ధర్మానలో ఫ్రస్ట్రేషన్ పీక్స్!.. ఆయన కథ క్లైమాక్స్ కు చేరినట్లేనా?

Publish Date:Apr 30, 2023

Advertisement

ఆడలేక మద్దెలు ఓడన్నట్లు..  ప్రజల సమస్యలు పరిష్కరించడం చాతకాక వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్న ప్రజలను తప్పుపడుతున్నారు. ప్రజాగ్రహం ప్రస్ఫుటంగా కనిపిస్తుండటంతో వైసీపీ నేతలలో  ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరుకుంది.  ఈ విషయంలో  ముఖ్యమంత్రి, మంత్రులు, సీనియర్లు, జూనియర్లు అన్న తేడా కనిపించడం లేదు. కట్టు తెంచుకుని వరద నీరు పోటెత్తినట్లు.. వైసీపీ నేతల్లో అసహనం బట్టబయలౌతోంది.

తాజాగా మంత్రి ధర్మాన ప్రసాదరావు ఏకంగా వైసీపీ పాలన నచ్చితేనే ఓటేయండి లేకపోతే అక్కర్లేదు అంటే జనంపైనే తన అసహనం వ్యక్తం చేశారు. జనానికి మేలు చేసిన ప్రభుత్వం మాది..  మేం మేలు చేయడం వల్లే రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో పడిందని మీరనుకుంటే మీ యిష్టం అనేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు వైసీపీ సర్కార్ కు తీవ్ర నష్టం చేయడం ఖాయమన్న విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి.  ముఖ్యమంత్రి జగన్ పేదల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని, ఆయనను సైకో అంటూ విమర్శించడమేంటంటూ విపక్షాల మీద విరుచుకుపడిన మంత్రి ధర్మాన.. అదే జోరులో ప్రజలనూ చెడామడా చెరిగేశారు.

విపక్షం సభలకు జనం పోటెత్తడాన్ని, జగన్ సహా వైసీపీ సభలు జనం లేక వెలవెలబోవడాన్నీ తట్టుకోలేక తన అసహనాన్నంతా వెల్లగక్కేశారు. జనం మేలు కోసం మంచి పనులెన్నో చేస్తున్నారనీ జగన్ నిజంగా సైకో అయితే ప్రజల పథకాలు ఎందుకు అమలు చేస్తారనీ జనాన్ని నిలదీస్తున్నారు.  ప్రజల కోసం అహర్నిశలూ కాపాడుతున్న జగన్ మీద అభిమానం ఉంటే ఓట్లు వేయండి లేకపోతే మానేయండి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు యిప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. అన్ని వర్గాలలోనూ ధర్మాన వాచాలత పట్ల విస్మయం వ్యక్తం అవుతోంది. ధర్మాన లాంటి సీనియర్ నాయకుడు, మంత్రి అలా మాట్లాడటమేంటని వైసీపీ వర్గాలే గింజుకుంటున్నాయి.

అంతే కాదు.. ముఖ్యమంత్రి జగన్ సహా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకుల సభలకు, సమావేశాలకు జనం మొహంచాటేయడాన్ని కూడా ధర్మాన ప్రస్తావించారు. ప్రజల మంచి కోసం పాటుపడుతున్న ప్రభుత్వం పట్ల ప్రజలు స్పందించే తీరిదేనా? అని విమర్శలు గుప్పిస్తున్నారు. సొమ్ములు మీ ఖాతాల్లో వేస్తున్నా.. సంతృప్తి లేకపోతే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  మీ ఖాతాల్లో డబ్బులు వేయడం వల్లే రాష్ట్రం ఆర్థికంగా క్షిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోందనీ, ఫ్లై ఓవర్లు కట్టడానికి, అభివృద్ధి పనులు చేయడానికీ కూడా సొమ్ములు లేని పరిస్థితి వచ్చిందనీ ధర్మాన చెబుతున్నారు. ఈ రోజు రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారంటే.. అందుకు జగన్ ప్రభుత్వమే కారణమనీ, అలాంటి జగన్ ప్రసంగిస్తున్నప్పుడు చప్పట్లు కొట్టాలన్న మంచి హృదయం కూడా జనానికి నేకుండా పోయిందని అసహనం వ్యక్తం చేశారు.  

టీవీలలో ఏం చెబితే అది నమ్మేయడమేనా అని  ఆగ్రహం వ్యక్తం చేశారు.  పేదలను సంతోషంగా ఉంచేందుకు  పథకాలను అమలు చేయడమే జగన్ సర్కార్ చేసిన నేరమా, అలా చేయడమంటే రాష్ట్రాన్ని తగలెట్టేయడమేనా అని ధర్మాన ప్రజలను నిలదీశారు. అంతే కాదు.. తమ సమస్యలను విన్నవించుకున్న వారిపై సైతం ధర్మాన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో కరోనా క్వారంటైన్ బాధితుల కోసం ఉపయోగించిన టాయిలెట్లను కనీసం క్లీన్ చేయకుండా అప్పగిస్తున్నారంటూ ఓ లబ్ధి దారులు ధర్మాన దృష్టికి తీసుుక వస్తే.. లక్షల గృహాలిచ్చాం.. ఆ మాత్రం టాయిలెట్లను క్లీన్ చేసుకోలేరా అని ఎదురు ప్రశ్నించి నోరుమూయించేందుకు ప్రయత్నించారు.  మొత్తం మీద ధర్మాన తీరు.. ఆయనలో పేరుకు పోయిన ఓటమి భయాన్ని ప్రస్ఫుటంగా ఎత్తి చూపుతోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.