గత ఎన్నికల ఫలితాలను గుర్తుచేసుకుంటూ, జూన్ 4, 2024న ఆంధ్రప్రదేశ్ ప్రజలు అపూర్వమైన తీర్పునిచ్చారని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రాన్ని విధ్వంసకర మార్గం నుంచి అభివృద్ధి, వికాసం వైపు నడిపించాలనే బలమైన సంకల్పంతోనే ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో వైసీపీ పాలన అంతమై రెండేళ్లు గడిచిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ పెట్టారు. రాష్ట్ర చరిత్రలో జూన్ 4ని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజుగా అభివర్ణించారు.
గత ఎన్నికల ఫలితాలను గుర్తుచేసుకుంటూ, జూన్ 4, 2024న ఆంధ్రప్రదేశ్ ప్రజలు అపూర్వమైన తీర్పునిచ్చారని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరిస్తూ చంద్రబాబు నాయుడు తన ట్వీట్‌లో గత రెండేళ్లుగా అంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్ర అభివృద్ధి, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందని పేర్కొన్నారు.
రాష్ట్రాన్ని హెల్దీ , వెల్దీ), హ్యాపీగా మార్చడమే తమ ప్రభుత్వ ప్రధాన సంకల్పమని చంద్రబాబు ఆ పోస్టులో పేర్కొన్నారు. ప్రజలు గర్వపడేలా పాలన సాగిస్తున్నామన్న చంద్రబాబు.. రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం, వారి నమ్మకమే తమకు కొండంత బలమనీ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే రాబోయే రోజుల్లోనూ పాలన సాగుతుందని పునరుద్ఘాటించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/from-destruction-to-development-25-221783.html
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.