మోడీ దెబ్బకి గాలి ఎదురుదెబ్బ
Publish Date:Nov 16, 2016
Advertisement
ఇప్పుడంటే పెద్దనోట్ల రద్దుతో ఈ విషయం దేశం మొత్తం హాట్ టాపిక్ అయ్యింది గానీ..అంతకు ముందు దేశం మొత్తం తన గురించి మాట్లాడుకేనేలా చేశాడు..కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డి. తన కుమార్తె బ్రాహ్మాణి వివాహాన్ని నవంబర్ 16న నిశ్చయించి ఆ కార్యానికి అందరూ రావాల్సిందిగా.. ఇండియాలో ఇంతవరకు ఎవ్వరూ డిజైన్ చేయించని రేంజ్‌లో వెడ్డింగ్ కార్డ్ తయారు చేయించి వార్తల్లోని వ్యక్తి అయ్యాడు. వెడ్డింగ్ కార్డే ఈ రేంజ్‌లో ఉంటే ఇక పెళ్లి ఏ రేంజ్‌లో ఉండబోతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ ప్రధాని నరేంద్రమోడీ బాంబు పేల్చారు. ఇప్పటి వరకు చలామణిలో ఉన్న పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో అక్రమార్కుల గుండెలు గుభేలుమన్నాయి. కూతురి పెళ్లి అంగరంగ వైభవంగా చేయాలని సన్నాహాలు చేసుకుంటున్న గాలి గారికైతే నోట్లో పచ్చివెలక్కాయ పడినట్లైంది. ప్రధాని ప్రకటన అన్ని రంగాలపై పెను ప్రభావం చూపింది. రూ.500, రూ.1000 నోట్లు తీసుకోవడానికి వ్యాపారులు అంగీకరించకపోవడంతో భూముల క్రమ విక్రయాలు, వివాహాది శుభకార్యాలు నిలిచిపోయాయి. అక్రమార్కులు తాము అక్రమంగా కూడబెట్టుకున్న నగదును ఎలా మార్పిడి చేసుకోవాలో అర్థంకాక జుట్టుపీక్కుంటున్నారు. ఈ దశలో అక్రమ మైనింగ్ ద్వారా కోట్లు ఆర్జించిన గాలి కూడా తన కూతురి వివాహాన్ని ఆపేస్తాడని చాలా మంది భావించారు. కానీ ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ అనుకున్న తేదీనే, అంటే ఇవాళే గాలి గారి కుమర్తె వివాహా జరగనుంది. అదేలా సాధ్యం అనేగా మీ డౌట్. గాలి కుమార్తె వివాహాం ఏడు నెలల క్రితమే నిశ్చయం అయ్యింది. పెళ్లి ఎలా చెయ్యాలి.? భోజనాల మెను తదితర వ్యవహారాల కోసం గాలి అప్పుడే ఒక పకడ్భందీ నిర్ణయం తీసుకున్నాడు. పెళ్లి వ్యవహారాల బాధ్యతను ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థకు అప్పగించారు. అయితే పెద్ద నోట్లు రద్దు అయ్యే సమయానికి అన్ని పనులు చకచకా జరిగిపోయాయి. ఆరు నెలల క్రితమే అగ్రిమెంట్ కుదుర్చుకున్నందున అంత భారీ మొత్తం తిరిగిచ్చేందుకు ఆ సంస్థ సాహసించలేదట. పైగా నోట్ల పాట్లు కూడా తామే పడాలని నిర్ణయించుకుందట.
http://www.teluguone.com/news/content/gali-janardhan-reddy-45-69127.html





