అలుపెరుగని పోరాటానికి నాలుగేళ్లు.. ధర్మానిదే జయం

Publish Date:Dec 16, 2023

Advertisement

జగన్ నాలుగున్నరేళ్ల పాలన ఏపీని అస్తవ్యస్తం చేసేసింది. రాష్ట్రంలో సంతోషం, ధీమా, భరోసా అన్న పదాలకు అర్ధమే లేకపోయింది. రాష్ట్రం మొత్తం ఒక బందిఖానాగా మారిపోయింది. ఇదేమిటని ప్రశ్నిస్తే పోలీసు లఠీలు బదులు చెప్పే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ విధానాలను తప్పుపడితే సీఐడీ కేసులు వెంటాడుతాయి. హక్కుల కోసం గళమెత్తితే జైళ్లు నోళ్లు తెరుస్తాయి. శ్రీశ్రీ ఓ కవితలో చెప్పినట్లు రెండు రెళ్లు నాలుగన్నందుకు గూండాలు గండ్రాళ్ళు విసిరే సీమగా ఏపీ మారిపోయింది. రాష్ట్రంలో మినీ ఎమర్జెన్సీ అమలులో ఉందా అనిపించేలా పరిస్థితులు ఉన్నాయి. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనతో రెవెన్యూలోటుతో, కనీసం రాజధాని కూడా లేకుండా విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచింది. పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానే కదా అని సంతృప్తి చెందడానికి కూడా లేకుండా ఆనాడు భవనాల కేటాయింపు దగ్గర నుంచీ, అక్కడ ఉన్న ఆంధ్రా ఉద్యోగులను గో బ్యాక్ అంటూ నిత్యం వేధింపులతో నిత్యనరకం అనుభవించారు. ఇక విభజన హామీలను అమలు చేయాల్సిన అప్పటి గవర్నర్ నరసింహన్.. దేవాలయాల సందర్శన తప్ప తన బాధ్యతలపై దృష్టి పెట్టింది లేదు.విడిపోయి కూడా అవమానాలు భరించడం అవసరమా? అని తలపోసి విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి, అపార రాజకీయ అనుభవం ఉన్న తెలుగుదేశం అధినేత ముందు చూపుతో రాష్ట్ర రాజధాని అమరాతి నిర్మాణానికి సంకల్పించారు. కాకుండా పాలనను కూడా అక్కడ నుంచే ప్రారంభించారు. 

అప్పటి వరకూ అవమానాలను భరించిన ఆంధ్రుల గుండెలు గర్వంతో ఉప్పొంగాయి. నా రాజధాని నా రాష్ట్రం అన్న నినాదంతో ప్రతి ఆంధ్రుడూ అమరావతి కోసం తన వంతు సహకారం అందించారు. రాజధాని కోసం రైతులు భూములు ఇచ్చారు. చంద్రబాబుపై విశ్వాసం, ఆయన అభివృద్ధి చేస్తారన్న విశ్వసనీయతే రైతులు రాష్ట్ర భవిష్యత్ కోసం భూములిచ్చేందుకు ముందుకు వచ్చేలా చేసింది. అనేక భావోద్వేగాలు, తాతల నాటి భూములతో వారికి ఉన్న అనుబంధం, ఏటా మూడు పంటలు పండే బంగారు భూములను రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్ కోసం ఒక నాయకుడిని నమ్మి అప్పగించడం ఒక చరిత్ర. గతంలో ఎన్నడూ జరగలేదు. భవిష్యత్ లో మళ్ళీ జరుగుతుందని భావించలేం. 

కేవలం చంద్రబాబు దార్శనికతపై ఉన్న విశ్వాసం, నమ్మకంతో వేల ఎకరాల భూమిని రైతులు ఒక్క రక్తం బొట్టు చిందకుండా, ఒక్క లాఠీ విరగకుండా, ఒక్క వివాదం లేకుండా ప్రభుత్వానికి అప్పగించారు. అంతే అమరావతి నిర్మాణం జోరందుకుంది. పాలనా భవనాలు, హైకోర్టు భవనం, అసెంబ్లీ నిర్మాణాలు పూర్తయ్యాయి. దేశం నలుచెరగుల నుంచే కాదు, విదేశాల నుంచి కూడా పెట్టుబడి దారుల దారులన్నీ అమరావతివైపే అన్నట్లుగా సాగాయి. అమరావతి నిర్మాణం జోరందుకుంది. రైతు కూలీలు, చిన్న వ్యాపారులు, భవన నిర్మాణ కార్మికులు ఆలా అందరికీ ఉపాధి లభించింది. అయినా అమరావతి నిర్మాణానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు.. సృష్టిస్తున్నారు. పచ్చి మోసపు మాటలను నమ్మబలికి.. వంచన చేస్తూ..మాయ చేసి, అభూత కల్పనలు.. అసత్య ప్రచారాలు చేసి అమరావతి ప్రాంతాన్ని పాడు పెట్టేసారు. అంతే, నిత్యం కళకళలాడే రాజధాని కళావిహీనం అయిపోయింది.

భూములిచ్చిన రైతుల్ని రోజుకోరకంగా వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ ఆందోళనకు గురి చేశారు. మూడురాజధానులంటూ ఆఖరికి చావు కబురు చల్లగా చెప్పారు. రైతులు భగ్గుమన్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఒకటే దాష్ఢీకం.. దౌర్జన్యం. అణచివేత..నిరంకుశం. బ్రిటీష్ ఇండియా దురాగతాల్ని మించి పోలీసు దమనకాండ సాగింది. వృద్దులు, మహిళలు, పిల్లలు అని కూడా చూడకుండా రక్తం కళ్ళ చూసారు. బయట ప్రపంచానికి కనిపించేలా వినిపించేలా మహాపాదయాత్ర చేసారు. యధావిధిగా రాజ్యం కాలడ్డం పెడితే న్యాయం అనుమతి ఇచ్చింది.   పెద్దన్న పాత్ర వహించాల్సిన కేంద్ర పెద్దలు, రాష్ట్ర బాధ్యులు దుర్మార్గాన్ని అదుపు చేయక్కపోగా మాకు అధికారమిస్తే అప్పుడు న్యాయం చేస్తామన్నారు. భవిష్యత్తు కోసం భూములను త్యాగించిన రైతన్నలు ఈసారి తెగించి ఢిల్లీని చుట్డు ముట్టారు. రైతుల్ని చూసి అరివీర భయంకరులు, అపర చాణుక్యులు అన్న వారే ఉక్కిరి బిక్కిరి అయ్యారు. అయితే, నాలుగేళ్ళుగా చేస్తున్న ఉద్యమం ఒక లెక్క, ఇప్పుడు ఇకనుండి తిరిగి ఇచ్చేది మరొక లెక్క. 

నాలుగేళ్లుగా జగన్ చెప్పిన మూడు రాజధానుల కోసం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు. నిక్కచ్చిగా చెప్పాలంటే ఈ విషయంలో జగన్ దారుణంగా ఓడిపోయారు. అధికారం ఉందని, తాను చెప్పిందే చట్టం అన్నట్లుగా వ్యవహరిస్తే ఎలా ఉంటుందో జగన్ ఈ నాలుగేళ్ళ పాలనే స్పష్టం చేస్తుంది. రైతులు నిరంతరాయంగా పోరాడుతున్నా వారిపై జగన్ పోలీసులు ఎంత రాజ్యహింసకు పాల్పడినా వారు తగ్గలేదు. కేసుల విస్ఫోటం వారిపై పడినా వారు వెనక్కు తగ్గక పోరాడుతున్నారు. రాజీలేని, అలుపెరుగని పోరాటాల తర్వాతే అద్భతాలు జరిగాయనే   సిద్ధాంతం మాదిరి అమరావతి రైతుల పోరాటం తర్వాతే ఇప్పుడు అద్భుతాలు జరిగే సమయం వచ్చింది. మరో మూడు నాలుగు నెలలలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఇటు చూస్తే అమరావతిని ఖూనీ చేయడం.. మూడు రాజధానులను ఇంచి కూడా కదిలించలేకపోవడంతో అమరావతి రైతుల అసమాన పోరాటం ఫలించే  సమయం ఆసన్నమైంది. ఈ అద్భుతానికి డిసెంబర్ 17 (ఆదివారం)సభ నాంది కానుంది.

 రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న ఉద్యమం నాలుగేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆదివాకం (డిసెంబర్ 17) భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. గుంటూరు నాగార్జున యూనివర్శిటీ ఎదుట ఈ భారీ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభకు ఒక్క వైసీపీ నేతలు మినహా అన్ని పార్టీల నేతలూ హాజరవుతున్నారు. సరిగ్గా ఎన్నికలకు ముందు ఈ సభ జరగడం, అందుకు అన్ని పార్టీల మద్దతు ఇస్తుండడం ఇప్పుడు ఏపీ రాజకీయాలలో కీలక మలుపు కానుంది. ఇంకా చెప్పాలంటే ఇకపై అమరావతి రైతులు వేసే ప్రతి అడుగు జగన్ మోహన్ రెడ్డి పాలనను  చరమగీతానికి చేరువ చేయనుంది. ఇన్నాళ్లూ ఉక్కు పాదం మోపి రాజధాని రైతులను జగన్ అణగతొక్కేందుకు ప్రయత్నిస్తే.. ఇప్పుడు అదే రైతులు జగన్ మోహన్ రెడ్డిని అధికారం నుంచి దూరం చేసేలా   సమర శంఖం పూరిస్తున్నారు. అసలే ప్రజలలో పీకల వరకూ అసంతృప్తిని నింపిన జగన్ రెడ్డికి అమరావతి రూపేణా రైతులు భారీ కుదుపును సిద్ధం చేస్తున్నట్లే కనిపిస్తున్నదని  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.