుడు మీద కూడా తన అధికార దుర్వినియోగాన్ని ప్రయోగించారు. అన్నమయ్య జిల్లా ఎస్పీగా గంగాధర్ వున్న సమయంలో అంగళ్ళు ఘటనలో చంద్రబాబు మీద, తెలుగుదేశం నాయకుల మీద హత్యాయత్నం కేసులు నమోదు చేసిన ఘనత గంగాధర్‌దే. చంద్రబాబు మీద రాళ్ళ దాడి చేసిన వారిని వదిలేసి, రాళ్ళదాడికి గురైన చంద్రబాబు తదితరుల మీద హత్యాయత్నం కేసు నమోదు చేసిన గొప్ప పోలీస్ ఆఫీసర్ గంగాధర్. సాధారణంగా అయితే ఇలాంటి ఆఫీసర్ని ఏదైనా ప్రాధాన్యం లేని పోస్టులో నియమిస్తారు. కానీ, ఏకంగా కృష్ణాజిల్లా ఎస్పీగా నియమించడం తెలుగుదేశం నాయకులు మింగుడు పడటం లేదు. వైసీపీ ప్రభుత్వం వుంది కాబట్టి గంగాధర్ అప్పట్లో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించి వుండొచ్చు అనడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఆయన ఇప్పటికీ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని పీఏ లక్ష్మోజీ మీద కొద్ది రో్జుల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటన మీద ఆయన ఫిర్యాదు చేయలేదు. అలాగే రాజకీయ రంగు కూడా పులమలేదు. ఈనెల 17న కృష్ణాజిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన గంగాధర్ గుడివాడకి వెళ్ళి లక్ష్మోజీని పరామర్శించారు. తన మీద జరిగిన దాడి ఘటన మీద కేసు నమోదు చేయించారు. గంగాధర్ ఇదంతా కొడాలి నాని ఆదేశాల మేరకు చేస్తున్నారని, ఈ దాడి ఘటన కేసుని తెలుగుదేశం నాయకుల మీదకి నెట్టే ఉద్దేశంతోనే గంగాధర్ ఇదంతా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు అతి మంచితనంతో ఇలాంటి నాయకుడికి కృష్ణాజిల్లా ఎస్పీలాంటి కీలక పదవిలో కూర్చోబెట్టడం మంచిది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ పాలనలో తన రాక్షసత్వాన్ని చూపించిన గంగాధర్ చేతిలో కృష్ణాజిల్లాని చంద్రబాబు పెట్టారని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/gandhar-as-sp-to-krishna-district-39-181729.html





