గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్.. మరో వివాదం

Publish Date:Jan 16, 2023

Advertisement

తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్  కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సంబంధాల గురించి  ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.  ఇది అందరికీ తెలిసిన విషయం. ఇక ముఖ్యమంత్రి, గవర్నర్  సంబంధాల విషయం అయితే చెప్పనే అక్కర లేదు. ఉప్పు నిప్పు అంటే బాగుంటుందేమో , ఆ ఇదరి మధ్య మాటలు లేవు. మాట్లాడుకోవడాలు లేవు.  వివాదాలకు మాత్రమే ఉన్నాయి. అధికార పరిధి మొదలు ప్రోటోకాల్ ఉల్లంఘనల  వరకు ఒకటని కాదు రెండు కీలక రాజ్యాంగ వ్యవస్థల నడుమ వివాదాలకు కొదవ లేదు.  అనేక వివాదాల  చుట్టూ దుమారం రేగుతోంది.  ఇప్పటికే అనేక పర్యాయాలు ఇదే విషయంగా చాలా చాలా చర్చ జరిగింది. జరుగుతూనే వుంది. అనివార్యం అయితే తప్ప  ముఖ్యమంత్రి  మంత్రులు మాత్రమే కాదు, సీఎస్, డీజీపీ సహా ఇతర అధికారులు  ఎవరూ..  రాజ్ భవన్ వైపు చూడడమే మానేశారు. 

అదలా ఉంటే ఇప్పుడు మరో సారి మరో వివాదం తెరపై కొచ్చింది. ఇటీవల మలక్ పేట ప్రభుత్వాసుపత్రిలో  డెలీవరీ కోసం  అడ్మిట్  అయిన  ఇద్దరు మహిళలు  మృతి చెందారు. మరి కొందరు తీవ్ర  అనారోగ్యానికి గురయ్యారు. ఈ దుర్ఘటనపై గవర్నర్ స్పందించారు.  స్పందనలోనే సందేహాలు వ్యక్త పరిచారు. మలక్ పేట ప్రభుత్వాసుపత్రిలో బాలింతల మృతి చెందడంపై  తనకు  అనేక అనుమానాలున్నాయని  గవర్నర్ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. రాజ్ భవన్ లో  ఆదివారం (జనవరి 15) నిర్వహించిన సంక్రాంతి సంబరాలలో గవర్నర్ పాల్గొన్నారు.  ఈ  సందర్భంగా మీడియాతో మాట్లడుతూ మలక్ పేట ఆసుపత్రిలో ఇద్దరు బాలింతలు మరణించడం బాధాకరమన్నారు. బాలింతల మరణాలపై  ఓ గైనకాలజిస్ట్ గా తనకు ఎన్నో అనుమానాలు,  ఉన్నాయని అన్నారు. గవర్నర్  గా మాత్రమే కాకుండా ఒక డాక్టర్ గా కొన్ని అనుమానాలున్నాయని అన్నారు. నిజానికి, ఆసుపత్రికి వెళ్లాలని అనుకున్నా కానీ, పండుగ  కారణంగా  వెళ్లలేకపోయానని అన్నారు.  గతంలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల సమయంలోనూ నలుగురు మరణించిన విషయాన్ని గవర్నర్ గుర్తు  చేశారు. రాష్ట్రంలో జనాభాకు అనుగుణంగా వైద్య రంగంలో వసతులు మెరుగుపరచ వలసిన అవసరం ఉందని గవర్నర్ అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం ఉన్న సౌకర్యాలను  మరింతగా  మెరుగు పరచాల్సిన అవసరాన్ని  గవర్నర్ నొక్కి చెప్పారు.  ఆ దిశగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆమె కోరారు. అలాగే  రాష్ట్ర శాసన సభ ఆమోదం తెలిపిన కీలక బిల్లులకు సంబదించి, గవర్నర్ ప్రభుత్వ బిల్లులు పెండింగ్ లో లేవని, తన పరిశీలనలో  ఉన్నాయని    తెలిపారు.   వర్సిటీ నియామకాల బిల్లులో  అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవలసిన అవసరం ఉందన్నారు. యూనివర్సిటి నియామకాల బిల్లు వివాదాలతో  ఆలస్యం కారాదన్నదే  తన అభిమతమని గవర్నర్ వివరించారు. ఈ తరహా విధానాలను గతంలో న్యాయస్థానాలు అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా గవర్నర్ గుర్తు చేశారు.  

యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని  గవర్నర్  కోరారు. అయితే సాధారణ పరిస్థితులలో అయితే ఇలాంటి వ్యాఖ్యలకు అంతగా ప్రాధాన్యత ఉండక పోవచ్చును కానీ  ఒక్క తెలంగాణలోనే కాకుండా ఇరుగు పొరుగు రాష్త్రాలలోనూ గవర్నర్లకు, రాష్ట్ర ప్రభుత్వాలకు నడుమ దూరం పెరిగిన నేపధ్యంలో, గవర్నర్ చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి దారి తీయవచ్చని అంటున్నారు .

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కేరళలోని కొచ్చిలో సంచలనం సృష్టించిన మెర్సిడెస్ బెంజ్ కారు ప్రమాదం కేసు పోలీసు శాఖలో కలకలం రేపుతోంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
మహా న‌గ‌రం హైద‌రాబాద్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.