గాలి జనార్ధన్ రెడ్డికి ఏపీ ప్రభుత్వం బిగ్ షాక్.. బ్రాహ్మణి స్టీల్స్ భూముల వెనక్కి.!

Publish Date:Jul 11, 2026

Advertisement

తెలుగువన్ ఎక్స్ క్లూజివ్.!

కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. కడప జిల్లాలో బ్రాహ్మణి స్టీల్స్ పరిశ్రమ ఏర్పాటు కోసం గతంలో కేటాయించిన వేల ఎకరాల భూములను వెనక్కి తీసుకోవాలని  చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది.  దాదాపు 19 ఏళ్లు గడుస్తున్నా అక్కడ ఎలాంటి పరిశ్రమ ఏర్పాటు కాకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2007లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కడప జిల్లాలో బ్రాహ్మణి స్టీల్స్ ఏర్పాటుకు భారీగా భూములు కేటాయించారు.  ఎకరం భూమి  18 వేల రూపాయల చొప్పున దాదాపు 10 వేల ఎకరాలకు పైగా భూములను అప్పట్లో గాలి జనార్ధన్ రెడ్డి కుమార్తె పేరిట ఉన్నబ్రాహ్మిణి స్టీల్స్  సంస్థకు కేటాయించింది. దీనికోసం కేవలం 19 కోట్ల రూపాయలను గాలి జనార్ధన్ రెడ్డి ప్రభుత్వ ఖజానాకు చెల్లించారు. ఆ తర్వాత 2008లో విమానాశ్రయం ఏర్పాటు నెపంతో మరో 3,115 ఎకరాల భూములను 25 కోట్ల రూపాయలకే రాసిచ్చారు.

పరిశ్రమల పేరుతో యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పి, వేల ఎకరాల విలువైన ప్రభుత్వ భూములను ఇలా కారుచౌకగా కేటాయించడంపై అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే, భూములు పొందిన తర్వాత గాలి జనార్ధన్ రెడ్డి అక్కడ ఉక్కు కర్మాగారాన్ని నిర్మించడంలో పూర్తిగా విఫలమయ్యారు. పరిశ్రమ పెట్టకపోగా, ఈ ప్రభుత్వ భూములను జాతీయ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి దాదాపు 350 కోట్ల రూపాయల మేర రుణాలు పొంది బ్యాంకులను సైతం మోసం చేశారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి.

గతంలో ఈ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు, రుణాలు ఇచ్చిన యాక్సిస్ బ్యాంక్ వంటి జాతీయ బ్యాంకులు కోర్టులను ఆశ్రయించాయి. భూములు తమ అధీనంలో ఉన్నాయని వాదించాయి. అయితే, పూర్తి హక్కులు లేని భూములపై బ్యాంకులు ఏ విధంగా రుణాలు ఇస్తాయని కోర్టులు సైతం తీవ్రంగా వ్యాఖ్యానించిన నేపథ్యంలో, ప్రస్తుత జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఈ 10,000 ఎకరాల భూములను తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునే ప్రక్రియ ఊపందుకుంది.

ఈ ఉదంతంపై  విశ్లేషకుడు  మధుసూదన్ రెడ్డి తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో  నాటి వైఎస్సార్ క్యాబినెట్ లో మంత్రులుగా ఉండి, నేడు కూటమి ప్రభుత్వంలోనూ మంత్రులుగా కొనసాగుతున్న కొందరు నేతల సమష్టి బాధ్యతను ప్రశ్నించారు. పరిశ్రమలు పెట్టకుండా కాలయాపన చేయడం వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లడమే కాకుండా, స్థానిక నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు కోల్పోయి తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. 

భవిష్యత్తులోనైనా ఏ ప్రభుత్వమైనా పరిశ్రమలకు భూములను శాశ్వతంగా రిజిస్ట్రేషన్ చేయకుండా, కేవలం లీజు ప్రాతిపదికన మాత్రమే ఇవ్వాలనన్నారు. అప్పుడే పారిశ్రామికవేత్తలు భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టకుండా, నిజాయితీతో పరిశ్రమలు స్థాపించే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ గాలి జనార్ధన్ రెడ్డి ఆర్థిక సామ్రాజ్యానికి, బ్రాహ్మణి స్టీల్స్ భూముల ఉదంతం ఒక పెద్ద ఎదురుదెబ్బేనని మధుసూదన్ రెడ్డి 
అన్నారు. 

పూర్తి ఇంటర్వ్యూ తెలుగువన్ న్యూస్ చానల్ లో వీక్షించండి.

 

By
en-us Political News

  
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై  చార్జ్‌షీట్‌  విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్  ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.  తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే..  మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి  సొంత నియోజకవర్గానికే  ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.  
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో  గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన  బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న  నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. 
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.