ఒకే వేదికపై బాబాయ్, అబ్బాయ్.. విభేదాల ప్రచారానికి ఫుల్ స్టాప్!

Publish Date:Apr 1, 2025

Advertisement

గత కొంత కాలంగా నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య విభేదాలు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారం ఉత్తి ప్రచారమేనా అంటే నందమూరి కుటుంబం నుంచి వస్తున్న సంకేతాలను బట్టి ఔననే సమాధానమే వస్తోంది. ఇటీవల ఒక సందర్భంలో నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ పట్టుకోవడం, తాజాగా నందమూరి కల్యాణ్ రామ్ తెలుగుదేశం జెండా చేతబట్టి అభిమానులను అలరించడం చూస్తుంటే నందమూరి కుటుంబంలో విభేదాలు అన్నది వట్టి ప్రచారమే అన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది.  ఇటీవల కృష్ణా జిల్లా మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్ లో అశోక్ లేలాండ్ ప్లాంట్ ను మంత్రి లోకేష్ ఆరంభించారు. ఆ సందర్భంగా నూజివీడు మండలం సీతారామపురంలో తెలుగుదేశం మద్దతుదారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆ సందర్భంగా కార్యకర్తలు, అభిమానుల కోరిక మేరకు మంత్రి నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ ఉన్న ఫ్లెక్సీని ప్రదర్శించారు. తద్వారా తమ మధ్య విభేదాలన్నవేవీ లేవని చాటారు. ఇది నందమూరి అభిమానుల్లో జోష్ పెంచింది. లోకేష్ ఎన్టీఆర్ ప్లెక్సీని పట్టుకున్న ఫొటోలు, వీడియో సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయ్యింది. తాజాగా నందమూరి హీరో కల్యాణ్ రామ్ తెలుగుదేశం జెండా పట్టుకుని హల్ చల్ చేశారు. నరసరావు పేటలో పర్యటించిన హీరో కల్యాణ్ రామ్ తెలుగుదేశం జెండా  చేతపట్టుకుని సందడి చేశారు. దీంతో తెలుగుదేశం అభిమానులు, నందమూరి అభిమానులు ఫుల్ జోష్ అయ్యారు. ఈ రెండు సంఘటనలూ కలిపి చూస్తే జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు తెలుగుదేశం పార్టీకి నందమూరి కుటుంబానికి ఒకింత దూరం మెయిన్ టైన్ చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని అవగత మౌతుంది. 
అయితే గతంలో జరిగిన ఒకటి రెండు సంఘటనలే ఈ విభేదాల ప్రచారానికి కారణమయ్యాయనడంలో సందేహం లేదు. గతంలో ఒక సారి నందమూరి కల్యాణ్ రామ్ ఒక ఇంటర్వ్యూతో  మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారు అన్న ప్రశ్నకు ఇంకే పార్టీకి మా తాత స్థాపించిన తెలుగుదేశానికే అని చెప్పకుండా.. తన సోద రుడు జూనియర్ ఎన్టీఆర్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటాను అని చెప్పడం. కుటుంబ కార్యక్రమాల్లో నందమూరి కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లు పెద్దగా కనిపించకపోవడం ఈ ప్రచారానికి కారణమయ్యాయి. అయితే పలు సందర్భాలలో జూనియర్ ఎన్టీఆర్ బాబాయ్ బాలకృష్ణతో తనకు ఎలాంటి విభేదాలూ లేవని విస్పష్టంగా చెప్పినా.. ఈ ప్రచారానికి తెరపడలేదు. ఇందుకు కారణం ఈ విషయంలో బాలకృష్ణ స్పందించకపోవడమేనని అంటారు. అంతే కాకుండా ఒక సందర్భంలో ఎన్టీఆర్ ఘాట్ లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించేయమంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కూడా విభేదాల ప్రచారానికి దోహదపడ్డాయి. అయితే ఇప్పడు ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడనుంది. 

ఇందుకు బాలయ్యే చొరవ తీసుకుంటున్నట్లు కనిపిస్తున్నది. నందమూరి తారకరామారావు నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన బాలకృష్ణ.. సినిమాలలోనే కాకుండా రాజకీయాలలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించారు. హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్యెల్యేగా హ్యాట్రిక్ విజయాలు సాధించారు. అలాగే ఎన్టీఆర్ మనవడిగా సీనీ ప్రవేశం చేసిన జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరిగా ఎదిగారు.  అయితే వీరి మధ్య విభేదాల ప్రచారం సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ , బాలకృష్ణ ఫ్యాన్స్ మధ్య గొడవలకు కూడా కారణమయ్యాయి.

జూనియర్ ఎన్టీఆర్ పదేపదే  తనకి బాబాయ్ బాలకృష్ణకి ఎలాంటి విబేధాలు లేవు చెబుతూ వస్తున్నా.. ఈ ప్రచారానికీ, ఫ్యాన్స్ మధ్య గొడవలకూ తెరపడలేదు. అయితే ఇప్పుడు ఎటువంటి అరమరికలూ లేకుండా బాబాయ్- అబ్బాయ్ లు ఒకే వేదికపై కనిపించి ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాలన్న నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇందుకు మే 28న ఘనంగా జరగనున్న ఎన్టీఆర్ జయంతి వేడుక వేదిక కానుంది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బాలకృష్ణ పెద్ద ఎత్తున వేడుక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ వేడుకకు ఆయన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లను ఆహ్వానించనున్నారని చెబుతున్నారు.

కాగా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఏటా తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఒక పండుగలా నిర్వహించడం ఆనవాయితీ. ఈ సారి కూడా మహానాడును కడప వేదికగా నిర్వహించేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిర్ణయించారు. ఆ మహానాడుకు బాలకృష్ణ కూడా హాజరౌతారు. మరి బాలకృష్ణ నిర్వహించే కుటుంబ వేడకకు కూడా మహానాడే వేదిక అవుతుందా?  మహానాడు వేదికగా జరిగే కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు హాజరౌతారా? అంటే విశ్వసనీయ వర్గాల నుంచి ఔననే సమాధానం వస్తోంది. దీంతో ఒకే వేదికపై బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య విభేదాలు అన్నది ఒట్టి ప్రచారం మాత్రమేనని తేలిపోవడమే కాకుండా, తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారన్న వదం తులకు కూడా చెక్ పడుతుందని తెలుగుదేశం, నందమూరి అభిమానులు ఆనందంగా చెబుతున్నారు.  

By
en-us Political News

  
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.