దక్షిణాదిలో సరికొత్త ఫ్రెండ్లీ పాలిటిక్స్... తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడో?

Publish Date:May 15, 2026

Advertisement

 

విజయ్, సతీశన్ అడుగుజాడల్లో...

వైరల్‌గా మారిన కేరళ సీఎం, మాజీ సీఎంల భేటీ..

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఈ మార్పు సాధ్యమేనా..

భారతీయ రాజకీయాల్లో సాధారణంగా కనిపించే శత్రుత్వాలు, విభేదాలకు భిన్నంగా దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళలలో సరికొత్త ‘ఫ్రెండ్లీ పాలిటిక్స్’ ట్రెండ్ నడుస్తోంది. ఎన్నికల సమరంలో ఎంతగా తలపడినా.. అధికారం దక్కిన తర్వాత అందరినీ కలుపుకొని ముందుకు సాగాలనే ఉన్నతమైన రాజకీయ సంస్కృతిని అక్కడి నేతలు ప్రదర్శిస్తున్నారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించి, కేరళ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సతీశన్ తాజాగా తీసుకున్న నిర్ణయం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆయన స్వయంగా మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసానికి వెళ్లి, ఆయనను ఆత్మీయంగా కలుసుకున్నారు. ఉభయ నేతలూ ఎంతో స్నేహపూర్వక వాతావరణంలో రాష్ట్ర ప్రయోజనాలపై చర్చించడం విశేషం.

ఇదే తరహా అరుదైన దృశ్యం కొద్దిరోజుల క్రితం తమిళనాడులోనూ ఆవిష్కృతమైంది. తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన విజయ్.. పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్‌తో పాటు ప్రతిపక్షాలకు చెందిన పలువురు ప్రముఖ నేతలను స్వయంగా కలిసి మర్యాదపూర్వకంగా సంభాషించారు.

 

 

ఈ రెండు పరిణామాలు గెలిచామనే గర్వం కానీ, ఓడిపోయామనే నైరాశ్యం కానీ లేకుండా, ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో నేతలు ఎంత పరిణతితో వ్యవహరిస్తున్నారో నిరూపిస్తున్నాయి. ఎన్నికల వరకే రాజకీయం.. ఆ తర్వాత రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అనే సిద్ధాంతాన్ని వీరు తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు.

పొరుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్న ఈ సానుకూల పరిణామాలపై అటు రాజకీయ విశ్లేషకులతో పాటు ఇటు ప్రజల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఇటువంటి ఆరోగ్యకరమైన వాతావరణం ప్రభుత్వాల పనితీరును మెరుగుపరచడానికి, ప్రజల్లో రాజకీయాల పట్ల సానుకూల దృక్పథాన్ని పెంపొందించడానికి ఎంతో దోహదపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అయితే, ఈ పరిణామాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాలపై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ముగిసిన తర్వాత కూడా పార్టీల మధ్య వైషమ్యాలు, వ్యక్తిగత విమర్శలు, ప్రతీకార రాజకీయాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తమిళనాడు, కేరళ నేతల తరహాలోనే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు కూడా ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఆత్మీయంగా కలుసుకునే రోజులు ఎప్పుడు వస్తాయా అని సామాన్య ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. భవిష్యత్తులోనైనా తెలుగు నేలపై ఇటువంటి సంస్కృతి చిగురిస్తుందో లేదో వేచి చూడాలి.


 

By
en-us Political News

  
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
జగన్‌ తాను మళ్లీ  అధికారంలోకి వస్తానంటూ జగన్ 2.o అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ మేం 10x చూపిస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ జగన్ చేసిన హెచ్చరికలకు పవన్ కల్యాణ్  దీటుగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.  
పులివెందుల నియోజకవర్గ పరిధిలో కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. దశాబ్దాల కాలంగా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఏకపక్షంగా జగన్ కు పట్టుఉన్న నియోజకవర్గం పులివెందుల. అటువంటి పులివెందులలో ఎంపీటీసి జడ్పీటీసి స్థానాలను టీడీపీ  ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది.
2019 ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత   శైలిని ఒకింత మార్చుకున్నారు. 2024 ఎన్నికల ముందు వరకూ ఆయన పార్టీ నేతలు నోటి దురుసు ప్రదర్శించడాన్ని ప్రోత్సహించారు కానీ, స్వయంగా తాను ఒకింత సహనం చూపారు. అంత మాత్రాన రాజకీయ విలువలతో మృదు విమర్శలు చేశారని కాదు కానీ, అధికారంలోకి రావడానికి ముందున్నంత దూకుడు లేదని చెప్పాల్సి ఉంటుంది.
వైయస్ జగన్ ఇలాకాలో టీడీపీ 40 ఏళ్ళ చరిత్రను తిరగాసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.