గడప గడపకూ బాధ్యతలు మాజీ మంత్రులకు

Publish Date:Jul 23, 2022

Advertisement

జగనాగ్రహానికి పార్టీలో ప్రముఖుల ప్లేస్ లు మారిపోతున్నాయి. పనికి రారన్నట్లుగా కేబినెట్ నుంచి ఉద్వాసన గురైన వారికే ఇప్పుడు వైసీపీ అధినేత గడపగడపకూ మన ప్రభుత్వం బాధ్యతలను అప్పగించారు. ఈ అప్పగింతకు ముందు ఆయన పార్టీ ఎమ్మెల్యేలకు గట్టి క్లాసే పీకారు. అయినా వారిలో స్పందన లేదన్న నిర్ణయానికి వచ్చేసి ఈ సారి ఆ బాధ్యతలను పార్టీ జిల్లా అధ్యక్షుడు, రిజనల్ కో అర్డినేటర్లకు అప్పగించేశారు. విచిత్రమేమిటంటే వీరిలో అత్యధికులు ఇటీవలి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆమాత్య పదవులను పోగొట్టుకున్న వారే.

ఇలా బాధ్యతలు బదలాయించడానికి జగన్ పెప్పిన కారణమేమిటంటే..గడప గడపకూ వోళ్లని ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్లు ఇచ్చేది లేదని చెబుతున్నా  ఓ పది.. పదిహేను మంది తప్ప ఎవరూ సీరియస్ గా తీసుకోలేదని.  దీంతో ఆయన ఎలాగైనా ఎమ్మెల్యేల్ని గడప గడపకూ తరలించాలని పట్టుదలతో ఉన్నారు. అందుకే ఈ సారి జిల్లాల అధ్యక్షులు.. రీజనల్ కోఆర్డినేటర్లతో మీటింగ్ పెట్టారు. వీరిలో ఎక్కువ మంది ఇటీవల పదవులు పోగొట్టుకున్న మాజీ మంత్రులే. వారికే ఇప్పుడు ఎమ్మెల్యేలతో ప్రోగాంను సక్సెస్ చేయించాల్సిన బాధ్యత ఇచ్చారు. వాళ్లకి ఐప్యాక్ టీం సహకరించేలా ఏర్పాటు చేశారు.  ఐ ప్యాక్ టీంలు జిల్లాల వారీగా పని చేస్తాయని వారితో సమన్వయం చేసుకోవాలని జగన్ ఆదేశించారు. మొత్తానికి గడపగడపకూ మన ప్రభుత్వాన్ని విజయవంతం చేసే బాధ్యత అంతా పార్టీ జిల్లాల అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లదేనని జగన్ విస్పష్టంగా చెప్పేశారు. మాజీలకు ఈ బాధ్యతలు అప్పగించడంతో మళ్లీ  మంత్రులు డమ్మీలేనని చెప్పకనే చెప్పేశారు. దీంతో ఈ మాత్రం దానికి తమకు కేబినెట్ నుంచి ఉద్వాసన పలికి మాజీలను చేయడమెందుకని తాజా మాజీలు ఒకింత నిరసన వ్యక్తం చేస్తున్నారు.  

మంత్రలు అధికారం అనుభవిస్తుంటే.. మాజీలమైన తాము పార్టీకి ఊడిగం చేయాలా అన్న సణుగుడు మాజీలలో మొదలైందని పార్టీ శ్రేణులే అంటున్నారు. మంత్రులను కాదని తమ మాట క్యాడర్ ఎందుకు వింటుందన్న సందేహమూ వారిలో వ్యక్తం అవుతోంది.  

అంతే కాకుండా తమ తమ నియోజకవర్గాలలో తామూ గడపగడపకూ వెళ్లాలి కదా అని గుర్తు చేస్తున్నారు.  ప్రభుత్వంపై ఆగ్రహాన్ని జనం ఎమ్మెల్యేలపై వెళ్లగక్కితే వారి ఆగ్రహం ఏదో మేరకు చల్లారుతుందన్న జగన్ భావిస్తున్నట్లుందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఏది ఏమైనా జగన్ ఎంత మొత్తుకున్నా, తాపత్రేయపడినా, హెచ్చరికలు చేసినా గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం పట్ల పార్టీలో ఎవరూ సీరియస్ గా లేదని పార్టీ నాయకులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు.

By
en-us Political News

  
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.