Publish Date:Mar 14, 2025
బంగారం తుప్పుపడుతుందని ఎప్పుడైనా విన్నారా? .. ఔనండి నిజంగానే తన బంగారం తుప్పు పట్టిపోతుందని, సీజ్ చేసిన తన గోల్డ్ తనకు ఇచ్చాయాలని ఒక బడా మైనింగ్ మాఫియా కింగ్ కోర్టులో పిటిషన్ వేశారు. ఓఎంసీ కేసులో భాగంగా తమ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న 53 కిలోల బంగారు నగలు తుప్పుపట్టిపోతాయంటూ మైనింగ్ కింగ్ గాలి జనార్దన్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ఆ నగలతో పాటు తమ వద్ద సీజ్ చేసిన నగదు, రూ.5 కోట్ల విలువైన బాండ్లను విడుదల చేయాలంటూ గాలి జనార్దన్‌రెడ్డి, ఆయన కుమార్తె జి.బ్రాహ్మణి, కుమారుడు జి.కిరీటిరెడ్డి పిటిషన్లు దాఖలు చేయగా, తెలంగాణ హైకోర్టు వాటిని కొట్టేసింది.
బంగారు నగలు తుప్పుపట్టిపోతాయని, విలువ తగ్గుతుందన్న గాలి అభ్యర్థనను తిరస్కరించింది. ఓఎంసీ కేసు విచారణ పూర్తయ్యాకే వాటిపై హక్కులు తేల్చుకోవాలని స్పష్టం చేసింది. అక్రమ మైనింగ్ ద్వారా రూ.884.13 కోట్ల ప్రజాధనం కొల్లగొట్టారని సీబీఐ కేసు నమోదుచేసి, నేరపూరిత సొమ్ముతో కొన్న నగలపై ఈడీ కూడా హక్కులు కోరుతోందని, అందువల్ల ఈ దశలో సీజ్ చేసిన వాటిని అప్పగించాలని ఉత్తర్వులు ఇవ్వలేమంది. ఓఎంసీ కేసు విచారణ పూర్తయ్యాకే నగలను, సొమ్మును తీసుకోవడానికి దరఖాస్తు చేసుకోవచ్చంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/gali-janardanreddy-petition-in-telanganacourt-25-194409.html
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.
హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల నిర్వహణను మరింత సమర్థంగా చేపట్టేందుకు పోలీస్ శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు.
దసరా పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.