Publish Date:Nov 13, 2024
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఈ వ్యవహారం నడుస్తుంది. బిఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్యేలకు నోటీసులు జారీ అయ్యాయి. నకిరేకల్ మాజీ ఎమ్యెల్యే చిగురుమర్తి లింగయ్యకు నోటీసులు అందాయి. ఈయన గురువారం కోర్టుకు హాజరుకానున్నారు. భువనగిరి, కోదాడ మాజీ ఎమ్యెల్యేలకు నోటీసులు అందాయి. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లు రేవంత్ సర్కార్ ఆరోపిస్తుంది. ఈ కేసు లో ఇప్పటి వరకు పోలీసు అధికారుల ప్రమేయం ఉందని వార్తలు వచ్చాయి. అనూహ్యంగా బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఈ ఉచ్చులో ఇరుక్కున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఎస్ బి ఐ మాజీ చీఫ్ ప్రభారకర్ కూడా నల్లొండ జిల్లా ఎస్ పిగా పని చేశారు. ఇదే కేసులో జైల్లో ఉన్న తిరుపతన్న జిల్లాలో వివిధ స్థాయిలో పని చేసిన వారే. బిఆర్ఎస్ కు చెందిన భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి , కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ కు నోటీసులు అందాయి. బిఆర్ఎస్ రూలింగ్ లో ఉన్నప్పుడు 2023లో జరిగిన మునుగోడు ఉపఎన్నిక వేళ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/four-former-brs-mlas-in-phone-tapping-trap-25-188321.html
భారతీయ రాజకీయ రంగంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
దసరా పండుగ సెలవులు ప్రారంభం కావడంతో భాగ్యనగరంలో ప్రయాణికుల రద్దీ తారాస్థాయికి చేరింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రముఖ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లైంగిక వేధింపుల ఉదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి హసిరాణి రథ్ భారీ విజయం సాధించారు.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏవియేషన్ రంగానికి సంబంధించి అత్యంత కీలకమైన చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది.
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన 2026 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయకోవిదురాలు నవనీతం నవి పిళ్లై గెలుచుకున్నారు.
అర్ధరాత్రి వేళ రోడ్లపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.