కేంద్రం, రాష్ట్రాల మధ్య నిథుల ‘పంచాయతీ’

Publish Date:Jan 11, 2023

Advertisement

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీ నిధుల విషయంలో పరస్పరం ఎంత దుమ్మెత్తి పోసుకున్నా, ఎన్ని విమర్శలు చేసుకున్నా.. వాస్తవమేమిటంటే.. గ్రామ పంచాయతీలకు నిధులు అందడం లేదన్నది మాత్రమే. గ్రామాల అభివృద్ధికి కానీ, గ్రామాలలో సంక్షేమ పథకాలకు కానీ పైసా  నిధులు కూడా లేవు.

అమలు జరిగిన, జరుగుతున్న కార్యక్రమాలకు నిధులు అందక సర్పంచ్ లు అడకత్తెరలో పోక చెక్క మాదిరి నలిగిపోతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. గ్రామాల అభివృద్ధి విషయంలో తెలంగాణ దేశానికే ఆదర్శమని సొంత భుజాలు చరుచుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ జరగని విధంగా తెలంగాణలో గ్రామాభ్యుదయం వికసించిందని చెప్పుకుంటున్నారు.  అయితే గ్రామ పంచాయతీలకు నిధుల మంజూరు విషయంలో మాత్రం కేంద్రంపై నెపం తోసేసి చేతలు దులిపేసుకుంటోది. అదే సమయంలో  కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిస్తోంది. ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర నిందారోపణలో పబ్బం గడిపేసుకుంటూ.. గ్రామాలకు నిధుల మంజూరు విషయాన్ని విస్మరిస్తున్నాయి.  రాష్ట్రంలో గ్రామాలు దేశంలో మరెక్కడా లేనివిధంగా అభివృద్ధి చెందు తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గొప్పగా చెప్పుకుంటున్నా వాస్తవంలో మాత్రం నిధుల కొరతతో గ్రామ పంచాయతీలు నానా అవస్థలూ పడుతున్నాయి.  

నిధుల కొరత కారణంగా తాము నానా అవస్థలూ పడుతున్నామంటూ గత కొన్ని నెలలుగా  సర్పంచులు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. తాము కూడా చివరికి వ్యవసాయ కార్మికులుగా, కాపలా దార్లుగా పని చేయాల్సి వస్తోందని, ప్రాణాలు తీసుకోవడం కూడా జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు  గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు గాను కాంట్రాక్టర్లకు చెల్లించడానికి రుణాలు తీసుకోవాల్సి వస్తోందని  చెబుతున్నారు. తమ దగ్గర నిధులు లేకపోయినా, అభివృద్ధి కార్యక్రమాల అమలు విషయంలో తమపై విపరీతంగా ఒత్తిడి పెరుగుతోందని  వారు వాపోతున్నారు. చాలా నెలలుగా తమకు నిధులు విడుదల కావడం లేదంటూ   గగ్గోలు పెడుతున్నారు.

ఈ విషయంలో పార్టీలతో సంబంధం లేదు. ఏ సర్పంచ్ ఏ పార్టీకి చెందినవారైనా నిధుల కొరత మాత్రం అందరికీ సమానంగానే ఉంటోంది. అత్యధిక శాతం గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం పది లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయల వరకు బాకీ పడిందని వారు చెబుతున్నారు.  గ్రామ పంచాయతీలు నిధులు కేటాయించడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై  విమర్శలు, అలాగే కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందంటూ ఆరోపణలు, నిరసనలతో బీజేపీ హోరెత్తిస్తుంటే.. కాంగ్రెస్ కూడా పంచాయతీలకు నిధుల విషయంలో కేసీఆర్ సర్కార్ నే నిందిస్తోంది.  అయితే, కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు సరిగా నిధులు రావడం లేదని, కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని, నిధుల్లో కోత విధించడం, నిధుల మంజూరులో ఆలస్యం చేయడం, విధులు ఆపేయడం వంటి చర్యలకు పాల్పడుతోందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ పరస్పరారోపణల మధ్య అసలు వాస్తవం మరుగున పడిపోతోంది.  వాస్తవం ఏమిటంటే కేంద్రం నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులను విడుదల చేయడం రాష్ట్రాల హక్కులను హరించడమేనని కేసీఆర్ అంటున్నారు.

నిజమే.. కానీ కేంద్రం విడుదల చేశాం కానీ, రాష్టం దారి మళ్లించిందంటోది.  రాష్టరమేమో కేంద్రం నుంచి నిధులే రాలేదంటోంది. ఇప్పటికైనా పరస్పర నిందారోపణలను పక్కన పెట్టి వాస్తవమేమిటన్నది వెల్లడించి పంచాయతీలకు నిధుల కొరత పరిష్కరించాల్సిన అవసరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. 

By
en-us Political News

  
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.